ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆరోగ్యసేతు ఇక ఓపెన్ సోర్స్
Posted On:
26 MAY 2020 8:18PM by PIB Hyderabad
బ్లూటూత్ ఆధారిత కాంటాక్ట్ ట్రేసింగ్, హాట్స్పాట్ల మ్యాపింగ్, కోవిడ్-19 సంబంధిత సమాచారాన్ని విస్తృత ప్రచారం చేసే లక్ష్యంతో కేంద్రం ఒక చొరవ తీసుకుంది. అదే ఆరోగ్య సేతు యాప్. కొవిడ్-19 వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నాలను వేగవంతం చేయడానికి భారత్ ఈ ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ని 2020 ఏప్రిల్ 2న ప్రారంభించింది. మే 26 నాటికి ఈ యాప్ 114 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది, ఇది ప్రపంచంలోని ఇతర కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ కంటే ఎక్కువ. ఇది 12 భాషలలో, ఆండ్రాయిడ్, ఐఓఎస్, కెఏఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులు తమను, తమ ఆప్తులను, దేశాన్ని రక్షించుకోవడానికి ఆరోగ్య సేతును ఉపయోగిస్తున్నారు. చాలా మంది యువకులు సేతును తమ బాడీగార్డ్ అని కూడా పిలుస్తారు. ఆరోగ్య సేతు ముఖ్య స్తంభాలు పారదర్శకత, గోప్యత, భద్రత, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌పై భారతదేశ విధానానికి అనుగుణంగా, ఆరోగ్య సేతు సోర్స్ కోడ్ ఇప్పుడు ఓపెన్ సోర్స్‌గా మార్పు జరిగింది. అప్లికేషన్ ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం సోర్స్ కోడ్ https://github.com/nic-delhi/AarogyaSetu_Android.git లో సమీక్ష, సహకారం కోసం అందుబాటులో ఉంది. అప్లికేషన్ ఐఓఎస్ వెర్షన్ రాబోయే రెండు వారాల్లో ఓపెన్ సోర్స్‌గా విడుదల అవుతుంది, సర్వర్ కోడ్ తరువాత విడుదల అవుతుంది. దాదాపు 98% ఆరోగ్య సేతు యూజర్లు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నారు.
డెవలపర్ కమ్యూనిటీకి సోర్స్ కోడ్‌ను తెరవడం పారదర్శకత, సహకారం సూత్రాలకు తమ నిరంతర నిబద్ధతను సూచిస్తుందని అధికారులు తెలిపారు. ఆరోగ్య సేతు అభివృద్ధి ప్రభుత్వం, పరిశ్రమ, అకాడెమియా, పౌరుల మధ్య సహకారానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ ప్రపంచ స్థాయి ఉత్పత్తిని తయారు చేయడానికి అలుపెరగని కసరత్తు చేసిన మన దేశంలోని ప్రతిభావంతులైన యువ సాంకేతిక నిపుణుల కృషికి ఇది ఒక తార్కాణం. పబ్లిక్ డొమైన్‌లో సోర్స్ కోడ్ విడుదలతో, సహకారాన్ని విస్తరించడానికి, మన దేశంలోని ప్రతిభావంతులైన యువత మరియు పౌరులలో అగ్ర సాంకేతిక మేధో నైపుణ్యాన్ని పెంచడానికి, సమిష్టిగా బలమైన, సురక్షితమైన సాంకేతిక పరిష్కారాన్ని రూపొందించడానికి కృషి జరుగుతోంది. ఈ మహమ్మారిని కలిసి పోరాడడంలో ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు దీని ద్వారా తోడ్పాటు కలుగుతుంది.
ఈ యాప్ కోవిడ్-19 కి వ్యతిరేకంగా మధ్యలో జోక్యం చేసుకునే సమగ్రమైన యంత్రాంగాన్ని వృద్ధి చేసింది. ప్రారంభించిన ఎనిమిది వారాల్లో అనేక ప్రథమ స్థానాలను ఆక్రమించుకోడాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కలిపిన అన్ని ఇతర కొవిడ్-19 కాంటాక్ట్ ట్రేసింగ్, స్వీయ-అంచనా సాధనాలతో పోల్చినప్పుడు యాప్ చాలా ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, అదే సమయంలో సిండ్రోమిక్ మ్యాపింగ్ ద్వారా మహమ్మారి ప్రగతిలో ఎగుడు దిగుడులను సూచించే కర్వింగ్ కి సంబంధించిన కొత్త డేటా ద్వారా ఎపిడెమియోలాజి పరంగా వ్యాధి వ్యాప్తి తీరు తెన్నులకు ఇది మార్గదర్శకత్వంగా ఉంటుంది. 114 మిలియన్లకు పైగా నమోదైన వినియోగదారులలో, మూడింట రెండొంతుల మంది కోవిడ్-19 కు గురయ్యే ప్రమాదాన్ని అంచనా వేయడానికి స్వీయ-అంచనా పరీక్షను తీసుకున్నారు.
బ్లూటూత్ తో అనుసంధమై ఉన్నసుమారు 5 లక్షల మందిని గుర్తించడానికి యాప్ సహాయపడింది. కోవిడ్-19 పాజిటివ్ కేసుల బ్లూటూత్ అనుసంధానమైన వారీతో గుర్తించబడిన, వారి స్వీయ-అంచనా ఆధారంగా సహాయం అవసరమని వర్గీకరించబడిన వారిని నేషనల్ హెల్త్ అథారిటీ సంప్రదిస్తుంది. ఇప్పటివరకు, ఈ ప్లాట్‌ఫాం 900,000 మందికి పైగా వినియోగదారులకు చేరుకుంది, క్వారంటైన్, జాగ్రత్తలు, పరీక్షల కోసం వారికి సలహా ఇవ్వడానికి సహాయపడింది.కోవిడ్-19 పరీక్ష కోసం సిఫారసు చేయబడిన వారిలో, దాదాపు 24% మంది కోవిడ్-19 పాజిటివ్‌గా ఉన్నట్లు నిర్ధారణ అయింది. బ్లూటూత్ అనుసంధానం కలిగి ఉన్నవారు, స్థాన డేటా విశ్లేషణలు కోవిడ్ కేసుల అధిక సంభావ్యత కలిగిన సంభావ్య హాట్‌స్పాట్‌లను గుర్తించడంలో సహాయపడ్డాయి, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిపాలన, ఆరోగ్య అధికారులు మహమ్మారిని అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది, ఇది మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడంలో కీలకం. సబ్ పోస్ట్ ఆఫీసుల స్థాయిలో 3,500 హాట్ స్పాట్ లను ఆరోగ్య సేతు బృందం గుర్తించింది. 114 మిలియన్లకు పైగా వినియోగదారులు క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్న వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉత్పత్తి సోర్స్ కోడ్‌ను విడుదల చేయడం ఒక సవాలు. టీమ్ ఆరోగ్య సేతు, డెవలపర్ కమ్యూనిటీకి సోర్స్ కోడ్‌ను అభివృద్ధి చేయడం, నిర్వహించడం చాలా పెద్ద బాధ్యత. ఇప్పుడు పంచుకుంటున్న రిపోజిటరీయే అసలు ఉత్పత్తి వాతావరణం. అన్ని తదుపరి ఉత్పత్తి నవీకరణలు ఈ రిపోజిటరీ ద్వారా కూడా అందుబాటులో ఉంచబడతాయి. ఓపెన్ సోర్స్ అభివృద్ధికి తోడ్పడే ప్రక్రియను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) నిర్వహిస్తుంది. పుల్ రిక్వెస్ట్ సమీక్షల ద్వారా అన్ని కోడ్ సూచనలు ప్రాసెస్ చేయబడతాయి. ఆరోగ్య సేతు సోర్స్ కోడ్ అపాచీ లైసెన్స్ వెర్షన్ 2.0 క్రింద లైసెన్స్ పొందింది. ఇది “యాజ్-ఈజ్” ప్రాతిపదికన లభిస్తుంది. కోడ్‌లో మార్పులతో సోర్స్ కోడ్ కి సంబంధించిన ఏదైనా పునర్వినియోగానికి డెవలపర్ మార్పు నోటీసును కలిగి ఉండాలి. మరిన్ని వివరాలను https://www.mygov.in/aarogya-setu-app/ వద్ద తరచుగా అడిగే ప్రశ్నల (ఎఫ్ఏక్యూ) పత్రంలో చూడవచ్చు.
కోడ్‌ను ఓపెన్ సోర్స్‌గా తయారుచేసేటప్పుడు, ఆరోగ్య సేతును మరింత దృఢంగా, సురక్షితంగా చేయడానికి ఏదైనా హాని, కోడ్ మెరుగుదలలను గుర్తించడంలో సహాయపడటానికి కేంద్ర ప్రభుత్వం డెవలపర్ల సహాయం తీసుకుంటుంది. ఈ లక్ష్యం వైపు, ఆరోగ్యా సేతు, భద్రతా ప్రభావాన్ని పరీక్షించడానికి భద్రతా పరిశోధకులు, భారతీయ డెవలపర్ కమ్యూనిటీతో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇది భద్రతను మెరుగుపరచడం,వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడం చేస్తుంది. బగ్ బౌంటీ ప్రోగ్రామ్ వివరాలతో పాటు అందులోని రివార్డులు విడిగా భాగస్వామ్యం చేయబడుతున్నాయి. బగ్ బౌంటీ ప్రోగ్రామ్ వివరాలు మైగోవ్ వినూత్న పోర్టల్‌లో https://innovate.mygov.in/ వద్ద అందుబాటులో ఉన్నాయి.
భారత ప్రభుత్వం, ఉత్పత్తి రూపకల్పన, కోడ్‌ను తెరవడం ద్వారా, ప్రపంచ శ్రేయస్సుకు తన బలమైన నిబద్ధతను చాటింది. కొవిడ్-19 తో పోరాడటానికి, పరిష్కారం ప్రయోజనాలను ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు అందుబాటులో ఉంచడానికి సాంకేతిక పరిజ్ఞానం పట్ల మన విధానం నుండి అభ్యాసాలను పంచుకోవడానికి భారతదేశం ఆసక్తిగా ఉంది. మహమ్మారిపై పోరాడటానికి ఏ ప్రభుత్వమైనా ఉపయోగించుకోవచ్చు. మనమంతా కలిసి, ఈ మహమ్మారిపై పోరాడటానికి వైద్యులు,ముందు వరుసలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు మద్దతు ఇస్తూనే ఉంటాము.
मैं सरक्षितु हम सरक्षितु भारत सरक्षितु
*****
(Release ID: 1627140)
Visitor Counter : 429