శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వ్యాధి వ్యాప్తిని పర్యవేక్షించి అరికట్టడంలో సహాయపడటంతో పాటు విధాన నిర్ణేతలు నిర్ణయం తీసుకోవడానికి వీలుగా కోవిడ్ -19 కోసం భారత జాతీయ ఉత్తమ నమూనాను రూపొందించేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (డి ఎస్ టి) ఉపక్రమించింది

Posted On: 30 MAY 2020 3:59PM by PIB Hyderabad

భవిష్యత్తులో కోవిడ్ -19 వ్యాధి సంక్రమణను అరికట్టేందుకు తగిన రీతిలో పర్యవేక్షణ జరిపి చర్యలు తీసుకోగల  భారత జాతీయ ఉత్తమ నమూనాను రూపొందించేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది.  తద్వారా ఆరోగ్య వ్యవస్థను సంసిద్ధం చేయగల నిర్ణయాలు తీసుకోవడానికి మరియు తీవ్రతను తగ్గించే ఇతర చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.  

కరోనా రోగకారకత మరియు మరణాల తీరుపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి కనిపెట్టి చూస్తోంది    అయితే వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు సంక్రమణంపై కాపు కాయడానికి  అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడానికి మంచి భవిష్యత్ సూచక నమూనాను రూపొందించవలసిన ఆవశ్యకత ఉంది.  

కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (డి ఎస్ టి)  పరిధిలోని విజ్ఞాన మరియు ఇంజనీరింగ్ పరిశోధన బోర్డు (ఎస్ ఈ ఆర్ బి) మరియు ఇతర సంస్థల  ఆర్ధిక సహాయంతో అన్వేషణ జరుపుతున్న పరిశోధకులు కోవిడ్ -19 గురించి  భవిష్యత్ సూచన మరియు నిఘాకు   అసంఖ్యాక గణిత నమూనాల రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు.

ప్రకృతి వైపరీత్యాలు,   తుపానుల వంటి వాతావరణ సంబంధ ఘటనలు జరిగినప్పుడు గణిత నమూనాలతో పారిస్తాటిని ఎదుర్కొన్న చరిత్ర ఇండియాది.   ఆ స్పూర్తితో  దేశమంతటికీ పనికి వచ్చే విధంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా  వాతావరణ శాస్త్రజ్ఞులు భవిష్యత్తును అంచనా వేసిన విధంగా కరోనా కోసం ఒక నమూనాను సిద్ధం చేయాలని డి ఎస్ టి సంకల్పించింది.  

కోవిడ్ -19 సంబంధిత డేటాను తీసుకొని గణిత, గణాంక భవిష్యత్ సూచక నమూనాల ఆధారంగా విశ్లేషించి వ్యాధి వ్యాప్తిని,  సంక్రమణాన్ని అంచనావేస్తారు.  కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ రూపొందించే ఈ నమూనాను ఇండియాలో మరియు ప్రపంచ దేశాలలో విధాన నిర్ణేతలు ఉపయోగించవచ్చు.  తద్వారా వారు వ్యాధి వ్యాప్తి రేటును తెలుసుకొని ఆరోగ్య సేవల రంగంపై దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది,  ఆర్ధిక భారం ఎంత అం అంచనా వేయడం ద్వారా మహమ్మారిని నిరోధించే చర్యలు తీసుకోగలరు.  

ఈ యత్నంలో భాగంగా జవహర్ లాల్  నెహ్రు సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైన్టిపిక్ రీసర్చ్ (జె ఎన్ సి ఎ ఎస్ ఆర్) మరియు  బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ ఐ ఎస్సి)  సమన్వయంతో వ్యవహరించి దేశంలో కోవిడ్ -19 మోడలింగ్ ప్రాజెక్టులతో కలసి పని  చేస్తాయి. దీనివల్ల ప్రామాణిక నమూనాల రూపకల్పన జరిగి కోవిడ్ -19 ఇండియా నేషనల్ సూపర్ మోడల్ రూపకల్పనకు దారితీస్తుంది. సమన్వయ బృందం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ బృందాలతో సంప్రదింపులు జరుపుతుంది.  

ఒక సమాలోచక కమిటీ డి ఎస్ టి మరియు  ఎస్ ఈ ఆర్ బి  మరియు  సమన్వయకర్తలతో  (జె ఎన్ సి ఎ ఎస్ ఆర్ మరియు బెంగళూరు ఐ ఐ ఎస్సి) మరియు తయారీదార్లతో   కలసి పనిచేస్తుంది.  

కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిని అంచనా వేయడానికి గణిత నమూనాలను,  కాల్పనిక నమూనాలను రూపొందించడం కేవలం విద్యావిషయక అభ్యాసం కాదని,  ప్రణాళిక రూపకల్పన, వనరుల పర్యవేక్షణ మరియు హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి కీలకమైనదని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ ఆశుతోష్ శర్మ అన్నారు.     అందువల్ల శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన పలువురు నిపుణులు ఆ జాతీయ నమూనాను పరీక్షించడం ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు.  

*****



(Release ID: 1628006) Visitor Counter : 237