శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారత్ మరియు ఆస్ట్రేలియాల ద్వైపాక్షిక వైజ్ఞాన శాస్త్ర సహకారంలో భాగంగా కోవిడ్-19 నిమిత్తం పరిశోధన ప్రతిపాదనలకు ఆహ్వానం
Posted On:
05 JUN 2020 3:59PM by PIB Hyderabad
భారత్- ఆస్ట్రేలియా నాయకుల మధ్య జూన్ 04 న జరిగిన వర్చువల్ సమ్మిట్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ ఎంపీ లు సంయుక్తంగా కోవిడ్- 19కు సంబంధించి ఒక ప్రత్యేక వైజ్ఞాన శాస్త్ర సహకారాన్ని ప్రకటించారు. దీని ప్రకారం ఆస్ట్రేలియా దేశానికి చెందిన పరిశ్రమల, సైన్స్, విద్యుత్తు మరియు సహజ వనరుల శాఖ (డీఐఎస్ఈఆర్), భారత్‌కు చెందిన శాస్త్ర మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ(డీఎస్‌టీ) లు 'ఆస్ట్రేలియా- భారత్ వ్యూహాత్మక పరిశోధన నిధి' (ఏఐఎస్ఆర్ఎఫ్) కింద ఆసక్తి కలిగిన ఆయా శాస్త్రవేత్తలు మరియు పరిశోధకుల నుంచి కోవిడ్ -19కు సంబంధించి సంయుక్త పరిశోధన ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు. ఏఐఎస్ఆర్ఎఫ్ అనేది విజ్ఞాన శాస్త్రంలో ద్వైపాక్షిక సహకారం కోసం ఇది ఒక వేదిక. దీనిని భారత్ మరియు ఆస్ట్రేలియా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించి, నిధులను సమకూరుస్తాయి. ఇందులో భాగంగా యాంటీ వైరల్ పూతలు, ఇతర నివారణ సాంకేతికతలు, డేటా అనలిటిక్స్, మోడలింగ్, ఏఐ అప్లికేషన్లు మరియు స్క్రీనింగ్ మరియు డయాగ్నొస్టిక్ పరీక్షలను ప్రాధాన్యత గల ప్రాంతాలుగా పరిశోధన ప్రతిపాదలు కోరడమైంది. ప్రాజెక్ట్ వ్యవధి 12 నెలలుగా ఉండనుంది. దీనికి గరిష్టంగా 6 నెలల పొడిగింపు ఉంటుంది. కోవిడ్ -19 వైరస్ మహమ్మారికి ప్రతిస్పందించడంపై తగిన దృష్టి సారిస్తూ స్పష్టమైన ఫలితాలతో చిన్న సహకార పరిశోధన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం గ్రాంట్ అవకాశం యొక్క లక్ష్యం. కోవిడ్-19 కు సంబంధించిన టీకాలు, చికిత్సా విధానాలు, డయాగ్నాస్టిక్స్‌తో సహా ఇరుపక్షాల వారికి పరస్పరం ప్రయోజనకరమైన స్వభావంతో పాటు ఈ పరిశోధన పలితాలు.. కోవిడ్-19 వైరస్ మహమ్మారికి ప్రపంచ ప్రతిస్పందన ఫలితాలు దోహదం చేయనున్నాయి. కోవిడ్ కు సంబంధించిన రంగాలపై ప్రస్తుతం పనిచేస్తున్న ఆస్ట్రేలియా, భారత్‌లోని ప్రముఖ పరిశోధనా సంస్థలు మరియు పరిశ్రమలను ఒకచోట చేర్చడం దైపాక్షిక సహకారంలో అంతర్భాగం. ఇందుకు సంబంధించిన వివరాలు onlinest. gov. in వెబ్‌సైట్లో లభిస్తాయి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ జూలై 2, 2020.
(Release ID: 1629703)
Visitor Counter : 232