సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

జూన్ 8 - జూలై 3 వరకు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ వారి ఆన్‌లైన్ నైయిమిషా 2020- సమ్మర్ ఆర్ట్ కార్య‌క్ర‌మం

- ఆన్‌లైన్ నైయిమిషా 2020 కార్య‌క్ర‌మంలో భాగంగా నాలుగు వర్క్‌షాప్‌ల‌ నిర్వహ‌ణ‌

Posted On: 07 JUN 2020 1:20PM by PIB Hyderabad

 

నైయిమిషా 2020- సమ్మర్ ఆర్ట్ కార్య‌క్ర‌మాన్ని సోమ‌వారం (8వ తేదీ) నుంచి జూలై 3 తేదీ వరకు నిర్వ‌హించ‌నున్న‌ట్లు న్యూఢిల్లీకి చెందిన నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్‌జీఎంఏ)
సంస్థ ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి కార‌ణంగా లాక్‌డౌన్ అమ‌ల‌వుతున్న కార‌ణంగా  మ్యూజియంలు మరియు సాంస్కృతిక సంస్థల‌లోకి సందర్శకులు మరియు ప్రేక్షకుల‌కు గ‌తంలో మాదిరిగా అనుమ‌తి లేదు. ఇది ఎన్‌జీఎంఏ తన ప్రేక్షకులకు చేరుకోవడానికి కొత్త ప్రాంతాల‌ను మరియు ఆధునిక‌ వేదికలను అన్వేషించడానికి దారితీసింది. గడిచిన‌ రెండు నెలలు అంత‌కు మించిన స‌మ‌యంలో ఎన్‌జీఎంఏ అనేక కార్యక్రమాల‌ను మరియు వివిధ ప్రదర్శనలను వ‌ర్చువ‌ల్ విధానంలో నిర్వహించింది. దేశంలో సాంకేతిక అభివృద్ధి అటువంటి కార్యక్రమాలను డిజిటల్‌గా నిర్వహించడానికి అవకాశాన్ని అందిస్తోంది. దీంతో ఎన్‌జీఎంఏ తన అత్యంత ప్రాచుర్యం పొందిన సమ్మర్ ఆర్ట్ ప్రోగ్రాం నైయిమిషాను డిజిటల్ వేదిక‌గా నిర్వహించే దిశ‌గా ప్రయత్నాలు మొద‌లు పెట్టింది.
ప్ర‌క‌ట‌న‌కు అనూహ్య స్పంద‌న‌..
న్యూ ఢిల్లీలోని ఎన్‌జీఎంఏ నెల రోజుల ఆన్‌లైన్ స‌మ్మ‌ర్ కార్య‌క్ర‌మంలో పాల్గొనే వారు ప్రాక్టిసింగ్ ఆర్టిస్టుల నుంచి నేర్చుకోవ‌డం, న‌వ ఆవిష్క‌ర‌ణ‌లు వంటి వాటిని చేరు‌వచేసేలా ప‌లు చ‌ర్య‌లు తీసుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్టిస్టుల ఆరోగ్యం విష‌యంలో ఏలాంటి రాజీ లేకుండా క‌ళాకారులు పాల్గొనేలా వేదిక‌ను తీర్చిదిద్దింది. వ‌ర్చువ‌ల్ విధానంలో క‌ళాకారులు కార్య‌క్ర‌మంలో నిమ‌గ్న‌త‌ను మ‌రింత పెంచే విధంగా ఎన్‌జీఎంఏ నాలుగు ఇన్‌క్ల్యూజివ్ వ‌ర్క్‌షాపుల‌ను ఎన్‌జీఎంఏ ప్రణాళికబ‌ద్ధం చేసింది. జూన్ 1 వ తేదీన ఈ నాలుగు వర్క్‌షాప్‌లకు సంబంధించిన ప్రకటనకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఔత్సాహికుల నుంచి దాదాపుగా 600 రిజిస్ట్రేషన్‌లు ల‌భించాయి. ఆన్‌లైన్ నైయిమిషా - 2020 కార్యక్రమంలో, చిత్ర‌క‌ళ వర్క్‌షాప్, శిల్ప క‌ళ‌, అచ్చు త‌యారీ మరియు ఇంద్రజల్ - ది మేజిక్ ఆఫ్ ఆర్ట్ (స్వేచ్ఛను అర్థం చేసుకోవడానికి ఇంటర్ డిసిప్లినరీ క్రియేటివ్ వర్క్‌షాప్) అనే పేరుతో నాలుగు కార్య‌శాల‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. జూన్ 8 నుండి జూలై 3వ తేదీ వరకు వీటిని నిర్వ‌హించ‌నున్నారు.
రెండు గ్రూపులుగా సెష‌న్ల ఏర్పాటు..
ఆన్‌లైన్ వర్క్‌షాప్‌ల సెషన్‌లు రెండు గ్రూపులుగా నిర్వహించబడతాయి: గ్రూపు 1:- 6 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు: ఉదయం 11 నుండి 11.35 వరకు మరియు గ్రూపు 2:- 16 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వ‌య‌స్కుల వారికి ఎలాంటి
ముగింపు సమయ పరిమితి లేకుండా: సాయంత్రం 4.00 నుండి సాయంత్రం 4.35 మ‌ధ్య
నిర్వ‌హించ‌బ‌డ‌తాయి.
ఈ ప్ర‌ద‌ర్శ‌న ఒక గొప్ప ముంద‌డుగు..
నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్‌జీఎంఏ) డైరెక్టర్ జనరల్ శ్రీ అద్వైత చరణ్ గరణాయక్ మాట్లాడుతూ.. "నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్‌జీఎంఏ) మొదటి డైరెక్టర్ జనరల్‌గా మ్యూజియంలను వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రజలంద‌రికీ అందుబాటులో ఉంచాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. సమాజంలోని అన్ని వర్గాల వారిని మ్యూజియం మరియు దాని వివిధ కార్యకలాపాలలో నిమ‌గ్నం చేసే దిశ‌గా సమ్మర్ ఆర్ట్ ప్రోగ్రాం -2020 ఒక గొప్ప ముంద‌డుగు.
సోమవారం నుండి తాను సీనియర్- జూనియర్ కళాకారుడితో పాటు మీ తెరపైకి చేరుకుంటాను మరియు మనమందరం కలిసి కళను నేర్చుకోవడానికి వాటిలో కొత్త విధానాల‌ను సృష్టించ‌డానికి ప్ర‌య‌త్నిద్దాం. నైయిమిషా అనే కార్యక్రమం శీర్షిక ప్రజలు తమ శ్రద్ధ లేదా భక్తిని అందించే పవిత్ర స్థలాన్ని సూచిస్తుంది. ఎన్‌జీఎంఏ సంస్థ ప‌రిధిని విస్తృతం చేయ‌డం ద్వారా మ‌రీ ముఖ్యంగా విద్యా రంగంలో ఒక సంస్థ‌గా విస్తృతమ‌వ‌డం ద్వారా సమాజంలోని ప్రతి భాగానికి చేరువ‌కాగ‌ల‌ద‌ని నేను విశ్వ‌సిస్తున్నాను" అని  అన్నారు.
వివిధ ఆన్‌లైన్ వేదిక‌ల‌పైనా ప్ర‌ద‌ర్శ‌న‌లు..
నైయిమిషా -2020 సమ్మర్ ఆర్ట్ ప్రోగ్రాం ప్ర‌ద‌ర్శ‌న‌లో ఎంపిక‌చేసిన‌ కళాకృతులు ప్రజల వీక్షణ కోసం ఎన్‌జీఎంఏ సాంస్కృతిక మీడియా వేదిక అయిన ఎస్ఓ-హెచ్ఏఎం (SO-HAM) లో ప్రదర్శించబడుతాయి. ఆయా కార్యకలాపాల వివరాలు ఎన్‌జీఎంఏ యొక్క అధికారిక వెబ్‌సైట్ మరియు ఫేస్‌బుక్ పేజీల‌లోనూ అందుబాటులో ఉంటాయి. మ‌రింత‌ నవీకరించిన స‌మాచారం కోసం దయచేసి సందర్శించండి:

ఎన్‌జీఎంఏ వెబ్‌సైట్: http://ngmaindia.gov.in/

ఎన్‌జీఎంఏ, న్యూఢిల్లీ ఫేస్‌బుక్ పేజీ : https://www.facebook.com/ngmadelhi

ఎన్‌జీఎంఏ ట్విట్ట‌ర్: https://twitter.com/ngma_delhi


 

*******


(Release ID: 1630073) Visitor Counter : 257