పర్యటక మంత్రిత్వ శాఖ

"దేఖో అప్నా దేశ్" సిరీస్ లో భాగంగా 'పులులు -పర్యాటకం' పేరుతో వెబినార్ ను నిర్వహించిన పర్యాటక మంత్రిత్వ శాఖ

Posted On: 22 MAY 2020 7:47PM by PIB Hyderabad

పర్యాటక మంత్రిత్వ శాఖ 2020 మే 21 న దేఖో అప్నా దేశ్ వెబి‌నార్ సిరీస్ కింద ‘పులులు-పర్యావరణం’ పై తాజాగా వెబి‌నార్‌ను నిర్వహించింది. భారతదేశంలో పులుల ఆవాసానికి సంబంధించిన గొప్ప వారసత్వాన్ని, భారతదేశంలో పర్యాటకానికి దాని ఔచిత్యాన్ని ఆవిష్కరించడం.

కార్యక్రమాన్ని పర్యాటక మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి రూపిందర్ బ్రార్ సమన్వయం చేశారు. ప్రముఖ వన్యప్రాణుల సంరక్షణ ఫోటోగ్రాఫర్, చిత్రనిర్మాత, నేషనల్ జియోగ్రాఫిక్ ఫెలో, ఫోటోగ్రఫీలో బాఫ్టా విజేత , అత్యుత్తమ సినిమాటోగ్రఫీకి ఎమ్మీ నామినీ శ్రీ సందేశ్ కదూర్ ప్రెజెంట్ చేశారు.

అగుంబే, సుందరమైన అడవి మధ్య కూర్చున్న సందేశ్, పులులు పర్యాటకం గురించి తన టీనేజ్ కాలం నాటి అనుభవాలతో ఒక గంట ప్రయాణం ప్రారంభించారు, అతను ప్రసిద్ధ బ్రిటిష్ వేటగాడు జిమ్ కార్బెట్ పుస్తకాలను చదివేవారు. చివరికి అడవి పెద్ద పిల్లులయిన పులుల డాక్యుమెంట్ చేయడానికి ప్రేరణ పొందారు. దాదాపు 8 సంవత్సరాల క్రితం, టైగర్స్ అండ్ టూరిజంపై ఒక వీడియోను డాక్యుమెంట్ చేయడానికి అతను భారతదేశం అంతటా పర్యటించారు, ఈ శక్తివంతమైన, చారల జీవుల అధిక జనాభాతో భారత పర్యాటక రంగం అవినాభావ సంబంధాన్ని ఈ పర్యటన తెలియజేస్తుంది. 

ఏదేమైనా, పులుల పట్ల మానవాళికి యుగయుగాలుగా ఉన్న ఆసక్తి గురించి సందేశ్ పేర్కొన్నారు. దేవాలయం నుండి దేవాలయానికి, గ్రామం నుండి గ్రామం వరకు నడుస్తున్న పులి చారలలో తమను తాము చిత్రించడం ద్వారా పులుల పట్ల తమకున్న గౌరవాన్ని సూచించే సంప్రదాయం భారతదేశంలో విస్తృతంగా కనిపిస్తుంది. తీర కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యం హులి వేషా లేదా పిలి యేసాయి, దుర్గాదేవి ని ఆరాధించేదిగా  నవరాత్రి సందర్భంగా ప్రదర్శించారు.

ప్రపంచ పులి జనాభాలో 70% పులులు భారతదేశంలోని విభిన్న ఆవాసాలలో ఉన్నాయి, ప్రస్తుతం 15 జాతుల పెద్ద పిల్లులు దేశవ్యాప్తంగా 50 ప్రదేశాల్లో ఉన్నాయి. ఉత్తరాన ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నుండి అస్సాంలోని కాజీరంగ నేషనల్ పార్క్ (ఈశాన్యం) మరియు పశ్చిమ బెంగాల్ (తూర్పు) లోని సుందర్బన్స్, రాజస్థాన్ లోని రణతంబోర్ నేషనల్ పార్క్, కన్హా, బందవగఢ్ టైగర్ రిజర్వ్స్ వరకు, మధ్య భారత్ లోని మధ్యప్రదేశ్‌లో, పశ్చిమ కనుమల వర్షారణ్యాలలో నాగర్హోల్ నేషనల్ పార్క్, పెరియార్ టైగర్ రిజర్వ్, బండిపూర్ నేషనల్ పార్క్, అనామలై టైగర్ రిజర్వ్, దక్షిణ భారతదేశంలోని మదుమలై నేషనల్ పార్క్ వంటి అనేక ఇతర పులుల ఆవాసాలు ఉన్నాయి. 

వైల్డ్ క్యాట్స్ ఆఫ్ ఇండియా అనే డాక్యుమెంటరీ చిత్రనిర్మాత కూడా అయిన సందేశ్ కదూర్ ఈ అపారమైన పిల్లుల ప్రాణాలను రక్షించడంలో బాధ్యతాయుతమైన పర్యాటకంగా ఉండటం, సహజీవనం సాధన చేయడం అనేది ఒక సుదూర ప్రయాణమని స్పష్టం చేసారు. వన్యప్రాణులలో భారతదేశం చాలా ఆశ్చర్యపరిచే వైవిధ్యం గల దేశమని,  ప్రజలను అధిక సంఖ్యలో దేశాన్ని సందర్శించడానికి ఆకర్షిస్తుందని అన్నారు. ఇటువంటి పర్యాటకుల తాకిడి మరీ ఎక్కువై రద్దీగా మారితే  జంతువులకు, సాధారణంగా పులులకు ముప్పు కలగవచ్చని హెచ్చరించారు. అందువల్ల సుస్థిర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సందేశ్ తెలిపారు. దేఖో అప్నా దేశ్ వెబినార్ సిరీస్ ఈ ఏప్రిల్ 14న ప్రారంభమయింది. ఇప్పటి వరకు 22 ప్రదర్శనలు నిర్వహించి, దేశంలోని వివిధ పర్యాటక అంశాలు, ఆకర్షణలను ప్రజలకు వీక్షించే అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు 90 వేల మందికి పైగా వెబ్ సిరీస్ ని వీక్షించారు. 

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద నడుస్తున్న నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ ఒక ప్రొఫెషనల్ బృందంతో నేరుగా సాంకేతిక సహాయాన్ని అందించడం ద్వారా దేఖో అప్నా దేశ్ వెబినార్ లను నిర్వహించడంలో మంత్రిత్వ శాఖకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తోంది. 

వెబినార్ సెషన్‌లు ఇప్పుడు https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/  లో అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.

తర్వాతి వెబినార్ మే 23వ తేదీ ఉదయం 1100-1200 గంటల వరకు ఉంటుంది. ‘సైకిల్ పర్యటనలు- పెడల్ వేగంతో భారత్ ను అన్వేషించండి’ పేరుతో జరిగే ఈ వెబినార్ లో రిజిస్టర్ అవ్వండి:  https://bit.ly/BicycleToursDAD

 

****



(Release ID: 1626340) Visitor Counter : 211