పర్యటక మంత్రిత్వ శాఖ

పర్యాటక మంత్రిత్వ శాఖ 26 వ దేఖో అప్నా దేశ్ వెబి‌నార్‌ను 'ది టెనాసిటీ ఆఫ్ సర్వైవల్ -ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆఫ్ కచ్' పేరుతో నిర్వహణ

“కచ్ నహి దేఖా తో కుచ్ నహి దేఖా” సందేశంతో కచ్ విభిన్న అంశాలను ప్రదర్శించిన వెబి‌నార్

దేఖో అప్నా దేశ్ వెబి‌నార్ సిరీస్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద భారతదేశ గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం

Posted On: 01 JUN 2020 1:05PM by PIB Hyderabad
పర్యాటక మంత్రిత్వ శాఖ దేఖో అప్నా దేశ్ వెబ్‌నార్ సిరీస్ 26 వ సెషన్ “ది టెనాసిటీ ఆఫ్ సర్వైవల్” - భారతదేశపు అతిపెద్ద జిల్లా గుజరాత్ లోని కచ్  స్ఫూర్తివంతమైన కథనాన్ని ప్రదర్శించారు. చరిత్ర, సంస్కృతి, చేతిపనులు, వస్త్ర వారసత్వాన్నిఈ వెబినార్ ద్వారా పరిచయం చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో పోరాడటానికి కచ్ ప్రజల ఆత్మ, భారతీయ నాగరికతను నిర్వచించే నిరంతర కార్యశీలి నైపుణ్యాలు వివరించారు. వెబ్‌నార్ “కచ్ నహి దేఖా తో కుచ్ నహి దేఖా” అనే సందేశాన్ని ఇచ్చించి. దేఖో అప్నా దేశ్ వెబినార్ సిరీస్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద గొప్పదైన భారతదేశ వైవిధ్యాన్ని ప్రదర్శించారు.
వెబ్‌ఇనార్ ఈ సెషన్‌ను పర్యాటక మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి రూపీందర్ బ్రార్ సమన్వయం చేశారు. భారత సాంస్కృతిక వారసత్వ పరిశోధన డైరెక్టర్ డాక్టర్ నవీనా జాఫా సమర్పించారు. శ్రీమతి జాఫా తన శక్తివంతమైన కథన నైపుణ్యాల ద్వారా విరుద్ధమైన భౌగోళిక లక్షణాలను, భారతదేశాన్ని అత్యంత నాటకీయ పద్ధతిలో నిర్వచించేలా వివరించారు. 
కచ్ ఉప్పు ఎడారి, గడ్డి భూములు, మడ అడవులతో కూడుకుని ఉన్నది. ఆసక్తికరంగా, ఇక్కడి మడ అడవులు ప్రపంచంలోని ఏకైక లోతట్టు మాంగ్రోవ్ అనే అద్భుతమైన దృగ్విషయంగా ప్రసిద్ది చెందాయి. రాన్ ఆఫ్ కచ్ మాత్రమే భారతదేశం మొత్తం ఉప్పు సరఫరాలో మూడింట నాలుగవ వంతు ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రదేశం ఖరై జాతి ఒంటెలకు ప్రసిద్ధి. ఇది పొడి భూమితో పాటు ఉప్పునీటిలో కూడా జీవించగల ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంది. 
ప్రదర్శన యొక్క  ముఖ్యాంశాలు అజ్రఖ్ సాంప్రదాయ బ్లాక్ ప్రింటర్ల  వర్చువల్ సందర్శన. భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలలో ఇప్పటికీ పాటిస్తున్న వస్త్రాలపై బ్లాక్ ప్రింటింగ్ యొక్క పురాతన రకాల్లో అజ్రాఖ్ ఒకటి. ఈ శైలిలో ముద్రించిన వస్త్రాలు రెండు వైపులా సహజ రంగులను ఉపయోగించి చేతితో ముద్రిస్తారు. ఇవి శ్రమతో కూడిన, సుదీర్ఘమైన ముద్రణ ప్రక్రియ.
ఈ సదస్సులో పాల్గొనేవారు కచ్‌లోని బన్నితే సాల్ట్ ఎడారిని సందర్శించారు, అక్కడ కుండలు, ఎంబ్రాయిడరీ మరియు తోలు పనిలో నిమగ్నమైన మూడు ప్రధాన స్వదేశీ సంఘాల పనిని ప్రదర్శించారు. శ్రీమతి జాఫా సన్యాసుల ఆశ్రమం (సిద్ధి సిద్ధాంత్ విభాగం), మఠం నడుపుతున్న లాంగర్ (కమ్యూనిటీ కిచెన్) గురించి వివరించారు.

ఈ ప్రదర్శన తీరప్రాంత పట్టణం మాండవిని కూడా కవర్ చేసింది, ఇక్కడ ప్రాంతీయ సూఫీ నమ్మకాలు అరేబియా సముద్రంలో సాంప్రదాయ పడవ నిర్మాతలకు మార్గనిర్దేశం చేస్తాయి.

వెబి‌నార్‌లో ప్రదర్శించిన కచ్ ఇతర ముఖ్యమైన ఆకర్షణలు:

• ధోలావిరా- యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, భారతదేశంలో ఉన్న రెండవ అతిపెద్ద హరప్పన్ సైట్. ఇది నిజంగా పట్టణ ప్రణాళిక మరియు వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణ.

• శిలాజ పార్క్

• రాన్ ఆఫ్ కచ్-సాల్ట్ ఎడారి అరేబియా సముద్రం

• కాలా దుంగార్

• గురు గోర్కనాథ్ ఆలయం

• నారాయణ్ సరోవర్ ఆలయం

• లఖ్పోర్ట్ ఫోర్ట్ & పోర్ట్

• సుర్హాండో- ప్రత్యేకమైన నెమలి ఆకారపు వాయిద్యం శ్రావ్యమైన సంగీతాన్ని పోషిస్తుంది

• థాలి డాన్స్- వివాహం, పిల్లల పుట్టిన వేడుకలను ప్రారంభించడానికి ప్రదర్శించే బ్యాలెన్సింగ్ డాన్స్

• తూఫాన్- సముద్రం యొక్క ప్రసిద్ధ వైల్డ్ డ్యాన్స్ “సముందర్ కి మస్తీ” అని కూడా పిలుస్తారు
ఇంకా అనేక ఆకర్షణీయ అంశాలను ఈ వెబినార్ లో ప్రదర్శించి వీక్షకులకు కనువిందు చేశారు. 
వెబినార్ ల వివిధ సెషన్లు  https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured లో లభ్యమవుతాయి. పర్యాటక శాఖ సామజిక మాధ్యమ అకౌంట్లలో కూడా చూడవచ్చు. 
తర్వాతి వెబినార్ జూన్ 2వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. దీనిలో ‘హర్యానా: సంస్కృతి, వంటకాలు మరియు పర్యాటక రంగం’పై వెబినారు ఉంటుంది. . దీనిలో పాల్గొడానికి రిజిస్టర్ అవ్వండి : https://bit/ly/3dmTbmz

 

*****



(Release ID: 1628321) Visitor Counter : 225