రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఎరువుల రంగానికి చెందిన భాగస్వామ్య పక్షాల వారితో సమావేశమైన మంత్రి గౌడ
Posted On:
19 MAY 2020 6:04PM by PIB Hyderabad
కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ఎరువుల శాఖ అధికారులు, ప్రగతిశీల రైతులు ఇతర భాగస్వామ్య పక్షాల వారితో ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఎరువుల రంగంలో ముందుకు తీసుకెళ్ల గల ముఖ్య సంస్కరణ చర్యలకు సంబంధించి ఈ సమావేశంలో మంత్రికి వారు తమ అభిప్రాయాలు తెలిపారు. దేశంలోని రైతులకు సరసమైన ధరలకు
సంస్కరణలు నిరంతర ప్రక్రియ అని దేశంలోని రైతులకు తక్కువ ధరలకు ఎరువులను అందజే యడానికి గాను మెరుగైన మేటి సామర్థ్యం నిమిత్తం నిరంతరాయంగా సంస్కరణలు అనేవి నిరంతర ప్ర్రక్రియలుగా ఉండాలని శ్రీ గౌడ తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వారు స్వేచ్చగా తమ సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అన్నారు. తద్వారా వాటిని ప్రభుత్వం తీసుకునే తుది విధాన నిర్ణయాలలో చేర్చేందుకు వీలు కలుగుతుందని మంత్రి గౌడ తెలిపారు.
ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి, కేరళ రాష్ట్ర మరియు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వపు అధికారులు మరియు ఎరువుల కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 1625163)
Visitor Counter : 250