సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ఏఎస్ఐ ప‌రిధిలో ఉంటూ ప్రార్థనా స్థలాలను కలిగి ఉన్న 820 కేంద్ర రక్షిత స్మారక కేంద్రాలు రేప‌టి నుంచి తెరవబడతాయి: మ‌ంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్

- కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన అన్ని ర‌కాల ప్రోటోకాల్స్ పాటించబడతాయి

Posted On: 07 JUN 2020 6:29PM by PIB Hyderabad

భార‌త పురావ‌స్తు విభాగం (ఏఎస్ఐ) ప‌రిధిలో ఉంటూ ప్రార్థనా స్థలాలు కలిగి ఉన్న దాదాపు 820 కేంద్ర రక్షిత స్మారక చిహ్న‌పు కేంద్రాల‌‌ను (సీపీఎం) సోమ‌వారం (8వ తేదీ) నుంచి తిరిగి తెరిచేందుకు గాను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ త‌న ఆమోదం తెలిపినట్లు కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి (స్వ‌తంత్ర హోదా) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. ఈ స్మారక కేంద్రాల‌లో కేంద్ర హోం శాఖ (ఎంహెచ్‌ఏ), ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన అన్ని ప్రోటోకాల్‌లను అనుసరిస్తామని శ్రీ పటేల్ తెలిపారు.
https://twitter.com/prahladspatel/status/1269495094245093382?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1269495094245093382&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1630072
 
మతపరమైన ప్రదేశాలలో / ప్రార్థనా స్థలాలలో కోవిడ్ -19 వైర‌స్ వ్యాప్తిని సమర్థవంతంగా క‌ట్ట‌డి చేసేందుకు గాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 4.6.2020 న జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపి) లో నిర్దేశించిన నివారణ చర్యలు అమ‌ల‌య్యేలా ఏఎస్ఐ త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వులో పేర్కొంది. కేంద్ర స‌ర్కారు రక్షిత స్మారక కట్టడాలను తెరిచేటప్పుడు మరియు నిర్వహించేటప్పుడు త‌మ శాఖ అన్ని అవ‌స‌ర‌మైన జాగ్రత్తల‌ను అనుసరిస్తుంద‌ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటికి తోడు ఇక‌పై కూడా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఇతర ఆదేశాలను పాటించేలా ఏఎస్ఐ మరింత నిర్ధారిస్తుంద‌ని ఈ శాఖ త‌న ఆదేశాల‌లో తెలిపింది. 08.06.2020 నుంచి తిరిగి తెర‌వాల‌ని ప్రతిపాదించిన 820 సీపీఎంల జాబితాను సంబంధిత రాష్ట్రాలు మరియు సంబంధిత జిల్లాల యంత్రాంగం వారితోనూ పంచుకోవాలని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏఎస్ఐని కోరింది. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆయా రాష్ర్టాలు లేదా జిల్లాలకు చెందిన యంత్రాంగం ఆయా కేంద్రాల‌లో కోవిడ్ వ్యాప్తి నిరోధకతకు సంబంధించి ఆయా చ‌ర్య‌ల‌ను సమగ్రంగా అమలు చేసేందుకు వీలు ఉంటుంద‌ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ త‌న ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది.

ఏఎస్ఐ ర‌క్షిత స్మారక చిహ్నాపు కేంద్రాల‌ జాబితా కోసం దయచేసి ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండిః


(Release ID: 1630114) Visitor Counter : 203