భారత ఎన్నికల సంఘం

పునర్విభజన కమీషన్ సమావేశం జరిగింది

प्रविष्टि तिथि: 28 MAY 2020 8:22PM by PIB Hyderabad

2020 ఏప్రిల్ 29వ తేదీన జరిగిన పునర్విభజన కమీషన్ మొదటి సమావేశంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి 2020 మే 28వ తేదీన కమిషన్ తిరిగి సమావేశమయ్యింది. 

ఇంతకుముందు,  కోవిడ్-19 మహమ్మారి కారణంగా నెలకొన్న లాక్ డౌన్ కొనసాగుతున్నందువల్ల మొదటి సమావేశాన్ని నిర్వహించడంలో కొంత ఆలస్యం జరిగింది.  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివరాలపై అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ నుండి సమాచారం అందుకోవడం జరిగింది. 

పునర్విభజన చట్టం-2002 ప్రకారం అవసరమైన అసోసియేట్ సభ్యుల నామినేషన్లను లోక్ సభ నుండి స్వీకరించడం జరిగింది.   అస్సాం, మణిపూర్ శాసనసభల నుండి అసోసియేట్ సభ్యుల నామినేషన్లను కూడా స్వీకరించడం జరిగింది. 

రిజిస్ట్రార్ జనరల్ మరియు భారత జనాభా గణన కమిషనర్ నుండి అవసరమైన జనాభా లెక్కల వివరాలను స్వీకరించడం జరిగింది.  ఇంకా ఏదైనా సమాచారం పెండింగులో ఉంటే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలనుండి సేకరించాలని కమిషన్ ఆదేశించింది. సంబంధిత కార్య నిర్వహణాధికారుల నుండి అవసరమైన ఇతర డేటా / మ్యాప్‌ను కూడా నిర్ణీత కాల వ్యవధిలో సేకరించాలని కమీషన్ కోరింది.

*****


(रिलीज़ आईडी: 1627558) आगंतुक पटल : 329
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil