పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పశ్చిమ కనుమల్లో పర్యావరణపరంగా సున్నిత ప్రాంతం (ఈఎస్ఏ) నోటిఫికేషన్ ప్ర్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్రాలు
Posted On:
21 MAY 2020 8:45PM by PIB Hyderabad
దేశ పశ్చిమ కనుమలలో పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతం (ఈఎస్ఏ) నోటిఫికేషన్‌కు సంబంధించిన వివిధ సమస్యలను గురించి చర్చించేందుకు గాను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల విశ్లేషణ శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పశ్చిమ కనుమలు కలిగి ఉన్న ఆరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, క్యాబినెట్ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మంత్రి సంభాషించారు. ఈ సమావేశంలో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటుగా తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, క్యాబినెట్ మంత్రులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వపు అధికారులతో ముచ్చటించారు. ఈ ప్రాంతపు స్థిరమైన మరియు సమగ్ర అభివృద్ధికి అనుమతించేటప్పుడు పశ్చిమ కనుమల యొక్క జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి మరియు రక్షించడానికి గాను భారత ప్రభుత్వం డాక్టర్ కస్తూరిరంగన్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూపును (హెచ్ఎల్‌డబ్ల్యూజీ) ఏర్పాటు చేసింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ మరియు తమిళనాడు రాష్ట్రాలలో గుర్తించబడిన భౌగోళిక ప్రాంతాలను పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలుగా ప్రకటించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. ఈఎస్ఏలో తెలియ జేయవలసిన ప్రాంతాలను పేర్కొంటూ 2018 అక్టోబర్‌లో ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయబడింది. పశ్చిమ కనుమల యొక్క ప్రాముఖ్యతను పరిశీలిస్తూనే.. పశ్చిమ కనుమల రక్షణను నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఆయా రాష్ట్రాలు ఈ సందర్భంగా ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డాయి. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న కార్యకలాపాలు మరియు విస్తీర్ణానికి సంబంధించి ఆయా రాష్ట్రాలు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఈ విషయమై ఏకాభిప్రాయానికి వచ్చే విధంగా ఆయా రాష్ర్టాలకు సంబంధించి నిర్దిష్ట సమస్యలపై మరింతగా చర్చించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జీవావరణం మరియు పర్యావరణ ప్రయోజనాలను పరిరక్షిస్తూనే వీలైనంత త్వరగా నోటిఫికేషన్‌ను తీసుకువచ్చేలా ప్ర్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి.
https://twitter.com/PrakashJavdekar/status/1263443091882512384?s=20
(Release ID: 1625919)
Visitor Counter : 303