మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మాతృత్వం వయస్సు, ఎంఎంఆర్ ను తగ్గించాల్సిన అవసరాలు, పోషక స్థాయిల మెరుగుదల వంటి సమస్యలకు సంబంధించిన విషయాలను పరిశీలించడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
శ్రీమతి జయ జైట్లీ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ 2020 జూలై 31 లోగా తన నివేదికను సమర్పించనుంది
దాని సిఫారసులకు మద్దతు ఇవ్వడానికి ప్రస్తుత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు, సవరణలను ఇది సూచిస్తుంది; ఈ సిఫార్సులను అమలు చేయడానికి సమయపాలనతో వివరణాత్మక రోల్-అవుట్ ప్రణాళికను రూపొందిస్తారు
Posted On:
06 JUN 2020 11:53AM by PIB Hyderabad
మాతృత్వం వయస్సు, ఎంఎంఆర్ ను తగ్గించాల్సిన అవసరాలు, పోషక స్థాయిల మెరుగుదల వంటి సమస్యలకు సంబంధించిన విషయాలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ 4న టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్ర ఆర్థిక మంత్రి, పార్లమెంటులో 2020-21 బడ్జెట్ ప్రసంగంలో ఇలా అన్నారు, “ 1929 నాటి శారదా చట్టాన్ని సవరించడం ద్వారా మహిళల వివాహ వయస్సు 1978 లో పదిహేనేళ్ళ నుండి పద్దెనిమిది సంవత్సరాలకు పెరిగింది, భారతదేశం మరింత అభివృద్ధి చెందుతున్నప్పుడు, మహిళలు ఉన్నత విద్య, వివిధ వృత్తుల్లో ఎదగడానికి అవకాశాలు పెరిగాయి. ఎంఎంఆర్ ను తగ్గించడంతో పాటు పోషకాహార స్థాయిని మెరుగుపరచాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మాతృత్వంలోకి ప్రవేశించే అమ్మాయి వయస్సు కి సంబంధించిన మొత్తం సమస్యను చూడాలి. ఆరునెలల వ్యవధిలో దాని సిఫారసులను సమర్పించే టాస్క్‌ఫోర్స్‌ను నియమించాలని నేను ప్రతిపాదించాను .. ” (రిఫరెన్స్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రసంగంలో పేరా 67).
టాస్క్ ఫోర్క్ కూర్పు ఇలా ఉంది :
1. శ్రీమతి జయ జైట్లీ (న్యూఢిల్లీ) - చైర్‌పర్సన్
2. డాక్టర్ వినోద్ పాల్, సభ్యుడు (ఆరోగ్యం), నీతి ఆయోగ్ - సభ్యుడు (ఎక్స్-అఫిషియో)
3. కార్యదర్శి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ - సభ్యుడు (ఎక్స్-అఫిషియో)
4. కార్యదర్శి, మహిళలు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ - సభ్యుడు (ఎక్స్-అఫిషియో)
5. కార్యదర్శి, ఉన్నత విద్య శాఖ - సభ్యుడు (ఎక్స్-అఫిషియో)
6. కార్యదర్శి, పాఠశాల విద్య, అక్షరాశ్యత శాఖ - సభ్యుడు (ఎక్స్-అఫిషియో)
7. కార్యదర్శి, శాసన విభాగం - సభ్యుడు (ఎక్స్-అఫిషియో)
8. శ్రీమతి. నజ్మా అక్తర్ (న్యూ ఢిల్లీ) - సభ్యులు.
9. శ్రీమతి వసుధ కామత్ (మహారాష్ట్ర) - సభ్యుడు
10. డా. దీప్తి షా (గుజరాత్) - సభ్యుడు
టాస్క్ ఫోర్స్ ఉల్లేఖన నిబంధనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
i. (ఎ) ఆరోగ్యం, వైద్య శ్రేయస్సు, తల్లి- నెలనిండని శిశువు/ శిశు / పిల్లల పోషక స్థితి, గర్భధారణ సమయంలో, పుట్టినప్పుడు మరియు తరువాత , (బి) శిశు మరణాల రేటు (ఐఎంఆర్), ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్), మొత్తం సంతానోత్పత్తి రేటు (టిఎఫ్ఆర్), పుట్టినప్పుడు సెక్స్ నిష్పత్తి (ఎస్ఆర్బి), చైల్డ్ సెక్స్ రేషియో (సిఎస్ఆర్) (సి) ఆరోగ్యం, పోషణకు సంబంధించిన ఇతర అంశాలు.
ii) మహిళల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించే చర్యలను సూచించడం
iii)టాస్క్ ఫోర్స్ సిఫారసులకు మద్దతు ఇవ్వడానికి తగిన చట్టాలు, ఇప్పటికే ఉన్న చట్టాలలో సవరణలను సూచించడం
iv) టాస్క్ ఫోర్స్ సిఫారసులను అమలు చేయడానికి సమయపాలనతో కూడిన ప్రణాళిక
v) టాస్క్ ఫోర్స్ ఇతర నిపుణులను దాని సమావేశాలకు ఆహ్వానించవచ్చు
vi) టాస్క్ ఫోర్స్ కి నీతి ఆయోగ్ సెక్రటేరియల్ సహాయం అందిస్తుంది. 2020 జూలై 31 లోగా తన నివేదిక అందజేస్తుంది.
***
(Release ID: 1629919)
Visitor Counter : 452