సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జమ్మూ & కాశ్మీర్ లో కోవిడ్ -19 ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 27 MAY 2020 5:00PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంత అభివృద్ధి కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర ఛార్జ్), పి.ఎం.ఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవియెన్స్, పెన్షన్స్, అణుశక్తి మరియు అంతరిక్షం శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు జమ్మూ & కాశ్మీర్ లో కోవిడ్ -19 ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. పెద్ద సంఖ్యలో వ్యక్తులు కేంద్ర పాలిత ప్రాంతాలకు తిరిగి రావడంతో పాటు కేసులు పెరిగే విషయాన్న దృష్టిలో ఉంచుకుని ఈ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స ద్వారా జరిగిన ఈ సమీక్షలో మిషన్ డైరక్టర్, నేషనల్ హెల్త్ మిషన్, జమ్మూ కాశ్మీర్ డివిజన్ డైరక్టర్ హెల్త్ సర్వీసెస్ మరియు అన్ని జిల్లా సి.ఎం.ఓ.లు పాల్గొన్నారు.

 

 

ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయి నివేదికల గురించి మంత్రికి వివరించారు. వివిధ దశల్లో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులు కేంద్ర పాలిత ప్రాంతానికి పెద్ద సంఖ్యలో తిరిగి వచ్చే వ్యక్తుల మీద ఆధారపడి ఉందని, వీరికి ఇప్పటికే పరీక్షలు నిర్వహించారని, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులను నిర్బంధంలో ఉంచటమే కాకుండా, వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా పరీక్షల సామర్థ్యం పెంచబడిందని, 10 వేల నుంచి 10 లక్షలకు పెరిగిందని తెలిపారు. ఆరోగ్య అధికారులు ఐ.సి.ఎం.ఆర్. యాప్ ను వినియోగిస్తున్నారని, దీని ద్వారా పరీక్ష ప్రక్రియ ఫలితాలు తిరిగి వచ్చే సమయాన్ని మూడు రోజులకు తగ్గించినట్లు వివరించారు. కోవిడ్ -19 పాజిటివ్ వ్యక్తులతో పరిచయం కలిగి ఉన్న కోవిడ్ -19 రోగులను గుర్తించడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ కు సమాచారం అందించారు.

కోవిడ్ -19 ఎదుర్కొనేందుకు కేంద్ర పాలిత ప్రాంతం చేస్తున్న ప్రయత్నాలను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. కేసులు పెరుగుదల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని, ఉన్నత ప్రయత్నాల ద్వారా ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని, అదే విధంగా అన్న పాజిటివ్ కేసులను గుర్తించడమే గాక, సమర్థవంతమైన చికిత్సను అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. రెడ్ జోన్లు, కంటైన మెంట్ జోన్లు ప్రజల భద్రత మరియు వైరస్ నియంత్రణ కోసమే అన్న డాక్టర్ జితేంద్ర సింగ్, కరోనా మీద విజయవంతమైన పోరాటం నిర్విహించేందుకు ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని, వారి జీవితాలను కొనసాగించాలని, జీవనశైలిలో మార్పులను ప్రోత్సహించాలని సూచించారు.

 

***



(Release ID: 1627265) Visitor Counter : 182