పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
జీవవైవిధ్యాన్నికాపాడడంలో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలు, అనుభవాలను ప్రపంచదేశాలతో పంచుకోనున్న ఇండియా : కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జవడేకర్ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా ఐదు కార్యక్రమాలు ప్రారంభం
Posted On:
22 MAY 2020 3:16PM by PIB Hyderabad
అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం 2020 సందర్భంగా , వర్చువల్ మాధ్యమం ద్వారా నిర్వహించిన ఉత్సవంలో కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్‌జవడేకర్, ,జీవవైవిధ్య పరిరక్షణకు ఐదు కీలక కార్యక్రమాలను ప్రారంభించారు.
2020 వ సంవత్సరం జీవవైవిధ్యానికి సూపర్ సంవత్సరం . 2010లో అమలులోకి వచ్చిన 20 అంతర్జాతీయ ఐచి లక్ష్యాల జీవ వైవిద్య వ్యూహాత్మక ప్రణాళిక 2020 లో ముగుస్తుంది. దీనితో అన్ని దేశాలూ కలసికట్టుగా, 2020 అనంతర అంతర్జాతీయ జీవవైవిధ్య ప్రేమ్ వర్క్‌కు సిద్ధమయ్యే ప్రక్రియలో ఉన్నాయి. భారతదేశం పెద్ద ఎత్తున జీవవైవిధ్యంగల దేశమని, తమ తమ దేశాలలో జీవవైవిధ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకునే దేశాలకు మన అనుభవాలు, మనం అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను వారితో పంచుకునేందుకు సిద్ధమని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు.
మన వినియోగాన్ని తగ్గించుకుంటూ , సుస్థిర జీవన విధానాన్ని పెంపొందించుకోవలసిన అవసరాన్ని పర్యావరణ శాఖ మంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
ఈ సంవత్సరపు నినాదం గురించి ప్రస్తావిస్తూ శ్రీ జవడేకర్, మన పరిష్కరాలు ప్రకృతిలోనే ఉన్నాయని అన్నారు. అందువల్ల మన ప్రకృతిని పరిరక్షించడం ప్రస్తుత కోవిడ్ -19 పరిస్థితుల నేపథ్యంలో ఎంతో కీలకమని ఆయన అన్నారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులతో సహా పలు విపత్తులనుంచి ఇది మనల్ని కాపాడుతుందన్నారు.
జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి , జాతీయ జీవవైవిధ్య అథారిటీ (ఎన్‌బిఎ)ని, ప్రారంభించారు. అలాగే యునైటెడ్ నేషన్స్ డవలప్‌మెంట్ ప్రోగ్రాం(యుఎన్‌డిపి), జీవ వైవిధ్య సంరక్షణ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. దీని ద్వారా 20 మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థులు , బహిరంగ, పారదర్శక, ఆన్‌లైన్ ఎంపిక విధానం ద్వారా ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ పొందుతారు. ప్రకృతి వనరుల నిర్వహణలో , జీవవైవిధ్య పరిరక్షణగురించి నేర్చుకునేందుకు ఆసక్తి , ఉత్సాహం ఉన్న సృజనాత్మక విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా అవకాశం లభిస్తుంది. అలాగే వివిధ రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్‌బిఎ ప్రాజెక్టులకు మద్దతునిస్తారు. దీనితోపాటు రాష్ట్రాల జీవవైవిధ్య బోర్డులు, కేంద్రపాలిత ప్రాంతాల జీవవైవిధ్య మండలులు తమ నిర్దేశాలను పాటించడానికి అవసరమైన సాంకేతిక సహాయాన్నిఅందిస్తారు. ఇదంతా బహింరంగ, పారదర్శక, ఆన్‌లైన్ పోటీ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తారు.
ఈ వర్చువల్ ఈవెంట్‌లోనే, అంతరించిపోతున్న జీవ జంతుజాలం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా యుఎన్ఇపి ప్రచారమైన ‘అన్ని జంతువులు తమ ఇష్టప్రకారం వలస వెళ్లవు ’ అనే దానిని ప్రారంభించారు.
జంతువుల అక్రమ వ్యాపారంవల్ల ప్రమాదకరమైన మహమ్మారులు వ్యాపించే ప్రమాదం ఉంది. అన్ని జంతువులు తమ ఇష్టప్రకారం వలసవెళ్లవు అనే ప్రచారాన్నియు.ఎన్.ఇ.పితో కలసి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ప్రారంభించింది. ఇది పర్యావరణ పరంగా ఎదురౌతున్నసవాళ్ళను పరిశీలించి, సంబంధిత వర్గాలలో దీనిపై అవగాహన కల్పించడంతోపాటు పరిష్కారాలను కనుగొంటుంది.
జీవవైవిధ్య పరిరక్షణ, జీవవైవిధ్య చట్టం 2002 పై ఒక వెబినార్ సిరీస్‌ను కూడా ప్రారంభించారు. దీనితోపాటు డబ్ల్యు డబ్ల్యుఎఫ్ మోడల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (ఎం సిఒపి) ను ప్రారంభించారు ఇది యువత భాగస్వామ్యంతో చేపట్టే కార్యక్రమం. దీనిద్వారా వారు జీవవైవిధ్యంపై మానవాళి ప్రభావాన్ని తెలుసుకుని, జీవవైవిధ్య పరిరక్షణ కు సంబంధించి ఒక కొత్త పంథాను అనుసరించడానికి దోహదం చేస్తుంది. మన ఉనికిని కాపాడుకోవడానికి జీవవైవిధ్యాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో దీని ద్వారా తెలుసుకోగలుగుతారు. మానవాళికి ప్రకృతి ఉచితంగా అందించే పర్యావరణ సేవలు ఎంత కీలక పాత్ర వహిస్తున్నాయో తెలియజేసే ప్రచారాన్నిడబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్ మద్దతుతో ఈ సందర్భంగా ప్రారంభించారు.
(Release ID: 1626124)
Visitor Counter : 468
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam