శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

‘కోవిడ్‌ కథ’ను హిందీలో అందుబాటులోకి తెచ్చిన ఎన్‌సీఎస్‌టీసీ

కోవిడ్ కథ: ప‌్ర‌జ‌ల సామూహిక అవగాహన కోసం మల్టీమీడియా గైడ్
కోవిడ్‌-19 మ‌హ‌మ్మారికి సంబంధించి స‌మ‌స్త‌ ముఖ్యమైన సమాచారంతో అందుబాటులోకి..

Posted On: 27 MAY 2020 5:25PM by PIB Hyderabad

కేంద్ర శాస్త్ర మ‌రియు సాంకేతిక మంత్రిత్వ శాఖ‌కు (డీఎస్టీ) చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ మ‌రియు టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్‌సీఎస్‌టీసీ) సంస్థ డాక్టర్ అనామికా రే మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో ప్ర‌జ‌ల సామూహిక అవగాహన కోసం కోవిడ్‌-19కు సంబంధించిన ప్ర‌ధాన‌మైన అన్ని‌ అంశాల‌తో ‘కోవిడ్‌ కథ’మల్టీమీడియా గైడ్‌ను హిందీ భాష‌లో అందుబాటులోకి తెచ్చింది. ఇంగ్లీష్ వె‌ర్షన్ ఇప్పటికే ఈ నెల ప్రారంభంలో విడుదలైన సంగ‌తి తెలిసిందే. హిందీ మాట్లాడే ప్రాంతాల వారి నుంచి ‘కోవిడ్‌ కథ’హిందీ వెర్షన్‌కు గ‌ల డిమాండ్‌ను నెరవేర్చడానికి వీలుగా ‘కోవిడ్‌ కథ’ను  హిందీ ఎడిషన్‌లో అందుబాటులోకి తెచ్చారు.  ప్ర‌జా ప్రయోజనాల‌ కోసం మ‌రికొంత సవరించిన సమాచారాన్ని జోడించి హిందీ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చారు.
‘కోవిడ్‌ కథ’ను అభినందించిన డీఎస్టీ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ:
దేశ ప్ర‌జ‌ల్లో సామూహిక అవగాహన కోసం అందుబాటులోకి తెచ్చిన ‘కోవిడ్‌ కథ’ మల్టీమీడియా గైడ్‌ను డీఎస్టీ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అభినందించారు. సైన్స్‌కు చెందిన అంశాల‌ను సామాన్యుల భాషలోకి మ‌ర‌ల్చి అవ‌గాహ‌న నిమిత్తం వాటికి త‌గ్గ వ్యాఖ్యానం అందించ‌డాన్ని ప్ర‌స్తుతించారు. ప్ర‌జ‌ల‌లో విష‌య అవగాహనకు గాను విష‌యాన్ని వారి భాష‌లోనే అందిస్తే ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంది అని ఆయ‌న అన్నారు. దేశంలో అత్య‌ధికుల‌ భాష‌గా హిందీ ఉన్నందున ‘కోవిడ్‌ కథ’ యొక్క హిందీ వెర్షన్ ఈ వైర‌స్‌కు సంబంధించిన విష‌యాల్ని మ‌రింత విలువ‌తో ప్ర‌జ‌ల్లోకి తీసుకు పోయేందుకు ఈ గైడ్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు. సైన్స్ కార్టూన్లు (సైంటూన్లు) శాస్త్రీయ సందేశాలను అందిస్తున్న‌ప్పుడు ఆరోగ్య భావనలను సరళంగా వివరిస్తూనే ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ సమయంలో ఒత్తిడికి గురైనప్పుడు ప్ర‌జ‌ల‌కు హాస్యం మరియు వినోదాన్ని జోడిస్తాయ‌ని అన్నారు.
వివిధ భాష‌ల్లో అందుబాటులోకి..
మ‌ల్టీమీడియా సాంకేతిక‌త‌ల‌ను మరియు డిజిటల్ వేదిక‌‌ల్ని ఉపయోగించి కోవిడ్-19 మ‌హ‌మ్మారి పై ప్ర‌జ‌ల‌లో సాధారణ అవగాహన కల్పించేందుకు గాను భార‌త ప్ర‌భుత్వం శాస్త్ర మ‌రియు సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్ర‌జ‌లు సరైన జ్ఞానం మరియు విశ్వాసంతో కోవిడ్‌-19 మహమ్మారిని అర్థం చేసుకోవడానికి మరియు నిర్మూలించేందుకు త‌గు విధంగా సహాయపడేలా ఇంటరాక్టివ్ ఎలక్ట్రానిక్ గైడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆసక్తికరంగా దేశవ్యాప్తంగా ప్రారంభించిన ‘కోవిడ్‌ కథ’ ఉద్య‌మానికి ప్రజలు విశేష‌మైన మద్దతునిస్తున్నారు. ఇది దేశ వ్యా‌ప్తంగా గొలుసు ప్రతిచర్య రూపాన్ని సంతరించుకుంటూ ప్ర‌జ‌ల్లో త‌గు విధంగా అవ‌గాహ‌న క‌ల్పించేలా దోహ‌దం చేస్తోంది. ‘కోవిడ్‌ కథ’ను మేఘాలయాకు చెందిన‌ ఖాసీ భాషలో అనువదిస్తున్నారు; తమిళ వెర్షన్ కూడా త్వ‌ర‌లోనే రానుంది; ప్రజలు తమ సొంతంగా బెంగాలీ మరియు అస్సామీ వెర్షన్ల యందు అందుబాటులోకి తెచ్చే దిశ‌గా కృషి చేస్తున్నారు.
వివిధ సోష‌ల్ మీడియాల్లో వినియోగం..
దేశ సైన్స్ కమ్యూనికేషన్స్ రంగంలోని ప‌లువురు ఔత్సాహికులు వివిధ ఫార్మాట్లలో ‘కోవిడ్‌ కథ’ను ఫ్లిప్ వెర్షన్ మ‌రియు యానిమేషన్లు, వీడియోలు మరియు ఇతర ఫార్మాట్లలో అందుబాటులోకి తెచ్చే దిశ‌గా స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నారు. కోవిడ్-19 పై మాస్ కమ్యూనికేషన్ ప్రచారాలకు గాను ప‌లు అధికారిక సంస్థలు తమ సోషల్ మీడియాలో ‘కోవిడ్‌ కథ’లోని వివిధ అంశాలను వినియోగిస్తున్నారు.  కోవిడ్ -19 నుంచి ర‌క్ష‌ణ‌కు గాను చేయవలసినవి మ‌రియు చేయకూడని ప‌నుల‌ సైంటూన్లు, వ‌ర్ణ‌మాల ఉప‌యోగించి రోజువారీ సమాచారం మొదలైన అంశాల‌ను ఆయా సంస్థ‌లు కోవిడ్ -19 పై అవ‌గాహన ప్ర‌చారానికి ఉప‌యోగిస్తున్నారు. ‘కోవిడ్‌ కథ’ గైడ్‌‌ను హిందీతో పాటుగా ఇతర భాషలలో అందుబాటులోకి తెవ‌డం వ‌ల్ల ఈ మ‌హ‌మ్మారిపై అవ‌గాహ‌న‌ను ప్ర‌జ‌ల్లో మ‌రింత లోతుగా వ్యాప్తి చేయడానికి దోహ‌దం చేయ‌నున్నాయి.


‘కోవిడ్‌ కథ’ను హిందీలో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘కోవిడ్‌ కథ’ను ఆంగ్లంలో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

****

 


(Release ID: 1627261) Visitor Counter : 372