ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం

Posted On: 21 MAY 2020 5:46PM by PIB Hyderabad

   లాక్‌డౌన్ అమ‌లు, కోవిడ్ -19 మేనేజ్‌మెంట్ కు సంబంధించి ప్ర‌భుత్వం తీసుకున్నకొన్ని నిర్ణ‌యాల‌పై కొన్ని ప‌త్రిక‌ల‌లో  వార్తా క‌థ‌నాలు వ‌చ్చాయి.
దేశంలో ఆరోగ్య రంగ మౌలిక స‌దుపాయాల‌ను బాగా పెంచ‌డానికి లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ప్ర‌యోజ‌న‌క‌రంగా వాడుకోవ‌డం జ‌రిగింది. ఇవాల్టివ‌ర‌కు 45, 299 మంది  కోవిడ్ వైర‌స్‌నుంచి కోలుకున్నారు. దీనితో వ్యాధినుంచి కోలుకున్న వారి  రేటు 40.32 శాతానికి చేరింది. 21.05.2020 నాటికి 26,15,920 శాంపిళ్ళ‌ను దేశ‌వ్యాప్తంగా గ‌ల 555 ప‌రీక్షా కేంద్రాల ద్వారా ( 391 ప్ర‌భుత్వ రంగంలోనివి కాగా 164 ప్రైవేటు రంగంలోనివి) ప‌రీక్షింప‌చేయ‌డం జ‌రిగింది. ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్‌, న్యూఢిల్లీ వారు కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ తో క‌ల‌సి , కమ్యూనిటీ ఆధారిత సెరో- స‌ర్వే నిర్వ‌హిస్తోంది. సార్స్‌-సిఒవి-2 ఇన్‌ఫెక్ష‌న్ వ్యాప్తి భార‌త ప్ర‌జ‌ల‌లో ఏవిధంగా ఉందో అంచ‌నా  వేయ‌డానికి ఈ స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు. దీనికి నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్‌, రాష్ట్రాల ఆరోగ్య విభాగాలు కీల‌క భాగ‌స్వామ్య సంస్థ‌లు, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స‌హ‌క‌రిస్తున్నాయి.

      కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌మ‌ష్టి కృషితో 3027 ప్ర‌త్యేక కోవిడ్ ఆస్ప‌త్రులు, కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు,, 7013 కోవిడ్ సంర‌క్ష‌ణ కేంద్రాల‌ను  ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది..దీనికితోడు 2.81 ల‌క్ష‌ల‌కు పైగా ఐసొలేష‌న్ బెడ్లు ,31,250 ఐసియు బెడ్లు,1,09,888 ఆక్సిజ‌న్ ఏర్పాటుతో కూడిన బెడ్ల‌ను కోవిడ్  ప్ర‌త్యేక ఆస్ప‌త్రులు, కోవిడ్ ఆరోగ్య కేంద్రాల‌లో ఏర్పాటు చేశారు. ప్ర‌భుత్వం 65.0 ల‌క్ష‌ల పిపిఒ క‌వ‌ర్ ఆల్ కిట్ల‌ను, 101.07 ల‌క్ష‌ల ఎన్ -95 మాస్కుల‌ను వివిధ‌ రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేసింది . అలాగే రోజుకు సుమారు 3 ల‌క్ష‌ల పిపిఇ క‌వ‌ర్ ఆల్‌లు, 3 ల‌క్ష‌ల ఎన్ -95 మాస్కులను  దేశీయ త‌యారీ దారులు ఉత్ప‌త్తి చేస్తున్నారు. ఇంత‌కు ముందు ఇవి మ‌న దేశంలో త‌యార‌య్యేవి కావు.

          దీనికి తోడు, కోవిడ్‌-19ను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని స్థాయిల‌లో సాంక్ర‌మిక వ్యాధుల‌ నిపుణుల‌ను సంప్ర‌దించి వారి సేవ‌ల‌ను వినియోగించుకోవ‌డం జ‌రుగుతోంది. కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్‌) ఏర్పాటు చేసిన నేష‌న‌ల్ టాస్క్‌ఫోర్స్ (ఎన్‌టిఎఫ్‌) 2020 మార్చి  నెల మ‌ధ్య నుంచి ఇప్ప‌‌టివ‌ర‌కు 20 స‌మావేశాలు నిర్వ‌హించింది. ‌కోవిడ్ మ‌హ‌మ్మారిని  ఎదుర్కొనేందుకు  చురుకుగా, ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం ఈ  సంస్థ శాస్త్ర , సాంకేతిక స‌ల‌హాల‌ను అందిస్తోంది.
     కేంద్ర ప్ర‌భుత్వ శాస్త్ర ,‌ సాంకేతిక విభాగానికి (డిఎస్‌టి) చెందిన ,  జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ సెంట‌ర్ ఫ‌ర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రిసెర్చ్ (జెఎన్ సిఎఎస్‌.ఆర్‌‌) కి చెందిన శాస్త్ర‌వేత్త‌లు, ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌, బెంగ‌ళూరు తో క‌ల‌సి  కోవిడ్ -19 కు సంబంధించి సూక్ష్మ ప‌రిశోధ‌‌క  న‌మూనాను రూపొందించారు ఇది వ్యాధి ప‌రిణామ క్ర‌మానికి సంబంధించిన స్వ‌ల్ప‌కాలిక అంచ‌నాల‌ను అందించ‌గ‌ల‌దు. త‌ద్వారా దీనినుంచి వైద్య‌ అవ‌స‌రాల‌ను అంచ‌నా వేయ‌డానికి వీలు క‌లుగుతుంది.

    కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం , శాస్త్ర‌విజ్ఞానం , భూ విజ్ఞాన శాఖ‌ల మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ సార‌ధ్యంలో , దేశంలోని శాస్త్ర‌వేత్త‌ల‌ను ప్రోత్స‌హించేందుకుచ‌క్క‌టి స‌మ‌న్వ‌యంతో  కూడిన విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ శాస్త్ర‌వేత్త‌లు 24 గంట‌లూ శ్ర‌మ ప‌డి  కొత్త ప‌రీక్షా కిట్‌లు, ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు, శ్వాస‌సంబంధిత ప‌రిక‌రాల‌ను అభివృద్ది చేసేందుకు గ‌ట్టి కృషి చేస్తున్నారు. దీనితో అవ‌స‌రాల‌కు అనుగుణంగా  ‌నూత‌న‌ ఆవిష్క‌ర‌ణ‌లు చేసేందుకు స‌మ‌ష్టి గా కృషి చేయ‌డానికి , వివిధ ప‌రిశోధ‌న‌ల స‌మాచారాన్ని ఒక‌రికొక‌రు అంద‌జేసుకోవ‌డానికి ఒక ఉమ్మ‌డి వేదిక ల‌భించిన‌ట్ట‌యింది. అలాగే ఒక‌రు చేసిన ప‌నినే మ‌రొక‌రు చేసి స‌మ‌యం వృధాకాకుండా నివారించ‌గ‌లుగుతున్నారు. కోవిడ్ -19 కు సంబంధించి ఎన్నో స‌మ‌స్య‌ల‌కు  ప‌రిష్కారాలు క‌నుగొనేందుకు మన దేశంలో  సాంకేతిక ప‌రిజ్ఞానాల స్థాయిని పెంచేందుకు , డిపార్ట‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ (డిఎస్‌టి) నాయ‌క‌త్వ పాత్ర పోషిస్తోంది. ఇందుకు డిఎస్‌టి కింద ప‌నిచేసే వివిధ‌ సంస్థ‌ల స‌హాయం తీసుకుంటోంది. డిబిటి, దాని పిఎస్‌యు అయిన బ‌యోటెక్నాల‌జీ ఇండ‌స్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిఐఆర్ ఎసి) కోవిడ్‌-19 రిసెర్చ్ క‌న్సార్టియం ను ప్ర‌క‌టించింది. డ‌యాగ్న‌స్టిక్స్‌, వాక్సిన్‌, చికిత్స‌,  మందుల‌ను భిన్న ప్ర‌యోజ‌నాల‌కు వాడ‌డం, లేదాకోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు అవ‌స‌ర‌మైన ఏ ఇత‌ర చ‌ర్య‌ల‌కైనా ప‌రిశోధ‌న‌లను ముందుకు తీసుకువెళ్లేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

 కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న‌,  ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అభియాన్ వంటి ఎన్నో విధాన నిర్ణ‌యాల‌ను ప్ర‌క‌టించింది. వ‌ల‌స‌కూలీలు, వీధివ్యాపారులు, ప‌ట్ట‌ణాల‌లోని వ‌ల‌స పేద‌లు, చిన్న వ‌ర్త‌కులు, స్వ‌యం ఉపాధి పొందుతున్న వారు, చిన్న రైతులు, నిర్మాణ రంగంలోని వారి క‌ష్టాల‌ను తొల‌గించేందుకు వీటిని తీసుకువ‌చ్చారు. వ‌ల‌స కార్మికులు, ప‌ట్ట‌ణాల‌లోని పేద‌లు త‌క్కువ అద్దెతో సుల‌భ‌త‌ర జీవ‌నం సాగించ‌డానికి వీలుగా కేంద్ర‌ప్ర‌భుత్వం ఒక ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చింది.  వ‌ల‌స‌కార్మికులు, పట్ట‌ణ పేద‌లు, విద్యార్థుల‌కు చౌక అద్దెతో ల‌భించే‌ హౌసింగ్ కాంప్లెక్స్‌లు వారికి సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించ‌డంతోపాటు, జీవ‌న నాణ్య‌త‌ను పెంచుతాయి. న‌గ‌రాల‌లో  ప్ర‌భుత్వ నిధుల‌తో నిర్మించిన ఇళ్ళ‌ను ఇలాంటి  చౌక అద్దెల గృహ నిర్మాణ కాంప్లెక్స్‌లుగా  పిపిపి విధానంలో మారుస్తారు. ఇలాంటి గృహ‌నిర్మాణ కాంప్లెక్స్‌లు నిర్మించేందుకు ప‌రిశ్ర‌మ‌లు, సంస్థ‌లు, అసోసియేష‌న్ల‌ను ప్రోత్స‌హిస్తారు. ఇవి వాటి ప్రైవేటు భూముల‌లో నిర్మించి నిర్వ‌హించ‌వ‌చ్చు. ఇలాంటి గృహ‌నిర్మాణ కాంప్లెక్స్‌లు చేప‌ట్టి ,నిర్వ‌హించే కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు, రాష్ట్ర‌ప్ర‌భుత్వ ఏజెన్సీలకు ప్రోత్సాహకాలు ఇస్తారు.


 

****


(Release ID: 1625836) Visitor Counter : 250