భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

భార‌త వాతావ‌ర‌ణ శాఖకు చెందిన‌ వెబ్‌సైట్‌లోని (ఐఎండీ) ఏడు సేవ‌లు ఉమంగ్ యాప్‌లోనూ అందుబాటులోకి

Posted On: 22 MAY 2020 2:33PM by PIB Hyderabad

‘యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్’ (ఉమంగ్) ను భూ వైజ్ఞానిక శాస్ర్తాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం. రాజీవన్ ప్రారంభించారు. భార‌త వాతావర‌ణ శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ ఎం. మ‌హాపాత్ర‌, ఎన్ఈజీడీ అధ్య‌క్షుడు, సీఈఓ శ్రీ అభిషేక్ సింగ్‌ల  స‌మ‌క్షంలో రాజీవ‌న్ ఈ రోజు (22వ తేదీన‌) ఉమంగ్‌ను ప్రారంభించారు. భారత ప్రభుత్వం ఆల్-ఇన్-వన్‌గా  ఏకీకృత, సురక్షితమైన, బ‌హుళ ఛానల్, బ‌హుళ -ప్లాట్‌ఫాం, బహుళ భాష‌, బహుళ-సేవ మొబైల్ యాప్‌గా ఉమంగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన వివిధ సంస్థ‌ల‌ మేటి ప్ర‌భావ‌వంత‌మైన సేవ‌ల‌కు ప్రాప్య‌త‌ను అందించేందుకు వీలుగా ఈ యాప్‌ను మేటి బ్యాక్ ఎండ్ ప్లాట్‌ఫామ్‌తో రూపొందించారు. దేశ పౌరులకు మొబైల్ ఫోన్‌లో ప్రభుత్వాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే భారీ లక్ష్యంలో భాగంగా.. అన్ని ప్రభుత్వ సేవలను ఒకే మొబైల్ యాప్‌లో తీసుకురావడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ 2017 లో ఉమంగ్ యాప్ ను ఆవిష్క‌రించారు. యుటిలిటీ చెల్లింపులతో సహా 127 డిపార్ట్‌మెంట్లు, 25 రాష్ట్రాల నుండి సుమారు 660 సేవలు యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో మ‌రిన్ని సేవ‌లు ఈ యాప్‌లో అందుబాటులోకి రానున్నాయి.
ఐఎండీ డిజిట‌ల్ ఇండియా చొర‌వ‌తో..
తాజాగా అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక‌ ప‌రిక‌రాల‌ ఆధారంగా వాతావరణపు సూచనలు మరియు హెచ్చరిక సేవలను విస్తరించేందుకు గాను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇటీవలి సంవత్సరాలలో వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఈ చొరవను మరింత మెరుగుపరిచేందుకు గాను ఐఎండీ డిజిటల్ ఇండియా కార్య‌క్ర‌మంలో “ఉమంగ్ యాప్” ను ఉపయోగించుకోవాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా ఐఎండీ యొక్క http://mausam.imd.gov.in అనే వెబ్‌సైట్‌లో హోస్ట్ చేయబడిన ఈ క్రింది ఏడు ర‌కాల సేవల‌ను ఉమంగ్ యాప్‌లోకి ఆన్‌బోర్డ్ చేసింది:
ప్రస్తుత వాతావరణంః  దేశంలోని దాదాపు 150 న‌గ‌రాల‌కు చెందిన ప్రస్తుత ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగం దిశ త‌దిత‌ర స‌మాచారాన్ని అందించ‌నున్నారు. దాదాపుగా రోజుకు 8 సార్లు ఈ స‌మాచారాన్ని నవీకరిస్తారు. సూర్యోదయం / సూర్యాస్తమయం మరియు చంద్రోదయం / చంద్రాస్త‌మ‌యం గురించి సమాచారం కూడా అందించ‌నున్నారు.

నౌకాస్ట్- స్థానిక వాతావరణానికి సంబంధించి ప్ర‌తి మూడు గంటలకోసారి దేశ వ్యాప్తంగా 800 స్టేష‌న్ల  మ‌రియు జిల్లాల‌కు గాను రాష్ట్ర వాతావరణ కేంద్రాలు జారీ చేసిన‌ ‌ హెచ్చరికలు కూడా ఇక‌పై ఉమంగ్‌లో అందుబాటులోకి రానున్నాయి. తీవ్ర‌మైన వాతావ‌రణ ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో వాటి ప్ర‌భావానికి సంబంధించిన స‌మాచారాన్ని, త‌గిన హెచ్చ‌రిక‌ల‌తో స‌హా ఇందులో జోడించి ప్ర‌జ‌ల‌కు స‌మాచారం చేరవేసేలా అందించనున్నారు.

నగర వాతావ‌ర‌ణ ప‌రిస్థితికి సంబందించిన‌ సూచనలు- భారతదేశంలోని 450 నగరాల చుట్టూ.. గత 24 గంటలు మరియు 7 రోజుల వాతావరణ పరిస్థితుల సూచనల‌ను అందించ‌నున్నారు.

వర్షపాతం సమాచారం- అఖిల భార‌త‌ జిల్లా వర్షపాతం సమాచారం రోజువారీ, వార, నెలవారీ మరియు సంచిత శ్రేణులు అందుబాటులో ఉంచ‌నున్నారు.

పర్యాటకుల నిమిత్తం వాతావ‌ర‌ణ సూచన- భారతదేశంలోని సుమారు 100 పర్యాటక నగరాల వాతావరణ పరిస్థితుల గురించి గత 24 గంటలు మరియు 7 రోజుల సూచనలు కూడా ఇందులో అందించ‌నున్నారు.

హెచ్చరికలు- ప్రమాదకరమైన వాతావరణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌భావిత ప్రాంతాల‌ పౌరులను హెచ్చరించడానికి హెచ్చరికలు‌ జారీ చేయ‌నున్నారు. దీనిని ఎరుపు, నారింజ‌ మరియు పసుపు రంగులలో కోడ్ చేయనున్నారు ఇందులో ఎరువు  అత్యంత తీవ్రమైన ప‌రిస్థితిని తెలియ‌జేస్తుంది. రాబోయే ఐదు రోజులకు సంబంధించిన వాతావర‌ణ అంచనాలు అన్ని జిల్లాలకు రోజుకు రెండు సార్లు జారీ చేయ‌నున్నారు.

తుఫాను స‌మాచారం- తుఫాను హెచ్చరికలతో పాటుగా తుఫాను ముందుకు క‌ద‌లాడుతున్న ప‌రిస్థితితో పాటు అది తీరం దాటే సమయం మరియు ఎక్క‌డ అది తీరం దాటే అవ‌కాశం ఉంద‌నేటి స‌మాచారం అందించ‌నున్నారు. తుఫాను ప్రభావ ఆధారిత హెచ్చరికలు, ప్రాంతం / జిల్లా వారీగా జారీ చేయబడతాయి, తద్వారా హాని కలిగించే ప్రాంతాల తరలింపుతో సహా తగిన సన్నాహాలు చేసేందుకు వీలుప‌డుతుంది.
                      వివరణ: స్క్రీన్ షాట్_20200521-232416

                 Description: Screenshot_20200521-232416        

                        

 

                



ఈ యాప్‌ కింది లింక్‌ల‌లో డౌన్‌లోడ్ చేసుకొనేందుకు వీలుగా అందుబాటులో ఉంటుంది:

వెబ్ : https://web.umang.gov.in/web/#/
ఆండ్రాయిడ్‌: https://play.google.com/store/apps/details?id=in.gov.umang.negd.g2c
ఐఓఎస్‌: https://apps.apple.com/in/app/umang/id1236448857


(Release ID: 1626080) Visitor Counter : 285