వ్యవసాయ మంత్రిత్వ శాఖ

పీఎం-జీకేవై కింద 13.4 కోట్ల మంది లబ్ధిదారులకు 1.78 లక్షల మెట్రిక్ ట‌న్నుల‌ పప్పు ధాన్యాల‌ పంపిణీ

- లాక్‌డౌన్‌ కాలంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద 9.67 కోట్ల మంది రైతులకు రూ.19,350.84 కోట్ల నిధులు విడుదల

Posted On: 27 MAY 2020 7:03PM by PIB Hyderabad

ప్రధాన్ మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్‌ యోజన (పీఎం-జీకేవై) కింద సుమారు 4.57 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల‌కు పంపించబడ్డాయి. ఇందులో 1.78 లక్షల మెట్రిక్ ట‌న్నుల‌ పప్పు ధాన్యాలు రాష్ట్రాలు / ‌కేంద్ర పాలిత ప్రాంతాల‌లోని 1340. 61 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేయబడ్డాయి.
లాక్‌డౌన్ స‌మ‌యంలో నాఫెడ్ పప్పుధాన్యాలు మరియు నూనె గింజల సేకరణ స్థితి ఇలా ఉంది:
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ మరియు హర్యానా రాష్ర్టాల‌ నుండి 933 లక్షల మెట్రిక్ ట‌న్నుల‌ శ‌న‌గ‌ల‌ను సేకరించారు.
- రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ మరియు హర్యానాల‌లో (ఐదు) రాష్ట్రాల నుండి 5.91 లక్షల మెట్రిక్ ట‌న్నుల‌ ఆవాలు సేక‌రించ‌బ‌డ్డాయి.
- తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు ఒడిశా (8 రాష్ట్రాల) నుండి 2.41 లక్షల మెట్రిక్ ట‌న్నుల కందులు సేకరించబడ్డాయి.
రబీ మార్కెటింగ్ సీజన్లో గోధుమల‌ సేకరణ..
2020-21 ర‌బీ మార్కెటింగ్ సీజన్‌లో (ఆర్‌ఎంఎస్) ఎఫ్‌సీఐకి మొత్తం 359.10 లక్షల మెట్రిక్ ట‌న్నుల‌ గోధుమలు రాగా.. అందులో 347.54 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోళ్లు జ‌రిపారు.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకంః
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద లాక్‌డౌన్ సమ‌యం అంటే
24.3.2020 నుండి ఇప్పటి వరకు 19,350.84 కోట్ల నిధుల‌ను విడుదల చేశారు. దీంతో లాక్‌డౌన్ కాలంలో 9.67 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది.

***


(Release ID: 1627341) Visitor Counter : 378