ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ లంక అధ్యక్షుని తో టెలిఫోన్ లో సంభాషించిన ప్ర‌ధాన‌ మంత్రి

Posted On: 23 MAY 2020 2:39PM by PIB Hyderabad

శ్రీ లంక అధ్యక్షుడు మాన్య శ్రీ  గోట్ బాయా రాజపక్షె తో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ  న‌రేంద్ర‌ మోదీఈ రోజు న టెలిఫోన్‌ లో మాట్లాడారు.  కోవిడ్ 19 విశ్వమారి ప్రస్తుత ప్రాబల్యం తో పాటు, ఆ ప్రపంచవ్యాప్త వ్యాధి ఈ ప్రాంతం లో ప్రసరింపచేస్తున్న ఆరోగ్య సంబంధమైన ప్రభావం మరియు ఆర్థిక సంబంధమైన ప్రభావం కూడా ఇద్దరు నేతల మధ్య  చర్చ కు వచ్చింది.

విశ్వమారి తాలూకు ప్రచండత ను తగ్గించడం లో శ్రీ లంక కు సాధ్యమైన అన్ని రకాల తోడ్పాటు ను అందించడాన్ని భారతదేశం కొనసాగిస్తుందంటూ శ్రీ లంక అధ్యక్షుని కి ప్ర‌ధాన‌ మంత్రి హామీ ని ఇచ్చారు.   

ఆర్థిక కార్యకలాపాల ను పున:ప్రారంభించడం కోసం తన ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల ను అధ్యక్షుడు శ్రీ రాజపక్షె ప్ర‌ధాన‌ మంత్రి కి వివరించారు.  ఈ సందర్భం లో, శ్రీ లంక లో భారతదేశం ఆర్థిక సహాయం తో అమలవుతున్న అభివృద్ధియుత పథకాల ను వేగవంతం చేయవలసిన అవసరం ఉందని ఉభయ నేత లు అంగీకరించారు.  భారతదేశ ప్రయివేటు రంగం ద్వారా శ్రీ లంక లో పెట్టుబడుల ప్రోత్సాహాని కి గల అవకాశాల ను గురించి, అలాగే భారతదేశ ప్రయివేటు రంగం ద్వారా శ్రీ లంక లో విలువ జోడింపునకు గల అవకాశాల ను గురించి కూడా వారు చర్చించారు.

శ్రీ లంక ప్రజల కు మంచి ఆరోగ్యం తో పాటు శ్రేయస్సు ప్రాప్తించాలంటూ  ప్ర‌ధాన‌ మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. 
 

**


(Release ID: 1626400)