ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలి (ఎఫ్.ఎస్.డి.సి) 22వ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ మతి నిర్మలా సీతారామన్

Posted On: 28 MAY 2020 5:42PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు జరిగిన ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలి (ఎఫ్.ఎస్.డి.సి) 22వ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్, రెవెన్యూ శాఖ ఆర్థిక కార్యదర్శి శ్రీ అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ తరుణ్ బజాజ్, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి శ్రీ దేబాసిష్ పాండా, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ ప్రకాష్ సాహ్నీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఇంజేటి శ్రీనివాస్, ముఖ్య ఆర్థిక సలహా దారు డాక్టర్ కృష్ణమూర్తి వి. సుబ్రమణియన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్ పర్సన్ శ్రీ అజయ్ త్యాగి, బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ.ఆర్.డి.ఎ.ఐ) ఛైర్ పర్సన్ శ్రీ సుభాష్ చంద్ర ఖున్తియా, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (పి.ఎఫ్.ఆర్.డి.ఎ) ఛైర్ పర్సన్ శ్రీ సుప్రతీమ్ బంధోపాధ్యాయ, దివాలా మరియు బ్యాంక్ రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబిబిఐ) ఛైర్ పర్సన్ డాక్టర్ ఎం.ఎస్.సాహూ, భారత ప్రభుత్వ మరియు ఆర్థిక రంగ సంస్థల నియంత్రణ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ప్రస్తుత ప్రపంచ మరియు దేశీయ స్థూల-ఆర్థిక పరిస్థితి, ఆర్థిక స్థిరత్వం మరియు దుర్బలత్వ సమస్యలు, బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు అలాగే నియంత్రణ మరియు విధాన ప్రతిస్పందనలు, ఎన్.బి.ఎఫ్.సి / హెచ్‌.ఎఫ్‌.సి / ఎం.ఎఫ్‌.ఐ.ల ద్రవ్యత / సాల్వెన్సీ మరియు ఇతర సంబంధిత సమస్యలను ఈ సమావేశంలో సమీక్షించారు. దానితో పాటు మార్కెట్ అస్థిరత, దేశీయ వనరుల సమీకరణ మరియు మూలధన ప్రవాహ సమస్యలపై కూడా కౌన్సిల్ చర్చించింది.

కోవిడ్ -19 మహమ్మారి సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పుగా ఉందని, సంక్షోభం యొక్క అంతిమ ప్రభావం మరియు పునరుద్ధరణ ఈ సమయంలో అనిశ్చితంగా ఉందని కౌన్సిల్ పేర్కొంది. మహమ్మారి నుంచి వచ్చే పతనాలను తగ్గించే లక్ష్యంతో నిర్ణయాత్మక ద్రవ్య మరియు ఆర్థిక విధాన చర్యలు స్వల్పకాలంలో పెట్టుబడిదారుల మనోభావాలను స్థిరీకరించినప్పటికీ, ఆర్థిక ఇబ్బందులను తెలియజేసే ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం మరియు అన్ని మధ్యస్థ మరియు దీర్ఘకాలిక నియంత్రకాలు నిరంతరం జాగురూకతతో ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ మరియు నియంత్రణ చేసే వారి ప్రయత్నాలు ఆర్థిక మార్కెట్లలో సుదీర్ఘకాలం ఈ సమస్యల నివారించడంపై దృష్టి సారించాయి.

ఇటీవల కాలంలో ప్రభుత్వం మరియు నియంత్రణ చేసే వారు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి తీసుకున్న కార్యక్రమాలను కౌన్సిల్ గమనించింది. ఆర్థిక నష్టాన్ని ముందస్తుగా పరిమితం చేయడానికి, ఆర్థిక సంస్థల ద్రవ్యత మరియు మూలధన అవసరాలను తీర్చడం కొనసాగించే దిశగా ప్రభుత్వం మరియు ఆర్.బి.ఐ. వివిధ ఆర్థిక మరియు ద్రవ్య చర్యలను ప్రకటించాయి.

ఇంతకుముందు ఎఫ్‌.ఎస్‌.డి.సి. తీసుకున్న నిర్ణయంపై సభ్యులు తీసుకున్న చర్యలను కూడా కౌన్సిల్ సమీక్షించింది.

 

***



(Release ID: 1627530) Visitor Counter : 287