విద్యుత్తు మంత్రిత్వ శాఖ
‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2020’ జరుపుకున్న - ఎన్.హెచ్.పి.సి.
తమ ఉద్యోగులకు సుమారు 700 ఔషధ మొక్కలను పంపిణీ చేసిన - కేంద్ర ప్రభుత్వరంగసంస్థ.
Posted On:
05 JUN 2020 4:50PM by PIB Hyderabad
భారతదేశపు ప్రధాన జలవిద్యుత్ సంస్థ మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వరంగసంస్థ, ఎన్.హెచ్.పి.సి., తన కార్పొరేట్ కార్యాలయంలో మరియు ప్రాంతీయ కార్యాలయాలు, విద్యుత్ కేంద్రాలు, ప్రాజెక్టులలో 2020 జూన్ నెల 5వ తేదీన, ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2020’ ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంది.
ఎన్.హెచ్.పి.సి. కార్యాలయ ఆవరణలో ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా "ఔషధ మొక్కల పార్కు" ను ఎన్.హెచ్.పి.సి. చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఏ.కే.సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో - డైరెక్టర్-ప్రాజెక్ట్స్ శ్రీ రతీష్ కుమార్; డైరెక్టర్-పర్సనల్ శ్రీ ఎన్.కే. జైన్; డైరెక్టర్-ఫైనాన్స్ శ్రీ ఎమ్.కే. మిట్టల్; డైరెక్టర్-టెక్నికల్ శ్రీ వై.కే. చౌబే; సి.వి.ఓ. శ్రీ ఏ.కే. శ్రీవాస్తవ ప్రభృతులు పాల్గొన్నారు. మొక్కలు మరియు మూలికల యొక్క ఔషధ ప్రాముఖ్యత పట్ల ఉద్యోగులందరిలో అవగాహన కల్పించే లక్ష్యంతో హెర్బల్ పార్క్ ను ఏర్పాటుచేయడం జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఇతర డైరెక్టర్లు, సి.వి.ఓ. లు కూడా వివిధ రకాల ఔషధ మొక్కలను నాటారు.
పర్యావరణ ప్రయోజనాల కోసం ఉద్యోగులను ప్రోత్సహించడానికీ, వారిలో పర్యావరణ పరిరక్షణ భావాన్ని పెంపొందించడానికీ, ఈ సందర్భంగా సుమారు 700 ఔషధ మొక్కలను ఉద్యోగులకు పంపిణీ చేయడం జరిగింది. ఫరీదాబాద్‌లోని ఎన్.హెచ్.పి.సి. కార్పొరేట్ కార్యాలయం, నివాస సముదాయాలతో పాటు, ఎన్.హెచ్.పి.సి. కి చెందిన అన్ని ప్రాంతీయ కార్యాలయాలు, ప్రాజెక్టులు మరియు విద్యుత్ కేంద్రాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాల వేడుకల సమయంలో, సామాజిక దూర నిబంధనను ఖచ్చితంగా పాటించారు.
ప్రపంచవ్యాప్త అవగాహనను ప్రోత్సహించడానికీ, మన పర్యావరణాన్ని పరిరక్షించడానికీ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2020, ని ఈ రోజు, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుపుకున్నారు. ఈ సంవత్సరం 2020 ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఇతివృత్తం - ‘జీవవైవిధ్యం’.
*****
(Release ID: 1629718)
Visitor Counter : 253