ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మోడీ ప్రభుత్వం 2.0 కింద డిఓఎన్ఈఆర్ మంత్రిత్వ శాఖ ఒక ఏడాది విజయాల పుస్తకాన్ని, ఈ-వెర్షన్ ని ఆవిష్కరించిన

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

అభివృద్ధి & కరోనా నిర్వహణ లో ఆదర్శంగా నిలిచిన ఎన్-ఇ రీజియన్

2019-20లో 100% ఖర్చు చేసిన డిఓఎన్ఈఆర్ మంత్రిత్వ శాఖను ప్రశంసించిన డాక్టర్ సింగ్

Posted On: 06 JUN 2020 5:08PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంతం (డిఓఎన్ఈఆర్), పిఎంఓ, సిబ్బంది, ప్రజాసమస్యలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ (ఇండిపెండెంట్) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మంత్రిత్వ శాఖ సాధించిన ఒక సంవత్సరం విజయాలపై ఈ రోజు చిన్న పుస్తకాన్ని, దాని ఇ-వెర్షన్‌ను విడుదల చేశారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి విభాగం, డిఓఎన్ఈఆర్ మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో  డిఓఎన్ఈఆర్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కార్యదర్శి ఎన్‌ఇసి మరియు ఇతర సీనియర్ అధికారులు షిల్లాంగ్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

 

గడచిన ఆరు నెలల్లో ఈశాన్య ప్రాంతం అభివృద్ధితోనే కాకుండా, ఇటీవలి కరోనా నిర్వహణలో కూడా ఆదర్శనంగా నిలిచింది, పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి ఎనలేని కృషి చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. 2019-20కేటాయింపులను పూర్తి స్థాయిలో వినియోగించి, రోడ్, రైలు, విమాన మార్గాల అభివృద్ధిలో గణనీయమైన ప్రగతి సాధించిందని ఆయన వెల్లడించారు. పార్సెల్ సదుపాయాలతో పాటు ఇప్పటివరకు ఈ ప్రాంతానికి 400 టన్నులకు పైగా ఎయిర్ కార్గో సరఫరా అయింది. కోవిడ్ తర్వాతి రోజుల్లో వెదురుకు ప్రత్యేక ప్రేరణ లభిస్తుందని, యువ పారిశ్రామికవేత్తలు వివిధ రంగాలలో ఒక ముద్ర వేస్తారని ఆయన అన్నారు

 .

 

ఈశాన్య ప్రాంతంలోని మౌలిక సదుపాయాలు, ఇంధనం, తదితర రంగాలలో గత ఏడాది గణనీయమైన అభివృద్ధిని సాధించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం కనీసం 10% జిబిఎస్ ను కేటాయించే ప్రభుత్వ విధానం ప్రకారం, మినహాయింపు లేని 55 విభాగాలు సవరించిన అంచనాల దశలో రూ.53,374 కోట్ల ని ఈశాన్య రాష్ట్రాలకు అందించాయి. రైల్వేలకు జిబిఎస్‌తో పాటు రూ .4745 కోట్లు కేటాయించారు. 

గత సంవత్సర కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో అనేక పెద్ద ప్రాజెక్టులు ఆమోదం పొందడం, కొన్ని ప్రారంభం కావడం, మరి కొన్ని పూర్తీ కావడం జరిగింది. 

మొత్తం అక్కడి 8 రాష్ట్రాలలోను అమలయ్యేలా 1656 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్ గ్రిడ్ ఇంద్రధనుష్ గ్యాస్ గ్రిడ్ ప్రాజెక్ట్ రూ. 9265 కోట్లతో ఆమోదం పొందింది. అరుణాచల్ ప్రదేశ్ కి రాజధానితో అనుసంధానం చేసేలా గ్రీన్ఫీల్డ్ హాల్లోంగి విమానాశ్రయం పనులు ప్రారంభమయ్యాయి. దక్షిణ త్రిపుర, బంగ్లాదేశ్ లోని చట్టోగ్రామ్ కి అనుసంధానం చేసేలా రైలు మార్గం పూర్తయింది.  ఇంకా డబ్లింగ్ పనులు, విద్యుదీకరణ, గేజ్ మార్పిడి పనులు ప్రారంభమయ్యాయి. రూ.7,707.17 కోట్ల అంచనాలతో 35 జాతీయ ప్రధాన రహదారి ప్రాజెక్టులు మంజూరయ్యాయి. 3 ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఓడల ద్వారా భారీగా సరుకు రవాణా చేసే ప్రాజెక్టులు రూ.305.84 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కృషి ఉడాన్ పథకం ప్రారంభమై, వివిధ వ్యవసాయ ఉత్పత్తులు బాగ్డోగ్ర, గువాహటి, అగర్తలా విమానాశ్రయాల నుండి రవాణా అవ్వడం ప్రారంభించారు. అన్ని అనుమతులను పొంది, అడ్డంకులను తొలగించుకుని అరుణాచల్ ప్రదేశ్ లో 2000 మెగావాట్ల సుబంసిరి జల విద్యుత్ కేంద్రం పనులు ప్రారంభించారు. 2023కి అది పూర్తవుతుంది. 

 

<><><>



(Release ID: 1629979) Visitor Counter : 241