రైల్వే మంత్రిత్వ శాఖ
జూన్ 1నుంచి తిరిగి మొదలవనున్న 200 రైళ్లు.. పూర్తి స్థాయిలో కొనసాగుతున్న టికెట్ల బుకింగ్
మే 22 రాత్రి 8 గంటల సమయానికి అందుబాటులోకి వచ్చిన మొత్తం 200 రైళ్ల టికెట్ బుకింగ్
నిన్నటినుంచి 14, 13, 277 ప్రయాణికులకు సంబంధించిన 6, 52, 644 టికెట్లను ఆన్‌లైన్లో బుక్ చేసుకున్న ప్రజలు
ప్రస్తుతమున్న శ్రామిక్ రైళ్లకు, ఏసీ రైళ్లకు (13) ఈ 200 రైళ్లు అదనం. శ్రామిక్ రైళ్లను మే 1నుంచి , ప్రత్యేక ఏసీ రైళ్లను మే 12నుంచి పట్టాలెక్కించారు
Posted On:
22 MAY 2020 9:32PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య శాఖ, కేంద్ర హోంశాఖలతో సంప్రదింపులు చేసిన తర్వాత కేంద్ర రైల్వే శాఖ జూన్ 1నుంచి మరిన్ని రైళ్లను నడపడానికి ఏర్పాట్లను చేసుకుంటున్నది.
దేశవ్యాప్తంగా రెండు వందల రైళ్లను నడపడానికి వీలుగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇవి జూన్ 1నుంచి సేవలందిస్తాయి. వీటికి సంబంధించి బుకింగ్ మే 21న ప్రారంభమైంది. ప్రస్తుతమున్న శ్రామిక్ రైళ్లకు, ఏసీ రైళ్లకు (13) ఈ 200 రైళ్లు అదనం. శ్రామిక్ రైళ్లను మే 1నుంచి , ప్రత్యేక ఏసీ రైళ్లను మే 12నుంచి పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.
ఈ రైళ్లకు సంబంధించి ఆన్ లైన్ బుకింగ్ ను ఐఆర్ సి టిసి వెబ్ సైట్ ద్వారాగానీ, మొబైల్ యాప్ ద్వారాగానీ చేసుకోవచ్చు. మే 21 నుంచి రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా, ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా, టికెట్ ఏజెన్సీలద్వారా కూడా టికెట్లను బుక్ చేస్తున్నారు.
మే 21న ఈ రైళ్ల బుకింగ్ ప్రారంభం కాగా మే 22 రాత్రి 8 గంటల సమయానికి మొత్తం 200 రైళ్ల బుకింగ్ అందుబాటులోకి వచ్చింది. 14, 13, 277 ప్రయాణికులకు సంబంధించిన 6, 52, 644 టికెట్లను ప్రజలు ఆన్ లైన్లో బుక్ చేసుకున్నారు.
****
(Release ID: 1626338)
Visitor Counter : 186