మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 నేపథ్యంలో వినూత్న మార్గంలో ముందుకు సాగనున్న ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమం

Posted On: 28 MAY 2020 6:02PM by PIB Hyderabad

కోవిడ్ -19 ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వినూత్న మార్గాలను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వం యొక్క ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఇటీవల ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమం కింద భాగస్వామ్య మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి M/O హెచ్.ఆర్.డి. శ్రీ అమిత్ ఖరే అధ్యక్షత వహించారు. M/O హెచ్.ఆర్.డి. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమానికి నోడల్ మంత్రిత్వ శాఖ. ఈ సమావేశంలో పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ యోగేంద్ర త్రిపాఠి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ ఆనంద్ కుమార్, యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి ఉషా శర్మ, ఎస్.ఈ. &ఎల్ కార్యదర్శి శ్రీమతి అనితా కార్వాల్, మై గవర్నమెంట్ పోర్టల్ సి.ఈ.ఓ. శ్రీ అభిషేక్ సింగ్తో పాటు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, రైల్వే, హోం, రక్షణ, పార్లమెంటరీ వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న వారిని స్వాగతిస్తూ, శ్రీ అమిత్ ఖరే ఇప్పటి వరకూ ఈ కార్యక్రమం అమలు గురించి వివరించారు. కోవిడ్ -19 ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దానిని ముందుకు తీసుకువెళ్ళేందుకు వినూత్న మార్గాలు అవసరం అని నొక్కి చెప్పారు. D / o ఎస్.ఈ. &ఎల్ కార్యదర్శి శ్రీమతి అనితా కార్వాల్ సైతం స్పష్టమైన ఫలితాలను చూపించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సమావేశాన్ని పురస్కరించుకుని ఇప్పటి వరకూ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ పురోగతి మీద ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ యోగేంద్ర త్రిపాఠి పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థలు పర్యాటక రంగం యొక్క వివిధ అంశాలపై వెబ్ నార్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మై గవర్నమెంట్ పోర్టల్ ద్వారా హోస్ట్ చేస్తున్న దేఖో అప్ నా దేశ్ సిరీస్ కింద మంత్రిత్వ శాఖ వరుస వెబ్ నార్లను నిర్వహిస్తోంది. ఈ వెబ్ నార్ లకు వేలాది మంది హాజరౌతున్నారు. టూర్ ఆపరేట్ల వంటి వివిధ రాష్ట్రాల పర్యాటక వాటాదారుల కోసం ఇటువంటి వెబ్ నార్లను నిర్వహించవచ్చని ఆయన సూచించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేశో అప్నా దేశ్ మరియు ఇతర వెబ్ నార్ల రికార్డింగ్ లను విద్యా ఛానెళ్ళలో మరియు ఆన్ లైన్ తరగతుల విరామాల్లో ప్రదర్శించవచ్చని సూచించారు.

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఆనంద్ కుమార్ వారు వివిధ వెబ్ నార్ లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ మంత్రిత్వ శాఖల వెబ్ నార్ లను అన్నింటినీ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ యొక్క ఒకే ఉమ్మడి వేదిక కిందకు తీసుకురావాలని ఆయన సూచించారు. నాటకాలు రాయడం, పెయింటింగ్ లు, స్మారక చిహ్నాల వర్చువల్ పర్యటనలు వంటి వివిధ అంశాలపై ఈ –ప్రోగ్రామ్ లు సిద్ధం చేయవచ్చని ఆయన సూచించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ-హెరిటేజ్ పీడియా మరియు ఈ-ఆర్టిస్ట్ పీడియాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. వారి కళను నేర్పేందుకు వర్చువల్ ప్రోగ్రామ్ మాడ్యూళ్ళను అభివృద్ధి చేయవచ్చని సూచించారు. D / o ఎస్.ఈ. &ఎల్ కార్యదర్శి ఈ ఆలోచనను స్వాగతించారు. వోర్లి మధుబని పెయింటింగ్స్ వంటి స్వదేశీ కళలపై తరగతుల పట్ల పాఠశాలలు చాలా ఆసక్తి చూపుతాయని తెలిపారు.

ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమాలను నిర్వహించడానికి డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించడాన్ని  యువజన వ్యవహారాల విభాగం కార్యదర్శి శ్రీమతి. ఉషాశర్మ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దీని ద్వార ఈ కార్యక్రమాల విస్తరణ చాలా మెరుగుపడుతుందని తెలిపారు. వివిధ విభాగాలు తయారు చేసిన డిజిటల్ సామగ్రిని పంచుకోవాలని ఆమె సూచించారు. హెచ్.ఈ. కార్యదర్శి అన్ని మంత్రిత్వ శాఖల నుంచి ఒకే వేదిక వద్ద ఇన్ పుట్ లను సేకరించవచ్చని సూచించారు. D / o ఎస్.ఈ. &ఎల్ కార్యదర్శి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో హోస్ట్ చేయవచ్చని సూచించారు.

మై గవర్నమెంట్ డాట్ ఇన్ సి.ఈ.ఓ. శ్రీ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, వివిధ భాషల్లో 100 వాక్యాలను నేర్చుకోవడానికి మొబైల్ యాప్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మై గవర్నమెంట్ వివిధ విభాగాల వెబ్ నార్ లను హోస్ట్ చేయగలదని, వారి కార్యక్రమాల గురించి సమాచారాన్ని కూడా వ్యాప్తి చేయగలదని ఆయన తెలిపారు.

వివిధ రాష్ట్రాల సమాచారం టీవీ, రేడియో, ప్రింట్ మీడియా ద్వారా పంచుకోవడంతో పాటు ప్రతి రాష్ట్రంలోని మంచి అభ్యాసాలు, మరియు విజయాలకు సంబంధించిన గాథలను కూడా భాగస్వామ్య రాష్ట్రాలతో పంచుకోవచ్చని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ విక్రమ్ సహాయ్ సూచించారు. అన్ని విభాగాలు తమ డిజిటల్ వనరులను ఫూల్ చేయగలవని మరియు గమ్యం ఆధారిత కార్యక్రమాలను హోస్ట్ చేయడానికి డి.డి.న్యూస్ వారి వారపు ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమాన్ని ఉపయోగించవచ్చని ఆయన సూచించారు. ప్రతి మంత్రిత్వ శాఖ తమ భవిష్యత్ నెలవారీ కార్యాచరణ ప్రణాళికను విస్తృత కవరేజ్ కోసం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖతో ముందుగానే పంచుకోవాలని జె.ఎస్(ఐ.సి.సి) శ్రీమతి నీతా ప్రసాద్ సూచించారు.

రైల్వే మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ డెరక్టర్ శ్రీమతి వందన భట్నాగర్, వివిధ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులకు రాయితీలు ఇవ్వడానికి మరియు రైల్వే ఆస్తులపై లోగో, వీడియో ప్రదర్శన మొదలైన వాటిని ప్రదర్శించడానికి వారు తీసుకున్న చర్యల గురించి వివరించారు. రైళ్ళ క్రమం తప్పకుండా ప్రారంభమైన తర్వాత ఈ కార్యకలాపాలను నూతనంగా తీసుకుంటామని ఆమె తెలిపారు.

లాక్ డౌన్ కాలానికి ముందు చేపట్టిన కార్యకలాపాలు మరియు ప్రారంభించడానికి ప్రతిపాదించిన కార్యకలాపాల గురించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు.

సమావేశం ముగింపులో, హెచ్.ఈ. కార్యదర్శి ఈ క్రింది ముఖ్య కార్యాచరణ అంశాలను సంగ్రహించారు. 

i. పాల్గొనే ప్రతి మంత్రిత్వ శాఖ / విభాగం ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యకలాపాలను కొనసాగించడానికి డిజిటల్ మాధ్యమాల మీద దృష్టి కేంద్రీకరించడం.

ii. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇతివృత్తాలపై వెబ్‌నార్లను నిర్వహించడం.

iii. ప్రతి మంత్రిత్వ శాఖ ఉపయోగించగల ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ డిజిటల్ వనరులకు సాధారణ రిపోజిటరీని కలిగి ఉండటం. ఈ రిపోజిటరీని సాధారణ పోర్టల్‌లో హోస్ట్ చేయవచ్చు.

iv. సవరించిన కమ్యూనికేషన్ ప్లాన్ చేయవలసి ఉంది. దూరదర్శన్ ఈ.బి.ఎస్.బి. స్లాట్ లో 30 నిమిషాల వారపు కార్యక్రమం అన్ని మంత్రిత్వ శాఖల ఇచ్చే అంశాల ఆధారంగా పూర్తి సమన్వయంతో నిర్వహించాలి. 


(Release ID: 1627632) Visitor Counter : 270