ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఎన్.ఏ.ఎమ్. ఆరోగ్య మంత్రుల సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న - డాక్టర్ హర్ష వర్ధన్.

"వసుధైవ కుటుంబకం"- ప్రపంచమంతా మన కుటుంబం అనే సిద్ధాంతాన్ని నొక్కి చెప్పారు.

Posted On: 20 MAY 2020 5:58PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈరోజు అలీన ఉద్యమ (నామ్) దేశాల ఆరోగ్య మంత్రుల సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.  

ఈ సమావేశానికి అజర్బైజాన్ ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఒగ్తాయ్ షిరాలియేవ్ అధ్యక్షత వహించారు. 

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవితాలను, జీవనోపాధికి విఘాతం కలిగించే మహమ్మారిని అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న తరుణంలో నామ్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు.  కోవిడ్-19 ఎదుర్కొంటున్న ప్రపంచ ముప్పు పై నామ్ తన ఆందోళనను వ్యక్తం చేసింది. సరైన సంసిద్ధత, నివారణ, స్థితిస్థాపకత-నిర్మాణం మరియు మరింత ఎక్కువగ  జాతీయ, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సహకారంతో పోరాడాలని సంకల్పించింది.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ హర్ష వర్ధన్ చేసిన ప్రసంగ పాఠం ఈ విధంగా ఉంది : 

"మిస్టర్ చైర్మన్, గౌరవనీయులైన సోదర, సోదరీమణులారా!

ఈ ముఖ్యమైన మరియు సకాలంలో సదస్సును నిర్వహిస్తున్నందుకు, సభాధ్యక్షుడైన, అజర్‌బైజాన్ ఆరోగ్యశాఖ మంత్రిని అభినందిస్తూ, నా  ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. 

నిస్సందేహంగా ఇది మన భూగోళం చరిత్రలో ఒక అనూహ్యమైన ఘట్టం.  కోవిడ్-19 దాదాపు మూడు వందల వేల (3,00,000) విలువైన ప్రాణాలను బలిగొంది, నాలుగు మిలియన్లకు పైగా సోకింది. బిలియన్ల కొద్దీ ప్రజల జీవనోపాధికి విఘాతం కలిగించింది.  ఈ ప్రాణాంతకమైన వ్యాధికి ప్రపంచ వ్యాప్తంగా తమ దగ్గరి మరియు ప్రియమైన బంధు మిత్రులను కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను.

అధ్యక్షా, కోవిడ్-19 ద్వారా మనం మునుపెన్నడూ లేనంతగా పరస్పరం అనుసంధానించబడి, పరస్పరం ఆధారపడుతున్నామన్న విషయం మనకు తెలిసింది.  వాతావరణ మార్పు, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు వంటి మన గ్రహం నేడు ఎదుర్కొంటున్న మానవ నిర్మిత సవాళ్లు - మనం విడివిడిగా ఉన్నప్పుడు కంటే, ఒకరికొకరు కలిసి ఉన్నప్పుడు మాత్రమే పరిష్కరించుకోగలమని కూడా మనకు అర్థమైంది.  ఇది బలవంతంగా కాక, కేవలం పరస్పర సహకారంతో మాత్రమే సాధ్యమౌతుంది. 

ప్రస్తుత మహమ్మారి సంక్షోభం విశ్వసనీయమైన మరియు మరింత ప్రభావవంతమైనదిగా ఉండటానికి ప్రపంచ పాలనా సంస్థలు మరింత ప్రజాస్వామ్య, పారదర్శక మరియు జవాబుదారీతనంతో ఉండవలసిన అవసరం ఉందని మరియు సంస్కరించబడిన బహుపాక్షికత ప్రస్తుత పరిస్థితులకు ఎంతైనా అవసరమని కూడా గుర్తు చేస్తోంది.

తన వంతు బాధ్యతగా, భారతదేశం కోవిడ్ పై పోరాటాన్ని, బలమైన రాజకీయ సంకల్పంతో నిర్వహిస్తోంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత ప్రధానమంత్రి  శ్రీ నరేంద్రమోదీ వేగం, స్థాయి మరియు సంకల్పం ఉండేలా చూశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన అన్ని చర్యలను భారతదేశం తీసుకుంటోంది.  కోవిడ్ పై దృష్టి కేంద్రీకరిస్తున్న సమయంలో ఇతర వ్యాధుల రోగులను నిర్లక్ష్యం చేయకూడదని మేము గట్టిగా నిర్ధారించుకున్నాము. 

ఈ భయంకరమైన వ్యాధిని ఓడించడానికి తీసుకున్న లాక్ డౌన్ వంటి నిర్ణయాలను గౌరవించడానికి, రాజకీయ సంకల్పంతో ఆయుధాలు కలిగిన 1.35 బిలియన్ల మంది భారతీయులు దేశవ్యాప్తంగా కలిసి వచ్చారు. ఫలితంగా మన మరణాల రేటు తగ్గి, వ్యాధి వ్యాప్తి అదుపులోకి వచ్చింది.  సూక్ష్మ గుర్తింపు, భారీగా ఐసొలేషన్, శీఘ్ర చికిత్స వంటి విధానాన్ని అనుసరించడం ద్వారా మంచి ఫలితాలను సాధించి, కోవిడ్-19 వ్యాప్తినీ, మరణాలను సమర్ధవంతంగా తగ్గించగలిగాము. 

భారతదేశానికి బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ, మేము చర్యలకు దిగాము. మౌలిక సదుపాయాల పరంగా మరియు మానవశక్తి పరంగా సామర్థ్యాన్ని పెంచుకున్నాము. దాదాపు 10,000 కి పైగా కోవిడ్ చికిత్స కోసమే అంకితమైన ఆస్పత్రులు, సంరక్షణ కేంద్రాలు, రెండు మిలియన్లకు పైగా శిక్షణ పొందిన ఆరోగ్య సంరక్షణ సిబ్బందితో నిరంతర కృషి జరుగుతోంది. 

మేము మా పౌరుల రక్షణ చర్యలు తీసుకుంటూనే, మేము ఇతర దేశాలకు కూడా సహాయం అందించాము. మా సమీప పరిసరాల్లో, మేము భారతదేశ వైద్య నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా కోవిడ్-19 ను ఎదుర్కోవటానికి సమన్వయాన్ని ప్రోత్సహించాము మరియు సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాము.

ప్రపంచానికే ఫార్మసీగా, ముఖ్యంగా సరసమైన ఔషధాల కోసం భారతదేశం తన ఖ్యాతిని ఇనుమడింపజేసుకుంటోంది.  మా దేశీయ అవసరాలను తీర్చుకోవడంతో పాటు, మేము 123 మంది భాగస్వామ్య దేశాలకు వైద్య సామాగ్రిని అందించాము, ఇందులో 59 అలీన ఉద్యమ సభ్య దేశాలు కూడా ఉన్నాయి.  నివారణలు మరియు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి ప్రపంచ ప్రయత్నాలలో మేము చురుకుగా పాల్గొంటున్నాము.

కోవిడ్-19 సంక్షోభానికి ప్రతిస్పందించడానికి అలీన ఉద్యమ సభ్య దేశాలతో సంఘీభావానికి మేము హృదయపూర్వకంగా కట్టుబడి ఉన్నాము.  మే 4వ తేదీన అలీన ఉద్యమ దేశాల కాంటాక్ట్ గ్రూప్ తో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ మా దేశం యొక్క సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ, కేవలం నామ్ దేశాలతోనే కాకుండా, మొత్తం ప్రపంచంతో "వసుధైవ కుటుంబకం" అంటే ప్రపంచం మొత్తం మన కుటుంబం అనే సిద్ధాంతాన్ని విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు. 

అధ్యక్షా, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా, ఈ మార్పుల వల్ల మన దేశాల ప్రజలే ఎక్కువగా ప్రభావితమవుతారని చెప్పడం ద్వారా ఇంతవరకు చెప్పుకున్న విషయాలను సంకలనం చేయాలనుకుంటున్నాను. మన గమ్యాలు మునుపెన్నడూ లేని విధంగా ముడిపడి ఉన్నాయని మనమందరం గ్రహించాలి. నామ్ వర్ణించే సంఘీభావం మరియు సోదరభావం యొక్క స్ఫూర్తితో నిర్మాణాత్మక చర్చ, సహకారం మరియు సహకారం యొక్క సమిష్టి ప్రయాణం కోసం భారతదేశం ఎదురుచూస్తోంది. 

నేను నా ప్రసంగాన్ని ముగించే ముందు, మానవజాతిని గౌరవించిన వారినందరినీ గౌరవించాలని అనుకుంటున్నాను.  ఫ్రంట్‌లైన్ కోవిడ్ యోధులందరికీ చప్పట్లు కొట్టడానికి మనమందరం ఒక్కసారి లేచి నిలబడదాం. మనం వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, రక్షణ సిబ్బంది, మన సైన్యం, పోలీసులు, జర్నలిస్టులు మొదలైన వారందరూ తమ ప్రాణాలను పణంగా పెట్టిన వారందరికీ, వారిని ప్రమాదాలతో కూడిన యుద్ధభూమికి పంపుతున్న వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. వారు మాకు ఒక పాఠం నేర్పించారు, మరియు ఆ పాఠం, మానవ సంక్షేమంతో పాటు మనందరి ఆర్థికాభివృద్ధికీ ఆధారం అనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.

ధన్యవాదములు." 

****



(Release ID: 1625754) Visitor Counter : 194