బొగ్గు మంత్రిత్వ శాఖ
కోల్ ఇండియా కు చెందిన వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ 3 కొత్త బొగ్గు గనులను తెరిచింది
ఉద్యోగులు మరియు వాటాదారులతో డిజిటల్‌గా సంబంధాలు పెంపొందించుకోడానికి వీలుగా సంవాద్ యాప్ ను ప్రారంభించింది.
గనుల కార్యకలాపాలను "డబ్ల్యూ.సి.ఎల్-ఐ" పర్యవేక్షించనుంది.
Posted On:
06 JUN 2020 3:15PM by PIB Hyderabad
కోల్ ఇండియా అనుబంధ సంస్థ, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యు.సి.ఎల్.) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో 3 కొత్త బొగ్గు గనులను ప్రారంభించింది. వీటి మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.9 మిలియన్ టన్నులు (ఎం.టి.). ఈ ప్రాజెక్టులపై కంపెనీ మొత్తం మూలధన వ్యయం (కాపెక్స్) 849 కోట్ల రూపాయలు కాగా, 647 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్; మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ థాకరే; కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ; కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ గనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి డబ్ల్యు.సి.ఎల్. 75 మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలి. కంపెనీ లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నాలకు, ఈ గనులను తెరవడం తోడ్పడుతుంది మరియు 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి కోల్ ఇండియా 1 బిలియన్ టన్నుల (బి.టి.) బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి కూడా ఇది సహాయ పడుతుంది. ” అని అన్నారు.
ఇప్పడు ప్రారంభించిన మూడు గనుల వివరాలు,
(i) మహారాష్ట్రకు చెందిన నాగపూర్ ప్రాంతంలోని అదాసా గని,. ఇది భూమి లోపల నుండి వెలుపలికి ఉన్న ఓపెన్ కాస్ట్ గని; ఈ గని యొక్క వార్షిక బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం 1.5 మెట్రిక్ టన్నులు.
(ii) కన్హన్ ప్రాంతంలో శారదా భూగర్భ గని; ఈ గని యొక్క వార్షిక బొగ్గు ఉత్పత్తి సామర్ధ్యం 0.4 మెట్రిక్ టన్నులు.
(iii) మధ్య ప్రదేశ్ లోని పెంచ్ ప్రాంతంలోని ఢంకాసా భూగర్భ గని, ఈ గని యొక్క వార్షిక బొగ్గు ఉత్పత్తి సామర్ధ్యం ఒక మెట్రిక్ టన్ను.
మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం "డబ్ల్యు.సి.ఎల్.-ఐ." అనే నిఘా వ్యవస్థను, అదేవిధంగా తన ఉద్యోగులు మరియు వాటాదారులతో సంబంధాలను పెంపొందించుకోడానికి "సంవాద్" అనే యాప్‌ను సంస్థ ప్రారంభించింది. సంస్థ యొక్క బొగ్గు ఉత్పత్తిలో 70 శాతం వాటాను కలిగి ఉన్న సంస్థ యొక్క 15 ప్రధాన గనుల కార్యకలాపాలను "డబ్ల్యు.సి.ఎల్.-ఐ." 24 గంటలూ పర్యవేక్షిస్తుంది. ఇది బొగ్గు నిల్వలు మరియు బొగ్గు లభ్యతను పర్యవేక్షించడంతో పాటు, రేక్‌లను అందుబాటులో ఉంచడం, రైల్వే సైడింగ్‌ల వద్ద లోడ్ చేయడం మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడం వంటి సహాయ పడుతుంది.
"సంవాద్" అనేది ఉద్యోగులు మరియు వాటాదారుల కోసం మొబైల్ మరియు డెస్క్‌టాప్ యాప్ గా రూపొందించారు. ఇది సలహా / అభిప్రాయం / అనుభవ భాగస్వామ్యం కోసం వర్చువల్ ప్లాట్‌ఫామ్ ను అందిస్తుంది. ఈ యాప్ ద్వారా సేకరించిన ప్రశ్నలు, అభిప్రాయాలపై 7 రోజుల లోగా తప్పనిసరిగా స్పందించే విధంగా "క్విక్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి, కోల్ ఇండియా యొక్క వివిధ అనుబంధ సంస్థలు, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి 20 కోట్ల రూపాయలు అందజేసింది. మహారాష్ట్రలో కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి కూడా, కోల్ ఇండియా రెండు, మూడు రోజుల్లో 20 కోట్ల రూపాయలు అందజేయనుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లక్ష్యాలను సాధించడానికి డబ్ల్యు.సి.ఎల్. “మిషన్ 100 డేస్” ఒక రోడ్ మ్యాప్ ను ప్రారంభించింది. సంస్థ యొక్క మధ్య కాలిక మరియు దీర్ఘ కాలిక లక్ష్యాలను సాధించడానికి ఈ మిషన్ సహాయపడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ బొగ్గు ఉత్పత్తి మరియు ఆఫ్‌టేక్ లక్ష్యం 62 మెట్రిక్ టన్నులుగా నిర్ణయించడం జరిగింది.
2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి మహారాష్ట్రలో 14 మరియు మధ్యప్రదేశ్ లో 6 మొత్తం 20 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలనే, డబ్ల్యు.సి.ఎల్. భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ఇప్పుడు ఈ మూడు గనులను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టులపై కంపెనీ మొత్తం 12,753 కోట్ల రూపాయల మేర మూలధన వ్యయం చేయనుంది. మరియు 14,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తుంది. ” అని శ్రీ జోషి తెలియజేసారు.
గత 6 సంవత్సరాల్లో కంపెనీ, 5,300 కోట్ల రూపాయల మూలధన వ్యయంతో, 20 కొత్త మరియు విస్తరణ ప్రాజెక్టులను ప్రారంభించింది. భూ సేకరణ వల్ల నష్టపోయిన 5,250 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడం జరిగింది.
డబ్ల్యు.సి.ఎల్. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 57.64 మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 8 శాతం పెరిగింది.
****
(Release ID: 1629918)
Visitor Counter : 285