ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

2020-21 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎం.ఎస్.‌పి)

Posted On: 01 JUN 2020 5:47PM by PIB Hyderabad

2020-21 మార్కెటింగ్ సీజన్ కోసం తప్పనిసరి ఖరీఫ్ పంటల కోసం కనీస మద్దతు ధరలను (ఎం.ఎస్.పి.) పెంచడానికి  గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సి.సి.ఈ.ఎ.) ఆమోదం తెలిపింది.

2

సాగుదారులకు వారి ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలను నిర్ధారించడానికి గాను, 2020-21 మార్కెటింగ్ సీజన్ కోసం ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎం.ఎస్.‌పి. ని పెంచింది.  ఎమ్.ఎస్.పి. అత్యంత ఎక్కువగా వెర్రి నువ్వులు గింజలు (క్వింటాల్‌కు 755 రూపాయలు), తరువాత నువ్వులు (క్వింటాల్‌కు 370 రూపాయలు),మినప పప్పు (క్వింటాల్‌కు 300 రూపాయలు), పత్తి (పొడుగు గింజ) (క్వింటాల్‌కు 275 రూపాయలు) చొప్పున ఎమ్.ఎస్.పి. లో పెరుగుదల ప్రతిపాదించబడింది.  పంటల్లో వైవిధ్యాన్ని ప్రోత్సహించడం కోసమే గిట్టుబాటు ధరల్లో ఈ వైవిధ్యాన్ని ప్రతిపాదించబడింది. 

2020-21 మార్కెటింగ్ సీజన్ కోసం అన్ని ఖరీఫ్ పంటలకు ప్రతిపాదించిన ఎమ్.ఎస్.పి. :

 

క్రమ సంఖ్య 

 

 

పంటలు 

అంచనా వ్యయం * కే.ఎమ్.ఎస్. 

 2020-21

2020-21

ఖరీఫ్ కోసం ఎమ్.ఎస్.పి. 

 

ఎమ్.ఎస్.పి. లో పెరుగుదల 

(సంపూర్ణంగా)

ఖర్చు మీద ఆదాయం 

(శాతం) 

1

వరి  (సాధారణ)

1,245

1,868

53

 

50

      2

వరి 

(ఏ-గ్రేడ్)^

-

1,888

53

 

-

3

జొన్నలు   (హైబ్రిడ్)

1,746

2,620

70

 

50

4

జొన్నలు   (మలదండి)^

-

2,640

70

 

-

5

సజ్జలు 

1,175

2,150

150

 

83

6

రాగులు 

2,194

3,295

145

 

50

7

మొక్కజొన్న 

1,213

1,850

90

 

53

8

కందులు  (అర్హర్)

3,796

6,000

200

 

58

9

పెసరపప్పు 

4,797

7,196

146

 

50

10

మినుములు 

3,660

6,000

300

 

64

11

వేరుశనగలు 

3,515

5,275

185

 

50

12

 

పొద్దుతిరుగుడు గింజలు 

3,921

5,885

235

 

50

13

సోయాబీన్ 

 (పసుపు)

2,587

3,880

170

 

50

14

నువ్వులు 

4,570

6,855

370

 

50

15

వెర్రి నువ్వులు 

4,462

6,695

755

 

50

16

పత్తి  

(మధ్యస్థ గింజలు)

3,676

5,515

260

 

50

17

పత్తి  

(పొడవు గింజ)^

-

5,825

275

 

-

 

^వరి కోసం ఖర్చు డేటా విడిగా సంకలనం చేయబడలేదు (ఏ-గ్రేడ్ ), 

జొన్నలు (మలదండి ) మరియు పత్తి (పొడుగు గింజ )

కేంద్ర బడ్జెట్ 2018-19 ప్రకారం, 2020-21 మార్కెటింగ్ సీజన్ లో ఖరీఫ్ పంటలకు ఎం.ఎస్.‌పి. పెరుగుదల ప్రతిపాదించడం జరిగింది. రైతులకు సహేతుకమైన సరసమైన గిట్టుబాటు ధర కోసం, అఖిల భారత సగటు బరువు ఉత్పత్తి వ్యయం (సి.ఓ.పి.) కంటే కనీసం 1.5 రెట్లు ఎక్కువగా ఎమ్.‌ఎస్.‌పి. లను ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది.  సజ్జలు (83%), తరువాత మినుములు (64%), కందులు (58%) మరియు మొక్కజొన్న (53%) విషయంలో రైతులకు వారి ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువ రాబడి ఉంటుందని అంచనా.  మిగిలిన పంటలకు, వారి ఉత్పత్తి వ్యయంపై రైతులకు కనీస రాబడి 50 శాతంగా అంచనా వేయబడింది.

దేశం యొక్క జీవ-వైవిధ్యానికి హాని చేయకుండా అధిక ఉత్పాదకత వైపు, దేశ వ్యవసాయ-వాతావరణ పరిస్థితులతో సరిపోయే వైవిధ్యభరితమైన పంట నమూనాతో స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ వ్యూహంలో ఒకటిగా ఉంది.  సేకరణతో పాటు  ఎమ్.ఎస్.పి.  రూపంలో  ఈ మద్దతు ఉంది.  అంతేకాకుండా, రైతుల ఆదాయ భద్రతకు తగిన విధాన పరమైన మద్దతు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కూడా ఈ ప్రతిపాదన చేపట్టడం జరిగింది.   ప్రభుత్వ ఉత్పత్తి-కేంద్రీకృత విధానాన్ని, ఆదాయ-కేంద్రీకృత విధానం ద్వారా భర్తీ చేయడం జరిగింది. 

ఈ పంటల కింద రైతులు పెద్ద ప్రాంతానికి మారడాన్ని ప్రోత్సహించడానికి మరియు డిమాండ్ - సరఫరా అసమతుల్యతను సరిచేయడానికి, ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాలు మరియు వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి, నూనెగింజలు, పప్పుధాన్యాలు మరియు ముతక తృణధాన్యాలు అనుకూలంగా ఎం.ఎస్.‌పి. లను మార్చడానికి గత కొన్ని సంవత్సరాలుగా గట్టి ప్రయత్నాలు జరిగాయి.  భూగర్భజల పట్టిక యొక్క దీర్ఘకాలిక ప్రతికూల చిక్కులు లేకుండా బియ్యం-గోధుమలను పండించలేని ప్రాంతాల్లో దాని ఉత్పత్తిని ప్రోత్సహించడం పోషకాలతో కూడిన పోషక-తృణధాన్యాలపై అదనపు దృష్టి పెట్టడం జరిగింది. 

పైన పేర్కొన్న చర్యలకు కొనసాగింపుగా, కోవిడ్-19 కారణంగా లాక్ డౌన్ పరిస్థితిలో రైతులకు మద్దతు ఇవ్వడానికి మరియు వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం సమగ్ర విధానాన్ని అవలంబిస్తోంది.  రైతుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సులభతరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  డైరెక్ట్ మార్కెటింగ్‌ను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు / కేంద్రపాలితప్రాంతాలకు సలహాలు జారీ చేశాయి.  రాష్ట్ర ఎ.పి.ఎం.సి. చట్టం ప్రకారం నియంత్రణను పరిమితం చేయడం ద్వారా టోకు కొనుగోలుదారులు / పెద్ద పెద్ద రిటైలర్లు / ప్రాసెసర్ల  ద్వారా ఫన్నర్లు / ఎఫ్.‌పి.ఓ. లు / సహకార సంస్థల నుండి నేరుగా కొనుగోలు చేయగలుగుతారు.

వీటితో పాటు, 2018 లో ప్రభుత్వం ప్రకటించిన "ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్" (పి.ఎం-ఆషా) పధకం రైతులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు రాబడిని అందించడంలో సహాయపడుతుంది.  ఈ ప్రధాన పథకంలో మూడు ఉప పథకాలు ఉన్నాయి. అవి, మద్దతు ధర పథకం (పి.ఎస్.ఎస్), లోటు ధర చెల్లింపు పథకం (పి.డి.పి.ఎస్) మరియు పైలట్ ప్రాతిపదికన ప్రైవేట్ సేకరణ & స్టాకిస్ట్ పధకం (పి.పి.ఎస్.ఎస్).

లాక్ డౌన్ సమయంలో 24.3.2020 తేదీ నుండి ఇప్పటి వరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పి.ఎం-కిసాన్) పథకం కింద సుమారు 8.89 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఇందుకోసం ఇంతవరకు 17,793 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.  

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార భద్రత కల్పించడానికి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పి.ఎం-జి.కె.వై.) కింద ఉన్న అర్హతగల కుటుంబాలకు పప్పుధాన్యాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఇప్పటివరకు, సుమారు 1,07,077.85 మెట్రిక్ టన్నుల పప్పులు రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలకు విడుదల చేయడం జరిగింది. 

 *****(Release ID: 1628490) Visitor Counter : 1650