రక్షణ మంత్రిత్వ శాఖ
మెడగాస్కర్లోని పోర్ట్ అంట్సిరానా చేరుకున్న ఐఎన్ఎస్ కేసరి
Posted On:
29 MAY 2020 5:35PM by PIB Hyderabad
'మిషన్ సాగర్'లో భాగంగా భారత నావికా దళ నౌక కేసరి ఈ నెల 27 న మెడగాస్కర్‌లోని పోర్ట్ అంట్సిరానాను చేరుకుంది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యాన ఏర్పడిన క్లిష్టమైన
సమయాన్ని ఎదుర్కోవడంలో స్నేహపూర్వక విదేశాలకు భారత్ సహాయాన్ని అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే భారత నావికా దళం నౌక కేసరి మెడగాస్కర్ ప్రజలకు కోవిడ్ సంబంధిత అవసరమైన ఔషధాలు.. ఇతర సరుకులను తీసుకొని పోర్ట్ అంట్సిరానాను చేరుకుంది. భారత ప్రభుత్వం నుండి మెడగాస్కర్ ప్రభుత్వానికి ఔషధ అందజేతకు సంబంధించిన అధికారిక కార్యక్రమం శనివారం (ఈ నెల 29న) జరిగింది. కార్యక్రమంలో మెడగాస్కర్ దేశపు విదేశాంగ మంత్రి హెచ్.ఈ.ఎం. టెహింద్రాజనారివెలో లివా డి జాకోబా, భారత్ దేశపు బృందం తరుపున ఆ దేశంలో భారత రాయబారిగా పని చేస్తున్న అభయ్ కుమార్‌లు పాల్గొన్నారు. కోవిడ్ -19 మహమ్మారి, దాని ఫలితంగా వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవటానికి ఇరు దేశాల మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాల నిర్మాణాన్ని ‘మిషన్ సాగర్’ పటిష్టపరుస్తోంది. ‘సాగర్’ ప్రాంతపు భద్రతా మరియు వృద్ధికి సంబంధించి ప్రధాన మంత్రి చూపుతున్న చొరవను ‘మిషన్ సాగర్’ ప్రతిధ్వనిస్తుంది. దీనికి తోడు ఐఓఆర్ దేశాలతో సంబంధాలకు భారతదేశం ఇస్తున్న కీలక ప్రాముఖ్యతను కూడా ఇది తెలియజేస్తుంది. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు ఇతర ఏజెన్సీలతో సన్నిహిత సమన్వయంతో ఈ ఆపరేషన్ ముందుకు సాగుతోంది.
(Release ID: 1627698)
Visitor Counter : 319