కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మహమ్మారి నేపత్యంలో ఉద్యోగులు మరియు యజమానుల చేతిలో అధిక ద్రవ్యతను ఉంచేందుకు ఈ.పి.ఎఫ్. చందా 10 శాతానికి తగ్గింపు
ప్రభుత్వ రంగం, వారి పి.ఎస్.ఈ.లు మరియు పి.ఎంజి.కె.వై. కింద కేంద్ర ప్రభుత్వం చందా స్థాపన 12 శాతం పాత రేటే వర్తింపు

మే, జూన్, జులై నెలల జీతాలకు ఈ తక్కువ రేట్లు వర్తింపు

Posted On: 19 MAY 2020 6:32PM by PIB Hyderabad

కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా మరియు ఈ మహమ్మారి కారణంగా ఎదురయ్యే ఇతర అంతరాయాలను నివారించడానికి విధించిన లౌక్ డౌన్ ద్వారా ఇబ్బంది పడుతున్న ఈ.పి.ఎఫ్. మరియు ఎం.పి. చట్టం, 1952 పరిధిలోని సంస్థల యజమానులు మరియు ఉద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు ఎప్పటికప్పుడు వివిధ చర్యలు ప్రకటించబడ్డాయి.

మే, జూన్, జులై నెలల వేతన నెలలకు చట్టబద్ధమైన విరాళాల రేటును 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం, ఈ.పి.ఎఫ్ మరియు ఎం.పి. చట్టం, 1952 పరిధిలో ఉన్న అన్ని వర్గాల సంస్థలకు 2020 మే 13న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా 2020 మే 18 నాటికి SO 1513 (E) ను గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ ప్రచురించింది. ఈ.పి.ఎఫ్.ఓ. వెబ్ సైట్ హోమ్ పేజీలో TAB- COVID-19 కింధ ఈ నోటిఫికేషన్ అందుబాటులో ఉంది.

ఈ సహకారం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు లేదా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో లేదా నియంత్రణలో ఉన్న ఇతర సంస్థలకు వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వేతనం మరియు డి.ఏ.లో 12 శాతం అందిస్తూనే ఉంటాయి.

తగ్గిన రేటు పి.ఎం.జి.కె.వై. లబ్ధిదారులకు కూడా వర్తించదు. ఎందుకంటే మొత్తం ఉద్యోగులు ఈ.పి.ఫ్ చందా (12 శాతం ) మరియు యజమానుల ఈ.పి.ఎఫ్ మరియు ఈ.పి.ఎస్. చందా (వేతనంలో 12 శాతం) నెలవారీ వేతనాల్లో మొత్తం 24 శాతం కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

 ప్రాథమిక వేతనాలు మరియు డి.ఏ. లో 12 శాతం నుంచి 10 శాతం మేర ఈ.పి.ఎఫ్. చందా రేటును తగ్గించడం 4.3 కోట్ల మంది ఉద్యోగులు/ సభ్యులు మరియు 6.5 లక్షల సంస్థల యజమానులు రెండింటి పరంగా ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశించబడింది.

చట్టబద్ధమైన చందా రేటును 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించిన ఫలితంగా, ఉద్యోగికి ఈ.పి.ఎఫ్. చందా కారణంగా తన వేతనం నుంచి తగ్గించే మొత్తం తగ్గడం వల్ల ఇంటికి తీసుకువెళ్ళే మొత్తం అధికగా ఉంటుంది. 10,000 నెలవారీ వేతన ఉద్యోగికి, 1200 రూపాయలకు బదులు 1000 రూపాయలు మాత్రమే వేతనాల నుంచి తీసివేయబడుతుంది. యజమాని సైతం 1200 రూపాయలకు బదులు 1000 రూపాయలు మాత్రమే చెల్లిస్తారు.

కాంటు కంపెనీ (సి.టి.సి) మోడల్ లో, 10000 రూపాయల నెలవారీ ఈ.పి.ఎఫ్. వేతనాలు అయితే, సి.టి.సి. మోడల్ లో ఉద్యోగికి యజమాని నుంచి నేరుగా 200 రూపాయలు లభిస్తుంది. ఎందుకంటే యజమాని ఈ.పి.ఎఫ్ లేదా ఈ.పి.ఎస్ సహాకారం 200 రూపాయలు తగ్గుతుంది.

ఈ.పి.ఎఫ్. పథకం, 1952 ప్రకారం ఏ సభ్యుడైనా చట్టబద్ధమైన రేటు (10శాతం) కంటే ఎక్కువ రేటుతో సహకారం అందించే అవకాశం ఉంది. అటువంటి ఉద్యోగికి సంబంధించి యజమాని తన చందాను 10శాతం (చట్టబద్ధమైన రేటు)కు పరిమితం చేయవచ్చు.

***(Release ID: 1625187) Visitor Counter : 89