గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

5 స్టార్- 6 నగరాలు, 3 స్టార్- 64 నగరాలు, ఒక స్టార్- 70 నగరాలు చెత్త రహిత నగరాల స్టార్ రేటింగులను ప్రకటించిన ఎంఓహెచ్యుఏ

Posted On: 19 MAY 2020 1:51PM by PIB Hyderabad

2019-2020 అంచనా సంవత్సరానికి మొత్తం ఆరు నగరాలకు 5 స్టార్ (అంబికాపూర్, రాజ్‌కోట్, సూరత్, మైసూరు, ఇండోర్ మరియు నవీ ముంబై), 3-స్టార్‌గా 65 నగరాలు మరియు 1-స్టార్‌గా 70 నగరాలను ధృవీకరించినట్టు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (ఇంచార్జి) శ్రీ హరదీప్ ఎస్.పురి ప్రకటించారు. ఈ రేటింగులకు సంబంధించి సవరించిన ప్రోటోకాల్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. చెత్త రహిత హోదాను సాధించడానికి నగరాలకు ఒక యంత్రాంగాన్ని వ్యవస్థీకరంచడానికి, అధిక స్థాయి శుభ్రత పాటించేలా నగరాలను ప్రోత్సహించడానికి 2018 జనవరిలో మంత్రిత్వ శాఖ స్టార్ రేటింగ్ ప్రోటోకాల్‌ను ప్రారంభించింది. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా, ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కోవిడ్ సంక్షోభం కారణంగా పారిశుధ్యం, సమర్థవంతమైన ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రాముఖ్యత ఇప్పుడు తెరపైకి వచ్చింది. వాస్తవానికి, పట్టణంలో అధిక స్థాయి పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని నిర్ధారించడానికి గత ఐదేళ్ళలో స్వచ్ఛ్ భారత్ మిషన్-పట్టణ (ఎస్బిఎం-యు) కీలక పాత్ర పోషించి ఉండకపోతే ప్రస్తుత పరిస్థితి చాలా దయనీయంగా ఉండేదని చెప్పడం అతిశయోక్తి కాదని కేంద్ర సహాయ మంత్రి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఐదేళ్ల క్రితం, పట్టణ భారత్ కోసం వార్షిక పరిశుభ్రత సర్వే- స్వచ్ సర్వేక్షన్ (ఎస్ఎస్) ను ప్రవేశపెట్టాము, ఇది ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తి ద్వారా పట్టణ పరిశుభ్రతను మెరుగుపరచడంలో ఎంతో విజయవంతమైంది అని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. అందువల్ల, మంత్రిత్వ శాఖ చెత్త రహిత నగరాల కోసం స్టార్ రేటింగ్ ప్రోటోకాల్‌ను రూపొందించింది - మా పరీక్షా విధానాల మాదిరిగానే ఒక సమగ్ర ఫ్రేమ్‌వర్క్, ఇక్కడ ప్రతి నగరంలోని ప్రతి వార్డు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ 24 విభిన్న భాగాలలో ఒక నిర్దిష్ట ప్రమాణాన్ని సాధించాలి, మొత్తం మార్కులు ఆధారంగా గ్రేడ్ చేయబడింది అని మంత్రి తెలిపారు. 

కోవిడ్ సంక్షోభం వచ్చినప్పటి నుండి, బహిరంగ ప్రదేశాలను ప్రత్యేకంగా శుభ్రపరచడం మరియు నిర్బంధ గృహాల నుండి బయో-మెడికల్ వ్యర్థాలను సేకరించడం, పారవేయడం గురించి ఎంఓహెచ్యుఏ  అన్ని రాష్ట్రాలు మరియు నగరాలకు వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. లాక్డౌన్ సమయంలో ఆర్థిక ఒత్తిడి విషయంలో ప్రతికూల ప్రభావం దృష్టిలో పెట్టుకుని దాదాపు 50 లక్షల మంది వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక సూక్ష్మ రుణ సదుపాయం ప్రారంభం అవుతోంది. అదేవిధంగా, ఉత్పాదక పరిశ్రమలలో పనిచేసే కార్మికులు పట్టణ వలసదారుల కష్టాలను తగ్గించడానికి, స్థోమతకు తగ్గట్టుగా ఉండేలా అద్దె గృహాల ప్రాంగణాలు ప్రారంభం అవుతున్నాయి. 


(Release ID: 1625164)