విద్యుత్తు మంత్రిత్వ శాఖ

కోవిడ్ వ్య‌తిరేక పోరాటానికి ద‌న్నుగా నిలిచేలా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి పీఎఫ్‌సీ సాయం

- రూ‌.1.23 కోట్ల‌తో పీపీఈ కిట్లు మరియు అంబులెన్స్‌ల్ని అందించిన ప్ర‌భుత్వ రంగ సంస్థ‌

Posted On: 30 MAY 2020 2:45PM by PIB Hyderabad

కోవిడ్ -19 మ‌హ‌మ్మారిపై పోరాట‌పు త‌దుప‌రి చ‌ర్య‌లో భాగంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన ప్ర‌భుత్వ రంగ సంస్థ మరియు భారత్‌లో ప్రముఖ బ్యాంకింగేత‌ర విత్త సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్‌సీ) ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి రూ.1.23 కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. ఈ నిధుల‌తో కోవిడ్ -19 క‌ట్టడికి ప్ర‌ధా‌నంగా ముందుండి పోరాడుతున్న సిబ్బంది కోసం 500 పీపీఈ కిట్ల‌ను అందించ‌డంతో పాటుగా, 06 పూర్తిస్థాయి అంబులెన్స్‌ల కొనుగోలు చేసి ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖకు అప్పగించనున్నారు.
పీఎఫ్‌సీ సంస్థ త‌న కార్పొరేట్ సామాజిక బాధ్య‌త‌ (సీఎస్ఆర్‌) చొరవలో భాగంగా ఈ చ‌ర్య‌ల‌ను చేప‌ట్ట‌నుంది. కోవిడ్‌-19 వ్యాప్తికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క సంసిద్ధతకు మరింత ఊతం ఇచ్చేందుకు పీఎఫ్‌సీ చ‌ర్య ఎంత‌గానో తోడ్పడ‌నుంది. (Release ID: 1627923) Visitor Counter : 274