రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
బిఎస్-6 విభాగం నాలుగు చక్రాల వాహనాల ఉద్గార ప్రమాణాలు
Posted On:
24 MAY 2020 5:56PM by PIB Hyderabad
రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ బి ఎస్ - 6 విభాగంలోని నాలుగు చక్రాల వాహనాల ఉద్గార ప్రమాణాలు నిర్దేశిస్తూ జి ఎస్ ఆర్ 308 (ఇ) పేరిట 2020 మే 22వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి ఈ ప్రమాణాలు అమలులోకి వస్తాయి. దీంతో ఎల్, ఎమ్, ఎన్ విభాగాల వాహనాలన్నిటికీ బిఎస్ - 6 ప్రక్రియ పూర్తయినట్టవుతుంది. ఇప్పుడు ఉద్గారాల నిబంధనలు ఇయు, డబ్ల్యు ఎంటిసి కి అనుగుణంగా ఉన్నట్టు లెక్క. ఎఐఎస్ 137 లోని 9వ విభాగానికి అనుగుణంగా పరీక్షా విధానం ఉంటుంది.
******
(Release ID: 1626650)
Visitor Counter : 283