ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ రుణ వివరాలతో 9వ ఎడిషన్ ‘స్టేటస్ పేపర్’ విడుదల
Posted On:
22 MAY 2020 4:35PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వపు రుణ అంశాలను వెల్లడిస్తూ సర్కారు శుక్రవారం (22వ తేదీన) ఒక ‘స్టేటస్ పేపర్’ను విడుదల చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన 9వ ఎడిషన్ ‘స్టేటస్ పేపర్’ కావడం గమనార్హం. భారత ప్రభుత్వ మొత్తం రుణ స్థితిపై వివరణాత్మక విశ్లేషణతో ఈ ‘స్టేటస్ పేపర్’ పేపర్‌ను సర్కారు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం 2010-11 నుండి భారత ప్రభుత్వ రుణ స్థితిపై ‘స్టేటస్ పేపర్’ను విడుదల చేస్తూ వస్తోంది. ఏడాది పొడుగున ప్రభుత్వం జరిపిన రుణ కార్యకలాపాల యొక్క వివరణాత్మక ఖాతాను ఈ పేపర్ వెలుగులోకి తెచ్చింది. తద్వారా ఈ పత్రం రుణ లావాదేవీలలో మరింత పారదర్శకతను పెంపొందించనుంది. ఇది 2018-19 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వపు ద్రవ్యలోటుకు సంబంధించి ఆర్థిక కార్యకలాపాల వివరాలను కలిగి ఉంది. ప్రభుత్వపు రుణ పోర్ట్‌ఫోలియో వివేకవంతమైన రిస్క్ ప్రొఫైల్‌తో వర్గీకరించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా తన ఆర్థిక లోటును పుడ్చుకొనేందుకు గాను మార్కెట్ పరిణామాలతో అనుసంధానత కలిగిన వివిధ రకాల రుణాలను ఆశ్రయిస్తుంది. రుణ స్థిరత్వానికి సంబందించిన సాంప్రదాయక సూచికలు, అనగా ప్రభుత్వ రుణం, జీడీపీ నిష్పత్తి, వడ్డీ చెల్లింపులు, రెవెన్యూ ఆదాయాలు, స్వల్పకాలిక రుణ షేర్లు, బయటి నుంచి తీసుకున్న రుణాలు, రుణాలలో ఎఫ్ఆర్‌బీల మొత్తం తదితర అంశాలు సమగ్ర పద్ధతిలో స్టేటస్ పేపర్‌లో వివరంగా విశ్లేషించబడ్డాయి. ఈ పత్రంలో 2019-20 నుండి 2021-22 వరకు వివిధ ఆర్థిక సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వ రుణ నిర్వహణ వ్యూహాన్ని కూడా పొందుపరచబడి ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం రుణాలు తీసుకునే ప్రణాళికకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈ ‘స్టేటస్ పేపర్’ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఈ కింది వెబ్‌సైట్ నందు అందుబాటులో ఉంది:
https://dea.gov.in/public-debt-management.
(Release ID: 1626134)
Visitor Counter : 418