రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆప‌రేష‌న్ స‌ముద్ర సేతు- మాల్దీవుల నుంచి 700 మంది భార‌తీయుల‌ను తీసుకొని ట్యుటికోరిన్‌ చేరుకున్న ఐఎన్ఎస్ నౌక‌ జ‌లాశ్వ

Posted On: 07 JUN 2020 7:31PM by PIB Hyderabad

ఆప‌రేష‌న్ స‌ముద్ర‌సేతు కార్య‌క్ర‌మంలో భాగంగా భార‌త నావికా ద‌ళం నౌక ఐఎన్ఎస్ జ‌లాశ్వ మాల్దీవుల‌లోని మాలే నుంచి 700 మంది భార‌తీయులను  తీసుకొని త‌మిళ‌నాడులోని ట్యుటికోరిన్‌కు చేరుకుంది. ఆదివారం ఈ నౌక త‌మిళ‌నాడులోని ట్యుటికోరిన్‌కు చేరింది. దీంతో భార‌త్ మిష‌న్‌లో భాగంగా ఐఎన్ఎస్ జ‌లాశ్వ మాల్దీవులు, శ్రీ‌లంక‌ల నుంచి మొత్తం 2672 మంది భార‌త పౌరుల‌ను స్వ‌దేశానికి తీసుకువ‌చ్చింది. భార‌తీయుల‌ను స్వదేశానికి తీసుకు వ‌చ్చేందుకు గాను ఇండియ‌న్ మిష‌న్ ఇన్ మాల్దీవ్స్ త‌గిన వీలును కల్పించింది. అవసరమైన మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించిన తరువాత ఈ నౌక‌లోకి ప్ర‌యాణికుల‌ను ఎక్కించి తీసుకువ‌చ్చారు. సముద్ర మార్గంలో ప్రయాణించేటప్పుడు కూడా నౌక‌లోని ప్ర‌యాణికులు కోవిడ్‌-19కు సంబంధించిన
భద్రతా ప్రోటోకాల్స్ పాటించేలా త‌గిన‌ చ‌ర్య‌లు తీసుకున్నారు. మాల్దీవుల నుంచి భార‌త్ త‌ర‌లి వ‌చ్చిన వారు ట్యుటికోరిన్‌ వద్ద స్థానిక అధికారులు స్వాగ‌తం ప‌లికారు. భార‌త్‌కు చేరుకున్న వారు త్వరగా స్వ‌స్థ‌లాల‌కు చేరుకోవ‌డం, ఆరోగ్య పరీక్షలు, ఇమ్మిగ్రేషన్ మరియు తరలింపున‌కు కావాల్సిన‌ రవాణాకు కావాల్సిన త‌గు ఏర్పాట్ల‌ను కూడా అధికారులు చేప‌ట్టారు. ఈ తాజా తరలింపుతో, కోవిడ్ -19 వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా భారత నావికాదళం ప్రస్తుతం మాల్దీవులు మరియు శ్రీలంక నుండి 2874 మంది భారత‌ పౌరులను స్వదేశానికి తిరిగి తీసుకు వ‌చ్చిన‌ట్ట‌యింది. 

 



(Release ID: 1630110) Visitor Counter : 272