గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 నిర్వహణ మరియు నియంత్రణ కోసం కీలకమైన ఐటీ చొరవను చేపట్టిన సూరత్ స్మార్ట్ సిటీ
Posted On:
29 MAY 2020 3:05PM by PIB Hyderabad
కోవిడ్ -19తో పోరాడేందుకు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వివిధ ఐటీ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎస్.ఎం.సి. కోవిడ్ -19 ట్రాకింగ్ సిస్టమ్ ను అభివృద్ధి చేసింది. దీనిలో విదేశాలలో లేదా అంతర్ రాష్ట్ర ప్రయాణ చరిత్ర మరియు కోవిడ్ -19 పాజిటివ్ వ్యక్తులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తులను ట్రాక్ చేసేందుకు ఎస్.ఎం.సి. కోవిడ్ -19 ట్రాకర్ అనే వెబ్ పోర్టల్ మరియు మొబైల్ అప్లికేషన్ లు ఉన్నాయి. ఎస్.ఎం.సి. వెబ్ సైట్ లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం, హెల్ప్ లైన్ నంబర్ కు వచ్చిన కాల్స్, భారత ప్రభుత్వ అందుకున్న అంతర్జాతీయ యాత్రికులు సమాచారం, వివిధ విభాగాల నుంచి ప్రయాణికులు, ఇతర వ్యక్తుల సమాచారం సేకరించబడతాయి. అప్లికేషన్ పనితీరు గురించి క్లుప్తంగా క్రింద వివరించడం జరిగింది.
1. ఎస్.ఎం.సి. www.suratmunicipal.gov.in వెబ్ సైట్ లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ను అందుబాటులో ఉంచింది. ఇక్కడ వ్యక్తులు తమ వివరాలను, విదేశాల్లో లేదా అంతర్ రాష్ట్ర ప్రయాణ చరిత్రతో సహా తెలియజేయవచ్చు. అదే విధంగా వారు కోవిడ్ -19 పాజిటివ్ వ్యక్తిని కలిసిన విషయం సహా వివరాలు సమర్పించిన తర్వాత, ప్రత్యేకమైన ట్రాకర్ ఐడీతో ఒక ఎస్.ఎం.సి. పంపడం జరుగుతుంది. దానితో పాటు ఎస్.ఎం.సి. కోవిడ్ -19 మొబైల్ ట్రాకర్ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేయమని కోరడం జరుగుతుంది.
2. ఎస్.ఎం.సి. హెల్ప్ లైన్ నంబర్ 1-800-123-800 ను కూడా ప్రారంభించిది. ఇక్కడ పౌరులు, ప్రయాణికులు లేదా అనుమానితుల గురించి వివరాలు పంచుకోవచ్చు. వివరాలను ఆరోగ్య అధికారులతో ఎస్.ఎం.సి. బృందం దృవీకరిస్తుంది. ఒక ఫీల్డ్ బృందం ఆ స్థానాన్ని సందర్శిస్తుంది. అదే విధంగా హెల్ప్ లైన్ లో అందించిన వివరాలు ధృవీకరించబడితే, వ్యక్తి ఇంటి నిర్బంధంలో ఉండమని కోరడంతో పాటు, వారికి ప్రత్యేకమైన ట్రాకర్ ఐడీని కేటాయిస్తారు. అదే విధంగా ఎస్.ఎం.సి. కోవిడ్ -19 ట్రాకర్ మొబైల్ ను డౌన్ లోడ్ చేయాల్సిందిగా సూచిస్తారు.
3. వ్యక్తులు వారి ఆరోగ్యానికి సంబంధించి రోజుకు రెండు సార్లు (ఉదయం 10 గంటలు మరియు సాయంత్రం 9 గంటలు) ఎస్.ఎం.సి. కోవిడ్ -19 ట్రాకర్ యాప్ ద్వారా ప్రశ్నపత్రాన్ని నింపాలి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందా అని అడిగే ప్రశ్నా పత్రంలో మూడు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. ఈ ప్రశ్నా పత్రంతో పాటు వ్యక్తులు తమ సెల్ఫీ(పోటో)ను కూడా పంపాల్సి ఉంటుంది. ఎవరైనా వ్యక్తి వారి ఆరోగ్యానికి సంబంధించి ప్రశ్నా పత్రంలో సమస్యను ప్రస్తావించినట్లైతే, మొదట ఫోన్ ద్వారా ఫాలోఅప్ జరుగుతుంది. అదే విధంగా అవసరమైతే, వ్యక్తులు అవసరమైన తనిఖీ మరియు చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించమని సూచిస్తారు.
4. ఈ యాప్ ను విజయవంతంగా ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత, వ్యక్తులు రోజూ స్వీయ గృహ నిర్బంధాన్ని అనుసరిస్తున్నారని ధృవీకరించేందుకు ప్రతి గంటకు వారి స్థానాన్ని పంపాలి. ఏ వ్యక్తి అయినా గృహ నిర్బంధ మార్గదర్శకాలు పాటించలేదని తేలితే, వ్యక్తుల స్థాన చరిత్రను ఎస్.ఎం.సి. బృందం పర్యవేక్షిస్తుంది. అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారు.
5. గృహ నిర్బంధలో ఉండమని సూచించిన ప్రతి వ్యక్తికి, రోజువారీ ఇంటి నుంచి ఇంటికి ఫాలో అప్ కూడా ఎస్.ఎం.సి. బృందం నిర్వహిస్తుంది. ఎస్.ఎం.సి. బృందం చేసిన ఫాలో అప్ కూడా సిస్టమ్ ద్వారా సంగ్రహించబడుతుంది.
6. గృహ నిర్బంధ సమయంలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించి, ఆసుపత్రికి తరలించినట్లైతే, అనుమానితులను సంప్రదించిన వ్యక్తులు సంప్రదింపు చరిత్రలో వ్యవస్థలో ప్రవేశిస్తారు. తద్వారా వారు కాంటాక్ట్ ట్రేసింగ్ ను అర్థం చేసుకోవడానికి లింక్ చేయబడతారు. అసుపత్రిలో చేరిన వ్యక్తికి పాజిటివ్ వచ్చినప్పుడు ఆయనను కలిసిన ఇతరులు నిర్బంధాన్ని అనుసరించాల్సిందిగా సూచిస్తారు.
7. వ్యవస్థలో అవసరమైన ఎం.ఐ.ఎస్. నివేదికలు తయారు చేయబడతాయి. అదే విధంగా ఆరోగ్యశాఖ అవసరాలకు అనుగుణంగా కొత్త నివేదికలను అభివృద్ధి చేస్తున్నారు.
8. ఆండ్రాయిడ్ మరియు ఐ.ఓ.ఎస్.ల కోసం అవసరమైన యాప్ ఇన్ స్టాలేషన్ మాన్యువల్ యూట్యూబ్ వీడియోలతో పాటు పౌరులు అప్లికేషన్ ను సులభంగా ఇన్ స్టాల్ చేసుకోవడంలో సహాయపడతాయి.
ఆండ్రాయిడ్, ఐ.ఓ.ఎస్. యాప్ లతో పాటు ఎస్.ఎం.సి. కోవిడ్ -19 ట్రాకింగ్ సిస్టమ్ ను 5 రోజుల అతి తక్కువ సమయంలో అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతానికి సుమారు 3800 వ్యక్తిగత వివరాలు వ్యవస్థలో నమోదు చేయబడ్డాయి. అదే విధంగా ప్రతి గంటకు 2800 మందికి పైగా వ్యక్తులు తమ ప్రదేశాలను పంపేందుకు మొబైల్ యాప్ వినియోగిస్తున్నారు. రోజుకు రెండు సార్లు వారి ఆరోగ్య తనిఖీ ప్రశ్నపత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఎస్.ఎం.సి. అభివృద్ధి చేసిన వ్యవస్థను గుజరాత్ ప్రభుత్వం సమీక్షించడమే గాక, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ముందుకు వెళుతున్నాయి. ఈ వ్యవస్థకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు కింద ఇవ్వడం జరిగింది.
ఎస్.ఎం.సి. కోవిడ్ -19 ట్రాకర్ సిస్టమ్
|
|
|
సూరత్ లో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తుల మ్యాప్
|
సూరత్ లో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న వారి జాబితా వీక్షణ
|
|
|
సూరత్ లో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తి యొక్క ట్రాకింగ్
|
ఎస్.ఎం.సి. బృందం అనుసరించే వ్యక్తి యొక్క ప్రయాణ చరిత్ర
|
|
|
మొబైల్ యాప్ ద్వారా స్వీకరించిన ఆరోగ్య తనిఖీ ప్రశ్నల వివరాలు
|
యాప్ డౌన్ లోడ్ లింక్ తో యాప్ డౌన్ లోడ్ సూచనలు మరియు ఇన్ స్టాలేషన్ మార్గదర్శకాలు
|
|
|
మొబైల్ యాప్ స్క్రీన్ షాట్
|
ఎస్.ఎం.సి. వెబ్ సైట్ లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం
|
(Release ID: 1627720)
Visitor Counter : 326