ఆయుష్

డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ఐ.వై.డి – 2020 విశ్వ వేడుకలు

మై లైఫ్ – మై యోగా వీడియో బ్లాగింగ్ పోటీ ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది.

Posted On: 05 JUN 2020 4:41PM by PIB Hyderabad

కోవిడ్ -19 కారణంగా దేశంలో కొనసాగుతున్న ఆరోగ్య అత్యవసర పరిస్థితుల దృష్ట్యా, ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద నడవనుంది. ఈరోజు ఆయుష్ మంత్రిత్వ శాఖతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ (ఐ.సి.సి.ఆర్) అధ్యక్షుడు డాక్టర్ వినయ్ సహస్ర బుద్ధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంవత్సరం, ఈ కార్యక్రమంల వ్యక్తుల కోసం యోగా ప్రయోజనాన్ని ప్రధానంగా చూపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి మరియు ఈ సంక్షోభ సమయంలో కొన్ని ముఖ్యమైన అంశాలను నిర్వహించటంలో సమాజాన్ని బలోపేతం చేస్తందని డాక్టర్ సహస్రబుద్ధి తెలిపారు. ఈ సమావేశంలో ఆయుష్ కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ కొటేచ పాల్గొన్నారు.

కోవిడ్ -19కు కారణమయ్యే వైరస్ యొక్క అత్యంత అంటువ్యాధి స్వభావం దృష్ట్యా, సామూహిక సమావేశాలు ఉండవు. అందువల్ల ఈ సంవత్సరం మొత్తం కుటుంబం నుంచి పాల్గొనడంతో ప్రజలు తమ ఇళ్ళలో యోగా సాధన చేయమని మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది. మీడియా వ్యక్తులను ఉద్దేశించి డాక్టర్ సహస్ర బుద్ధి గౌరవ ప్రధాని పిలుపు మేరకు నా జీవితం – నా యోగా వీడియో బ్లాగింగ్ పోటీల్లో ప్రతి ఒక్కరూ  పాల్గొనాలని తెలిపారు. ఈ వీడియో బ్లాగింగ్ పోటీ ద్వారా, ఆయుష్ మరియు ఐ.సి.సి.ఆర్ మంత్రిత్వ శాఖ యోగా గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని, అదే విధంగా ఐ.డి.వై.2020 పరిశీలనలో చురుగ్గా పాల్గొనే దిశగా ప్రజలను సిద్ధం చేయడానికి మరియు ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కోటేచా మాట్లాడుతూ, గౌరవ ప్రధానమంత్రి ఈ పోటీని ప్రకటించడమే గాక, దాని మీద ఉన్నతమైన ఆసక్తిని, ఉత్సుకతను ఏర్పరిచాలని పేర్కొన్నారు. కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా అనేక అంశాల నిర్వహణలో యోగా యొక్క సానుకూల ప్రభావం ఇప్పుడు ప్రజలందరికీ అవగాహన కలుగుతున్నందున, ఇది ప్రజలందరికీ ఆరోగ్యం దిశగా మంచి ప్రయోజనాలు అందిస్తుందని మంత్రిత్వ శాఖ నమ్ముతోందని తెలిపారు.

వైద్యం మరియు చికిత్స అంశాల్లో యోగ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశం పట్ల అవగాహన కల్పించడంలో ఈ పోటీ దోహదపడుతుందని శ్రీ కోటేచా తెలిపారు. యోగా ఇనిస్టిట్యూట్స్, యోగా స్డూడియోస్, యోగా ప్రొఫెనల్స్ వంటి వాటాదారులకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సహా తమ వివిధ ప్లాట్ ఫామ్ ల ద్వారా బ్లాగింగ్ పోటీ గురించి తెలియజేయలని సూచించారు.

MyGov.gov.in వంటి వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై బ్లాగింగ్ పోటీ ప్రారంభమైందని, ఇది జూన్ 15, 2020 తో ముగుస్తుందని, ఆ తర్వాత జ్యూరీ సమిష్టిగా నిర్ణయం తీసుకొని విజేతల పేర్లను ప్రకటిస్తుందని శ్రీ కోటేచా అన్నారు. వీడియో పోటీ కోసం ఎంట్రీలు యువత (18 ఏళ్లలోపు), పెద్దలు (18 ఏళ్లు పైబడినవారు) మరియు యోగా నిపుణులను కలుపుకొని మూడు విభాగాల కింద పాల్గొనేవారు మరియు ఇంకా, మగ మరియు ఆడ పోటీదారుల కోసం విడిగా సమర్పించవచ్చని తెలిపారు. ఇది మొత్తం ఆరు వర్గాలుగా మారుతుంది. భారత పోటీదారులకు, 1, 2 మరియు 3 వ అవార్డు గ్రహీతలకు లక్ష రూపాయలు, 50 వేలు, 25 వేలు అందజేయబడతాయని అదే విధంగా విదేశీ పోటీదారులకు  2500 డాలర్లు, 1500 డాలర్లు, 1000 డాలర్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ విలేకరుల సమావేశంలో శ్రీ దినేష్ కె పట్నాయక్, డిజి (ఐ.సి.సి.ఆర్), శ్రీ పి.ఎన్. రంజిత్ కుమార్, ఆయుష్ శాఖ సంయుక్త కార్యదర్శి పాల్గొన్నారు. మీడియా సమావేశం తర్వాత జర్నలిస్టులకు వ్యాధినిరోధక కిట్లను కూడా పంపిణీ చేశారు.

 

***



(Release ID: 1629722) Visitor Counter : 293