నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

కోణార్క్ సూర్య దేవాలయం మ‌రియు కోణార్క్ పట్టణం 100 శాతం సౌర విద్యుదీక‌ర‌ణ‌కు ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని ప్రారంభించిన భారత ప్రభుత్వం

- ఈ పథకంలో భాగంగా సౌర విద్యుత్తు ప్రాజెక్టుతో అనుసంధాన‌త క‌లిగిన 10 మెగా వాట్ల వ‌ర‌కు సామ‌ర్థ్యం క‌లిగిన గ్రిడ్‌ ఏర్పాటుతో పాటు సోలార్ ‌ట్రీలు, సౌర‌శక్తి తాగునీటి కియోస్క్‌ల ఏర్పాటు

Posted On: 20 MAY 2020 3:48PM by PIB Hyderabad

కేంద్ర నూత‌న‌ మ‌రియు పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల శాఖ ఒడిషాలోని కోణార్క్ సూర్య దేవాలయం మ‌రియు కోణార్క్ పట్టణ‌మును 100 శాతం సౌర విద్యుదీక‌ర‌ణ చేసేందుకు గాను  ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఈ ప‌థకం గురించి విద్యుత్తు మ‌రియు ఎంఎన్ఆర్ఈ శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా) శ్రీ ఆర్‌.కె.సింగ్ మాట్లాడుతూ "ఒడిశాలోని చారిత్రాత్మక సూర్య దేవాలయ పట్టణం కోణార్క్ ను 'సూర్య నగరి'గా అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి యోచ‌న‌ను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సౌర శక్తి యొక్క ఆధునిక ఉపయోగం మరియు పురాతన సూర్య దేవాలయం మ‌ధ్య స‌హోత్తేజాన్ని తెలియ‌ప‌రుస్తూ సౌర శక్తిని ప్రోత్సహించాల్సిన‌ ప్రాముఖ్యత సందేశాన్ని తెలియజేయడానికి దీనిని ప్రారంభించాము" అని అన్నారు. ఈ పథకంలో భాగంగా సౌర విద్యుత్తు ప్రాజెక్టుతో అనుసంధాన‌త క‌లిగిన 10 మెగా వాట్ల వ‌ర‌కు సామ‌ర్థ్యం క‌లిగిన ‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. వీటితో పాటుగా ఈ ప్రాజెక్టులో ప‌లు ఆఫ్-గ్రిడ్ అప్లికేష‌న్స్‌తో అనుసంధానం చేయ‌నున్నారు. ఇందులో సౌర విద్యుత్తును జ‌నింప‌జేసే చెట్ల వంటి ఆకారం క‌లిగిన ప్లాంట్‌లు (సోలార్ ట్రీలు), సౌరశ‌క్తి తాగునీటి కియోస్క్‌లు, బ్యాటరీ నిల్వతో కూడిన‌ ఆఫ్-గ్రిడ్ సౌర విద్యుత్ ప్లాంట్లు త‌దిత‌రాల‌ను ఈ ప‌థ‌కంలో భాగంగా ఏర్పాటు చేయ‌నున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని నూత‌న మ‌రియు పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల శాఖ (ఎంఎన్ఆర్ఈ) వారు 100 శాతం కేంద్ర ఆర్థిక స‌హాయం (సీఎఫ్ఏ) కింద దాదాపు రూ.25 కోట్ల వ్య‌యంతో ఈ ప్రాజెక్టును చేపట్ట‌నున్నారు.
ఈ మొత్తం ప్రాజెక్టు అమలును ఒడిశా రాష్ట్ర పున‌రుత్పాద‌క విద్యుత్ అభివృద్ధి ఏజెన్సీ(ఒరెడా)  చేప‌ట్ట‌నుంది. ఈ పథకం కోణార్క్ పట్టణంలోని అన్ని ర‌కాల విద్యుత్ అవసరాలను సౌర శక్తితో తీర్చగలదు.



(Release ID: 1625540) Visitor Counter : 262