వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ సమయంలో 3965 రైలు రేకుల ద్వారా సుమారు 111.02 ఎల్ఎంటి ఆహార ధాన్యాలు రవాణా

ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజి కింద రాష్ట్రాలు/యూటీ లు 4.42 ఎల్ఎంటి ల ఆహార ధాన్యాల లిఫ్ట్ చేసి 15,413 ఎంటిలను పంపిణీ చేశాయి

పీఎంజికేఏవై కింద రాష్ట్రాలు/యుటీ లు 105.10 ఎల్ఎంటి ఆహారధాన్యాలు, 4.71 ఎల్ఎంటి పప్పుదినుసులు పొందాయి

Posted On: 07 JUN 2020 7:02PM by PIB Hyderabad
లాక్ డౌన్ 2020 మార్చి 24 న ప్రకటించినప్పటి నుండి సుమారు 111.02 ఎల్ఎంటి ఆహార ధాన్యాలు 3965 రైలు రేకుల ద్వారా ఎత్తి రవాణా చేశారు. రైలు మార్గమే కాకుండా, రోడ్లు, జలమార్గాల ద్వారా కూడా రవాణా జరిగింది. మొత్తం 234.51 ఎల్‌ఎమ్‌టి రవాణా అయింది. 13 ఓడల ద్వారా 15,500 మెట్రిక్ టన్నుల ధాన్యాలు రవాణా చేశారు. మొత్తం 11.30 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు ఈశాన్య రాష్ట్రాలకు రవాణా జరిగింది. ఎన్ఎఫ్ఎస్ఏ, పీఎంజికేఏవై కింద, వచ్చే 3 నెలలకు ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 11.5 ఎల్ఎంటి  ఆహార ధాన్యాలు అవసరం. 

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లేదా రాష్ట్ర పథకం పిడిఎస్ కార్డుల పరిధిలోకి రాని సుమారు 8 కోట్ల మంది వలస కూలీలు, వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారికీ, అవసరమైన కుటుంబాలకు 8 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి వ్యక్తికి 5 కిలోల ఆహార ధాన్యాలు మే మరియు జూన్ నెలలకు ఉచితంగా పంపిణీ జరుగుతోంది. రాష్ట్రాలు, యుటిలు 4.42 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలను లిఫ్ట్ వేసి, 20,26 లక్షల మంది లబ్ధిదారులకు 10,131 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేశారు. 1.96 కోట్ల వలస కుటుంబాలకు 39,000 మెట్రిక్ పప్పులను పంపిణీ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లేదా రాష్ట్ర పథకమైన పిడిఎస్ కార్డుల పరిధిలోకి రాని 8 కోట్ల మంది వలస కూలీలు, వివిధ చోట్ల చిక్కుకున్న వారికి, నిరుపేద కుటుంబాలకు మే, జూన్ నెలలకు ఒక కుటుంబానికి ఒక కిలో పప్పును ఉచితంగా ఇస్తారు. పప్పు కేటాయింపు రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా జరుగుతోంది..

సుమారు 28,306 మెట్రిక్ టన్నుల పప్పుదినుసులు రాష్ట్రాలు, యుటిలకు పంపారు. మొత్తం 15,413 మెట్రిక్ టన్నుల దినుసులు వివిధ రాష్ట్రాలు, యుటిలు తీసుకున్నాయి. 631 మెట్రిక్ టన్నుల పప్పుదినుసులను రాష్ట్రాలు, యుటిలు పంపిణీ చేశాయి. కేంద్ర ప్రభుత్వం 100% ఆర్థిక భారాన్ని సుమారు రూ.3,190 కోట్లు ఆహార ధాన్యానికి పప్పు దినుసులు రూ .280 కోట్లు భరిస్తుంది. 

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన:

పీఎంజికేఏవై కింద, ఏప్రిల్-జూన్ 3 నెలలకు మొత్తం 104.4 ఎల్ఎంటి బియ్యం, 15.6 ఎల్ఎంటి గోధుమలు అవసరమవుతాయి, వీటిలో 91.40 ఎల్ఎంటి బియ్యం, 13.70 ఎల్ఎంటి గోధుమలను వివిధ రాష్ట్రాలు, యుటిలు తీసుకున్నాయి. మొత్తం 105.10 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు లిఫ్ట్ చేసాయి. ఏప్రిల్ 36.98 ఎల్‌ఎమ్‌టి (92.45%), మే నెలకు 34.93 ఎల్‌ఎమ్‌టి (87.33%), జూన్ నెలకు 6.99 ఎల్‌ఎమ్‌టి (17.47) పంపిణీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 100% ఆర్థిక భారాన్ని సుమారు రూ. 46,000 కోట్లు ఈ పథకం కింద భరిస్తోంది. 6 రాష్ట్రాలు / యుటిలకు గోధుమలు కేటాయించబడ్డాయి, - పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీగ,ఢిల్లీ, గుజరాత్, మిగిలిన రాష్ట్రాలు / యుటిలకు బియ్యం అందించారు. 

పప్పుధాన్యాల విషయానికొస్తే, మూడు నెలల మొత్తం అవసరం 5.87 ఎల్‌ఎమ్‌టి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సుమారు రూ .5 వేల కోట్ల 100% ఆర్థిక భారాన్ని మోస్తోంది. ఇప్పటివరకు, 4.71 ఎల్‌ఎమ్‌టి పప్పులు రాష్ట్రాలు / యుటిలకు చేరుకోగా, 2.67 ఎల్‌ఎమ్‌టి పప్పులు పంపిణీ చేశారు.

ఓఎంఎస్ఎస్ కింద, బియ్యం ధర కిలోకు రూ .22, గోధుమలు కిలోకు రూ .21 గా నిర్ణయించారు. లాక్ డౌన్ కాలంలో ఎఫ్‌సిఐ 5.46 ఎల్‌ఎమ్‌టి గోధుమలు, 8.38 ఎల్‌ఎమ్‌టి బియ్యాన్ని ఒఎంఎస్‌ఎస్ ద్వారా విక్రయించింది.

06.06.2020 నాటికి మొత్తం 371.31 ఎల్‌ఎమ్‌టి గోధుమలు (ఆర్‌ఎంఎస్ 2020-21), 720.85 ఎల్‌ఎమ్‌టి బియ్యం (కెఎంఎస్ 2019-20) సేకరించారు.

 

మొత్తం అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాల నిల్వలు:

06.06.2020 నాటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఎఫ్‌సిఐలో ప్రస్తుతం 269.79 ఎల్‌ఎమ్‌టి బియ్యం, 537.46 ఎల్‌ఎమ్‌టి గోధుమలు ఉన్నాయి.  మొత్తం మీద 807.25 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యం నిల్వ అందుబాటులో ఉంది (గోధుమలు, వరి కొనుగోలును మినహాయించి, ఇవి ఇంకా గోడౌన్‌కు చేరుకోలేదు). ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ, ఇతర సంక్షేమ పథకాల కింద నెలకు సుమారు 55 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు అవసరం.

 

ఒకే దేశం ఒకే రేషన్ కార్డు: 

2020 జూన్ 01 నాటికి, 20 రాష్ట్రాలు / యుటిలలో ఒకే దేశం, ఒకే కార్డు పథకం ప్రారంభం అయింది, అవి - ఆంధ్రప్రదేశ్, బీహార్, డామన్ & డయు (దాద్రా, నాగర్ హవేలి), గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, త్రిపుర. ఆగస్టు 2020 లో మరో మూడు రాష్ట్రాలు - ఉత్తరాఖండ్, నాగాలాండ్ మరియు మణిపూర్ కూడా ఈ పథకం కిందకు వస్తాయి. మార్చి 31, 2021 నాటికి మిగిలిన 13 రాష్ట్రాలు ఐకే దేశం, ఒకే రేషన్ కార్డు పథకం కిందకు వస్తాయి. ఈ పథకం భారతదేశం అంతటా పనిచేస్తుంది.

 

మిగిలిన 13 రాష్ట్రాలు/యుటీల వివరాలు -

 

క్రమ సంఖ్య

రాష్ట్రం 

ఈపోస్ %

ఆధార్ తో రేషన్ కార్డు అనుసంధానం  (%)

1

లడాఖ్ 

100%

91%

2

తమిళనాడు 

100%

100%

3

లక్షద్వీప్ 

100%

100%

4

జమ్ము కశ్మీర్ 

99%

100%

5

ఛత్తీస్గఢ్ 

97%

98%

6

అండమాన్ నికోబర్ 

96%

98%

7

పశ్చిమ బెంగాల్ 

96%

80%

8

అరుణాచల్ ప్రదేశ్ 

1%

57%

9

ఢిల్లీ 

0%

100%

10

మేఘాలయ 

0%

1%

11

అసోం 

0%

0%

12

పుడిచ్చేరి 

0%

100%(డీబీటీ )

13

చండీగఢ్ 

0%

99%(డీబీటీ)

ఈసీ చట్టం:

కోవిడ్-19 కారణంగా పెరిగిన డిమాండ్ దృష్ట్యా వినియోగదారుల వ్యవహారాల శాఖ ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్‌లను నిత్యావసర వస్తువుల చట్టం కింద నోటిఫై చేసింది. మాస్కులు, శానిటైజర్లు, వాటి తయారీలో ఉపయోగించే పదార్థాల ధరలు కూడా పరిమితం చేసింది. లాక్ డౌన్ వలన సరఫరా-గొలుసు నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు లేవని నిర్ధారించడానికీ,  అన్ని నిత్యావసర వస్తువుల ధరలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి  రాష్ట్రాలకు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఇసి చట్టం కింద నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం అన్ని అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది.

****

 


(Release ID: 1630083) Visitor Counter : 327