కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ట్విట్టర్ హ్యాండిల్ @LabourDG ని ప్రారంభించిన మంత్రి శ్రీ సంతోష్ గంగ్వార్
- కార్మిక సంక్షేమానికి సంబంధించిన తాజా గణాంకాల్ని అందించనున్నహ్యాండిల్
Posted On:
28 MAY 2020 2:55PM by PIB Hyderabad
కార్మిక సంక్షేమానికి సంబంధించిన తాజా గణాంకాలను అందించే ప్రయత్నంలో భాగంగా కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ లేబర్ బ్యూరో కోసం ట్విట్టర్ హ్యాండిల్ @LabourDG ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్మిక, ఉపాధి కార్యదర్శి శ్రీ హీరలాల్ సమారియా, ఎస్ఎల్ఈఏ & డైరెక్టర్ జనరల్ లేబర్ బ్యూరో శ్రీ డీపీఎస్ నేగి తదితరులు పాల్గొన్నారు. ఈ హ్యాండిల్ భారతీయ కార్మిక మార్కెట్ సూచీల స్నాప్‌షాట్ నిరంతర & నవీకరణ సోర్స్‌గా ఇది తోడ్పడుతుందని మంత్రి ట్వీట్ చేశారు. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ అనుబంధపు కార్యాలయమై లేబర్ బ్యూరో వేతనాలు, ఆదాయాలు, ఉత్పాదకత, హాజరులేమితనం, కార్మిక ఆదాయం, పారిశ్రామిక సంబంధాలు, పని మరియు జీవన పరిస్థితులు, వివిధ రకాల పని మూల్యాంకనంతో పాటు వివిధ రకాల కార్మిక చట్టాలు మొదలైన వాటిపై కార్మిక అంశాలపై సమాచారాన్ని సేకరించి వాటిని ప్రచారం చేస్తోంది. లేబర్ బ్యూరో ప్రచారం చేసిన సమాచారం దేశంలో ఉపాధి విషయమై ఉపాధిపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు మరియు విధానాల రూపకల్పన విషయమై ప్రభుత్వానికి సలహా ఇవ్వడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. లేబర్ బ్యూరోకు ఇండెక్స్ నంబర్ల సంకలనం మరియు నిర్వహణ, కార్మిక రంగంలోని గణాంకాల సేకరణ మరియు సర్వేలు నిర్వహించడం, అడ్మినిస్ర్టేటివ్ లేబర్ స్టాటిస్టిక్స్ సంకలనం మరియు వాటి వ్యాప్తికి సంబంధించిన వివిధ కార్యకలాపాలను విధిగా నిర్వహిస్తోంది. లేబర్ బ్యూరో సంస్థ లేబర్ ఫోర్స్ సర్వేలు & ఎంటర్ప్రైజ్ సర్వేలలో నిమగ్నమై ఉంది. ఇది ప్రధానంగా లేబర్ ఫోర్స్కు సంబంధించిన సూచికలకు సంబంధించిన అంచనాలను అందిస్తుంది. లేబర్ బ్యూరో 1946 లో స్థాపించబడింది. లేబర్ బ్యూరో యొక్క రెండు ప్రధాన విభాగాలు ఛండిగఢ్ మరియు సిమ్లాలలో ఉన్నాయి. దీనికి అయిదు ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అహ్మదాబాద్, కాన్పూర్, కోల్‌కతా, గౌహతి మరియు చెన్నైలలో ముంబయి
ఉప ప్రాంతీయ కార్యాలయాలను కలిగి ఉంది. ఈ సంస్థకు ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్‌కు (ఐఈఎస్) చెందిన అదనపు సెక్రటరీ స్థాయి అధికారి డైరెక్టర్ జనరల్‌గా ఉంటారు. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ మరియు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్ఎస్) నిపుణుల బృందంతో ఇందులో పని చేస్తుంది.
(Release ID: 1627528)
Visitor Counter : 310