ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కరోనా నిర్వహణలో ఈశాన్య ప్రాంత నమూనా
Posted On:
20 MAY 2020 3:20PM by PIB Hyderabad
కరోనా నిర్వహణ పై కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ రచించిన వ్యాసం ఇక్కడ పొందుపరచడమైనది.
"ప్రధానమంత్రి నరేద్రమోడీ ఎప్పుడూ ఈశాన్య ప్రాంతంపై అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 2014 లో మోడీ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే, ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతాన్ని దేశంలోని బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాల్లో, మేము "వాకింగ్ ది టాక్" నిర్వహించడంలో సహేతుకంగా విజయవంతమయ్యాము. మానసిక అంతరాలను తగ్గించడమే కాక, వేగవంతమైన అభివృద్ధి కార్యకలాపాలు కూడా నిర్వహించాము. తద్వారా ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధికి ఒక నమూనాగా చూపించాము.
ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో కూడా ఈశాన్య ప్రాంతం మొత్తం అధిక ప్రాధాన్యతతో కూడిన ప్రదేశంగా గుర్తించబడింది. ఇది అవసరమైన వస్తువులను అందరికంటే ముందుగా, సమృద్ధిగా ఎయిర్ కార్గో సరఫరా రూపంలో పొందింది. ఇతర దేశాలతో సరిహద్దులను అందరికంటే ముందుగా మూసివేసింది. సామాజిక దూరం వంటి మార్గదర్శకాలను పరిశీలించి పాటించడంలో పౌర సమాజం అందరికంటే ముందుంది.
ఫలితంగా, గత ఆరేళ్లుగా, మోదీ ప్రభుత్వ హయాంలో ఈశాన్య ప్రాంతం అభివృద్ధిలో ఒక నమూనాగా నిలిచింది. అదేవిధంగా ఇప్పుడు గత ఆరు నెలలుగా కరోనా నిర్వహణలో కూడా ఈశాన్య ప్రాంతం ఒక నమూనాగా నిలిచింది.
వాస్తవానికి, అన్ని ఈశాన్య రాష్ట్రాలు తీసుకున్న చురుకైన చర్యలతో పాటు, భారత ప్రభుత్వం అందిస్తున్న ఉదారవాద మద్దతుతో ఈశాన్య ప్రాంతం, భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే , ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది.
ఈశాన్య ప్రాంతంలో సమర్థవంతమైన కోవిడ్-19 నిర్వహణ యొక్క గణాంక ఆధారాలు క్రింది పట్టికలో పొందుపరచడం జరిగింది.
పట్టిక : ఈశాన్య ప్రాంతంలో ప్రతి వారం చివర తేదీ నాటికి అంతవరకు ఉన్న మొత్తం కోవిడ్-19 కేసుల పరిస్థితి
క్రమ సంఖ్య
|
తేదీ |
పరీక్షించిన కేసులు
|
నెగటివ్ కేసులు
|
పోజిటివ్
కేసులు
|
నమయిన కేసులు |
మరణాలు |
1
|
7 .4.2020
|
2931
|
2800
|
32
|
0
|
0
|
2
|
14.4.2020
|
5017
|
4696
|
38
|
1
|
1
|
3
|
21.4.2020
|
9580
|
9160
|
53
|
23
|
2
|
4
|
28.4.2020
|
16022
|
15782
|
55
|
32
|
2
|
5
|
5.05.2020
|
22849
|
21719
|
88
|
48
|
2
|
6
|
12.5.2020
|
37120
|
34962
|
235
|
55
|
3
|
7
|
18.5.2020
|
60063
|
57573
|
291
|
142
|
4
|
ఈశాన్య రాష్ట్రాలు తీసుకున్న చర్యల ఫలితంగా, సిక్కిం, నాగాలాండ్ లలో, ఇప్పటి వరకు ఒక్క కోవిడ్-19 పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అరుణాచలప్రదేశ్ మరియు మొజోరాం లలో ఒక్కొక్క కేసు నమోదయ్యింది, ప్రస్తుతం అవి కూడా మాయమయ్యాయి. మేఘాలయలో ఒక విదేశీ ప్రయాణీకుని కారణంగా 13 మందికి షిల్లాంగ్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్సనందించగా, అందులో ఒకరు మృతి చెందారు. మిగిలినవారు కోలుకోవడంతో, ఇప్పుడు మేఘాలయ కూడా కోవిడ్ రహిత ప్రాంతంగా నిలిచింది.
ఇప్పుడు వాస్తవానికి ఈశాన్య ప్రాంతంలో ఐదు రాష్ట్రాలు - అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం కోవిడ్-19 రహిత ప్రాంతాలుగా ఉన్నాయి.
ఈశాన్య ప్రాంతంలో అతి పెద్ద రాష్ట్రమైన అస్సాంలో కొన్ని కేసులు ఉన్నాయి. అయితే, రాష్ట్రంలో ఈ మహమ్మారి కట్టడికి స్థానిక ప్రదేశాల్లో సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా, మణిపూర్, త్రిపుర రెండు రాష్ట్రాల్లో రెండేసి కేసులు నమోదయ్యాయి. అయితే వారు చికిత్స అనంతరం కోలుకోవడంతో ఆ రెండు రాష్ట్రాలు కోవిడ్ రహితమయ్యాయి. అయితే, మే నెల మొదటి వారంలో వ్యాధి సోకినా వలసదారుల కారణంగా పెద్ద సంఖ్యలో కేసులు ముఖ్యంగా అక్కడ నియోగించబడిన సి.ఏ.పి.ఎఫ్.లో నమోదయ్యాయి. మణిపూర్ లో కూడా గత 3-4 రోజులలో వలసదారులకు సంబంధించి 5 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఖచ్చితంగా లాక్ డౌన్ అమలు చేయడంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించడంతో ఇది సాధ్యమైంది; ఎయిర్ కార్గో మరియు వైమానిక దళం ద్వారా ఔషధాలు, మరియు పరికరాలను వెంటనే సరఫరా కావడం కారణంగానూ, పరీక్షా సదుపాయాలు, మరియు పరీక్షా సౌకర్యాల సంఖ్యను త్వరత్వరగా పెంచిన కారణంగానూ, కోవిడ్ సంబంధించిన ఆరోగ్య సదుపాయాల అభివృద్ధి చేసిన కారణంగానూ ఇది సాధ్యమయ్యింది. పి.డి.ఎస్. ద్వారా పౌరులందరికీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా సమాజంలో బలహీన వర్గాల వారికీ అత్యవసర వస్తువులు సరఫరా చేయడం వల్ల కూడా ఇది సాధ్యమయ్యింది.
సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలలో పరీక్షా సౌకర్యం లేదు. అస్సాంలో 2 మాత్రమే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో, అస్సాంలోని అన్ని వైద్య కళాశాలల్లో పరీక్షా సదుపాయాల సంఖ్యను విస్తరించారు. కోహిమా, నాగాలాండ్ లలో ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. సిక్కింలో "ట్రూ నాట్" టెస్టింగ్ ప్రారంభంకాగా, ఆర్.టి.-పి.సి.ఆర్. త్వరలో ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతంలో పరీక్షా సదుపాయాల విస్తరణ ఫలితంగా, 2020 ఏప్రిల్ మొదటి వారంలో ఈ ప్రాంతంలో 2,931 పరీక్షలు చేయగా 2020 మే నెల మధ్య కాలానికి ఈ పరీక్షల సంఖ్య 60,063 కి పెరిగింది. గతంలో సరాసరి రోజుకు 300 ఉండగా ఇప్పుడు సరాసరి 3,800 కు పెరిగింది. దీనివల్ల, అవసరమైన వారికి తగిన వైద్య సహకారం అందించడానికీ, ఆసుపత్రిలో చేరడానికీ వీలుకలిగింది.
అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో లాక్-డౌన్ చర్యలు సమర్థవంతంగా అమలు చేయడం జరిగింది. అంతర్-రాష్ట్ర సరిహద్దులను, సంబంధిత రాష్ట్రాలు మాత్రమే కాకుండా, 5,000 కిలోమీటర్లకు పైగా అంతర్జాతీయ సరిహద్దులతో కూడిన ఈశాన్య రాష్ట్రాల సరిహద్దును కూడా రక్షణ దళాలు మరియు స్థానిక ప్రజలచే సమర్థవంతంగా మూసివేయబడ్డాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా, మహమ్మారిని పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ లను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. ఈశాన్య రాష్ట్రాలలో గుర్తించదగిన వాటిలో, సిక్కింలో విదేశీ పౌరులకు ఇన్నర్ లైన్ అనుమతి 2020 మార్చి 5 వ తేదీన నిలిపివేయడం జరిగింది. స్థానిక పర్యాటకులను ప్రవేశించకుండా నాథులా పాస్ ను కూడా మూసివేశారు. దీనితో పాటు, దేశీయ పర్యాటకుల ప్రవేశాలను , 2020 మార్చి 16వ తేదీన జాతీయ లాక్-డౌన్ కు చాలా ముందుగానే రద్దు చేశారు. ఈ చర్యల వల్ల, అతిపెద్ద పర్యాటక కేంద్రాల్లో ఒకటైన సిక్కిం కోవిడ్-19 రహిత ప్రాంతంగా నిలవడానికి ఆస్కారం ఏర్పడింది.
నవల కరోనా వైరస్ ను దూరంగా ఉంచడానికి, ఈశాన్య ప్రాంతంలోని కొన్ని కొండ రాష్ట్రాల్లోని గ్రామాలకు కొందరు వయోవృద్దులు ‘ఎర్ర సైన్యం’ పేరు మీద సహాయం అందిస్తున్నారు. నాగాలాండ్ లో వీరికి తోడుగా డోబాషి పేరుమీద, నాగా ఆచార చట్టాల సంరక్షకులు, ఎర్రటి కోట్లు ధరించి ఉండే, ప్రభుత్వ ఉద్యోగులు కూడా సహకరిస్తున్నారు. వీరు 1842 నుండి రాష్ట్రంలోని ప్రజలందరికి అవసరమైన వస్తువులు సరఫరా అయ్యేలా చూస్తుంటారు.
మిజో సమాజం దేశంలోని అత్యంత సమైక్య మరియు క్రమశిక్షణ గల సమాజాలలో ఒకటి. అవగాహన ఉన్న పౌరులు, ప్రభుత్వేతర సంస్థలు, చర్చి మరియు పౌర సమాజాన్ని కలిగి ఉన్న దాని సామాజిక సంస్థలలో దీని ప్రత్యేకత ప్రతిబింబిస్తుంది. మిజోరాంలో ప్రజలు స్వీయ-క్రమశిక్షణను సమర్ధవంతంగా పాటించారు. ఇంటి నుండి బయటకు వస్తే సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించారు. అంతర్జాతీయ సరిహద్దులో లాక్ డౌన్ అమలు అనేది చాలా కీలకమైన పని. ఏదేమైనా, గ్రామ సమాజాలు మరియు స్థానిక టాస్క్ ఫోర్స్ గ్రామాల్లోకి బయటనుండి ప్రజలు రాకుండా నివారించగలిగాయి. అదేవిధంగా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన కార్మికులను లెక్కించారు. ఈ కాలంలో వారికి మద్దతుగా అవసరమైన చర్యలు తీసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో దాదాపు పదిహేను వేల మంది అతిథి కార్మికులకు వారి బస మరియు ఆహారం కోసం తగిన ఏర్పాట్లు కల్పించారు.
దుకాణాల ముందు వృత్తాలు గీయడం ద్వారా సామాజిక దూరాన్ని ఎలా సమర్థవంతంగా నిర్ధారించాలో దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మణిపూర్ రాష్ట్రం నేర్పింది. లాక్ డౌన్ మరియు సామాజిక దూరాన్ని అమలు చేయడానికి ఎన్.ఈ.ఆర్. లోని అన్ని పౌర సమాజ సంస్థలు చురుకుగా సహాయపడ్డాయి.
ఈశాన్య రాష్ట్రాలకు వైద్య సామాగ్రి, పరికరాలు మరియు అవసరమైన వస్తువులను అందించడంలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ (ఎమ్.ఓ.సి.ఏ.), రక్షణ మంత్రిత్వశాఖ(ఎమ్.ఓ.డి.), రైల్వే మంత్రిత్వశాఖ కలిసి కీలకమైన పాత్ర పోషించాయి. కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్య సరుకును రవాణా చేయడానికి 'లైఫ్ లైన్ ఉడాన్' విమానాలను ఎమ్.ఓసి.ఏ. నిర్వహిస్తోంది. పవన్ హన్స్ సంస్థ తో సహా హెలికాప్టర్ సేవలు ఈశాన్య ప్రాంతాల్లో క్లిష్టమైన వైద్య సరుకును మరియు రోగులను రవాణా చేస్తున్నాయి. 2020 ఏప్రిల్ 30వ తేదీ వరకు పవన్ హన్స్ సంస్థ 7,529 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 2.03 టన్నుల సరుకును రవాణా చేసింది. లైఫ్ లైన్ ఉడాన్ విమానాలను సమన్వయం చేయడానికి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) మరియు ఎమ్.ఓ.సి.ఏ. కలిసి కేవలం మూడు రోజుల రికార్డు సమయంలో ఒక పోర్టల్ ను అభివృద్ధి చేశాయి.
ఈ ప్రాంతంలో నిత్యావసర వస్తువులు మరియు సేవల సరఫరాలో సమస్యలు లేవు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సమయంలో ఈశాన్య ప్రాంతాల్లో అవసరమైన వస్తువుల నిరంతరాయ సరఫరాను నిర్ధారించే పనిలో భాగంగా, మలిగావ్ కేంద్రంగా ఉన్న ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే (ఎన్.ఎఫ్.ఆర్.) ఇంతవరకు 100 పార్శిల్ ఎక్సప్రెస్ రైళ్లను నడిపింది. గత ఒకటిన్నర నెలల్లో ఢిల్లీ, ముంబై, నాగపూర్, బెంగళూరు, కోల్కతా వంటి ప్రధాన పారిశ్రామిక కేంద్రాల నుండి వివిధ రకాల వస్తువులతో నిండిన ఈ రైళ్లు గువాహటి, న్యూ గువాహటి, అజరా, చాంగ్సారి, అగర్తలా, న్యూ తిన్సుకియా లకు చేరాయి. అనేక రాష్ట్రాల్లో, హెల్ప్‌లైన్‌తో పాటు హోమ్ డెలివరీ సామాగ్రి నిర్వహణ నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బయట చిక్కుకుపోయిన తమ రాష్ట్ర ప్రజలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందించాయి. ఎన్.ఎఫ్.ఎస్.ఏ. పరిధిలోకి రాని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరమైన సహాయాన్ని అందజేశాయి. ఎన్.ఎఫ్.ఎస్.ఏ, పి.ఎమ్.జి.కె.వై, ఓ.ఎం.ఎస్.ఎస్(డి) ఈ మూడు పథకాల కింద లబ్ధిదారులకు బియ్యం పంపిణీ సంబంధిత డిప్యూటీ కమిషనర్ల ద్వారా ఎన్.ఎఫ్.ఎస్.ఎ. కు చెందిన లబ్ధిదారులకు, లబ్ధిదారులు కాని వారికి కూడా పంపిణీ చేయడం జరుగుతోంది. వలసదారులకు, చిక్కుకు పోయిన ట్రక్ డ్రైవర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పిల్లలకు, ఇతరులకు, ప్రభుత్వాలు పొడి రేషన్ కూడా అందిస్తున్నాయి. మిజోరంలో, రాష్ట్ర, జిల్లా మరియు స్థానిక స్థాయిలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక స్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రముఖ వ్యక్తులను సభ్యులుగా చేర్చారు. వారు యంగ్ మిజో అసోసియేషన్ మరియు గ్రామ / స్థానిక మండలిలో భాగంగా ఉంటారు. వారు సాధారణంగా నిత్యావసరాల సరఫరా, కాంటాక్ట్ ట్రేసింగ్ తో పాటు సామాజిక దూరం నిబంధనను అమలు జరిగేలా చూస్తారు. మిజోరంలో సామాన్యులకు ఎటువంటి అంతరాయం, అసౌకర్యం లేకుండా అవసరమైన వస్తువుల సరఫరా కొనసాగించబడింది.
కోవిడ్-19 కోసం వైద్య సామాగ్రి మరియు ఇతర అత్యవసర సామగ్రి అవసరాలను తీర్చడానికి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈశాన్య రాష్ట్రాలకు 235.59 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే, ఏం.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. గ్రాంట్ల పరిధిలో లేని కొన్ని వస్తువులు , అవసరాలు ఉన్నాయి. ఇందుకోసం ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ముందుకు వచ్చి ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు 25 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.
కోవిడ్ ని సమర్థవంతంగా ఎదుర్కోడానికి, కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఈశాన్య రాష్ట్రాలకు మొత్తం 7923.78 కోట్ల రూపాయలు (అరుణాచలప్రదేశ్ - రూ. 935.28 కోట్లు, అస్సాం - రూ. 3090.64 కోట్లు, మణిపూర్ - రూ. 822.22 కోట్లు, మేఘాలయ - రూ. 467.02 కోట్లు, మిజోరాం - రూ. 493.46 కోట్లు, నాగాలాండ్ - రూ. 937.12 కోట్లు, సిక్కిం - రూ. 278.30 కోట్లు మరియు త్రిపుర - రూ. 899.74 కోట్లు) 2020 ఏప్రిల్ మరియు మే నెలలకు చెందిన ఆదాయ లోటు వాయిదాల కింద, 2020 ఏప్రిల్ నుండి, రాష్ట్ర విపత్తు స్పందన ఉపశమన నిధి (ఎస్.డి.ఆర్.ఎమ్.ఎఫ్.) మరియు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద మొదటివాయిదా విడుదల చేసింది.
పరిశ్రమను ముఖ్యంగా ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లను ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం, పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమతో సహా వ్యవసాయానికి ప్యాకేజీ ప్రకటిచడంతో ప్రజల జీవనోపాధి పరిస్థితి మెరుగౌతుంది. ఈ ప్యాకేజీ ఈశాన్య ప్రాంతాలకు వెన్నెముకగా ఉన్న చిన్న-తరహా పరిశ్రమలకు కొత్త ప్రేరణనిస్తుంది.
ఈశాన్య ప్రాంతాలలోని రాష్ట్రాల ముందు తదుపరి సవాలు ఏమిటంటే, దేశంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయి స్వస్థలాలకు తిరిగి వస్తున్న ప్రజలను ఆహ్వానించడం. ప్రత్యేక రైళ్లు రావడం ప్రారంభించాయి. ప్రయాణికులు సమాజంతో కలవడానికి ముందే వారిని క్వారంటైన్ లో ఉంచడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. కోవిడ్ సోకిన పాజిటివ్ వ్యక్తులను పరీక్షల ద్వారా గుర్తించి, వారికి ప్రత్యేకమైన సౌకర్యాలలో చికిత్స చేయడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, డి.ఓ.ఎన్.ఈ.ఆర్. మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని ప్రజలు మెచ్చుకుంటున్నారు. భవిష్యత్తులో తలెత్తే ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవటానికి, ఈ ప్రాంతం సిద్ధంగా ఉంది ”.”.
<><><>
(Release ID: 1625629)
Visitor Counter : 253