హోం మంత్రిత్వ శాఖ

అంప‌న్ తుపాను మే 20న తీరం దాట‌నున‌న్న నేప‌థ్యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై స‌మీక్ష చేసిన ఎన్ సి ఎం సి

Posted On: 18 MAY 2020 10:08PM by PIB Hyderabad

జాతీయ సంక్షోభ నిర్వ‌హ‌ణ‌ క‌మిటీ ( ది నేష‌న‌ల్ క్రైసిస్ మేనేజ్ మెంట్ క‌మిటీ , ఎన్ సి ఎం సీ) ఛైర్మ‌న్, కేబినెట్ సెక్ర‌ట‌రీ శ్రీ రాజీవ్ గౌబ నేతృత్వంలో జాతీయ సంక్షోభ నివార‌ణ క‌మిటీ రెండో సారి స‌మావేశ‌మై అంప‌న్ తుపానుపై స‌మీక్ష జ‌రిపింది. ఈ తుపాను తీరం దాటిన త‌ర్వాత ఏర్ప‌డ‌బోయే ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల‌ను ఎలా ఎదుర్కోవాల‌నే దానిపై రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌లు, ఇత‌ర‌ విభాగాల సంసిద్ధ‌త గురించి ఈ స‌మీక్ష‌లో చ‌ర్చించారు. 
అంప‌న్ తుపాను మే 20వ తేదీ మ‌ధ్యాహ్నంగానీ,సాయంత్రంగానీ ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీరం దాటుతుంద‌ని, ఆ స‌మ‌యంలో 155-165 కిలోమీట‌‌ర్ల వేగంతో గాలులుండ‌వ‌చ్చ‌ని కేంద్ర వాతావ‌రణ శాఖ తెలిపింది. ఈ గాలులు 185 కిలోమీట‌ర్ల వేగానికి చేరుకోవ‌చ్చ‌ని, భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని తీర ప్రాంత రాష్ట్రాలు అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. 
ఒడిషాలోని జ‌గ‌త్ సింగ్ పూర్‌, కెండ్ర‌పాడ‌, భ‌ద్ర‌క్‌, జైపూర్‌, బాలాసార్ జిల్లాలు, ప‌శ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్‌, ద‌క్షిణ మ‌రియు ఉత్త‌ర 24 ప‌ర‌గ‌ణాలు, హౌరా, హుగ్లీ, కొల‌క‌త్తా జిల్లాలు తుపాను బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా వున‌న‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. 
ఆయా రాష్రాల‌కు సంబంధించిన అధికారులు ఎన్ సి ఎంసి స‌మావేశంలో పాల్గొని త‌మ రాష్ట్రాల్లో చేప‌ట్టిన చ‌ర్య‌ల గురించి వివ‌రించారు.అవ‌స‌ర‌మైన మేర‌కు ఆహార‌ధాన్యాలు, మంచినీళ్లు, ఇంకా ఇత‌ర నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను, సేవ‌ల‌ను సిద్ధంగా వుంచుకున్నామ‌ని అధికారులు తెలిపారు. 
నేష‌న‌ల్ డిసాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ కు చెందిన 26 బృందాలు ఇప్ప‌టికే రంగంలోకి దిగాయి. అలాగే ఆర్మీకి చెందిన బృందాలు కూడా అప్ర‌మ‌త్త‌మ‌యి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా వున్నాయ‌ని అధికారులు తెలిపారు. 
సంబంధిత రాష్ట్రాల్లోని లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను పూర్తిస్థాయిలో ఖాళీ చేయించి స‌హాయ‌క కేంద్రాల‌కు చేర్చాల‌ని కేంద్ర కేబినెట్ సెక్ర‌ట‌రీ ఆదేశించారు. విద్యుత్ టెలిక‌మ్యూనికేష‌న్ సౌక‌ర్యాల‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా చూసుకోవాల‌ని, అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో ఎస్ ఎం ఎస్ ల ‌ద్వారా హెచ్చ‌రిక‌లు పంపి ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తుల‌ను చేయాల‌ని అన్నారు. 
ఒడిషా, ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ‌, ర‌క్ష‌ణ శాఖ‌, నౌకాయాన‌, విద్యుత్‌, టెలిక‌మ్యూనికేష‌న్లు, ఆరోగ్య‌, ఐఎండి, ఎన్ డిఎంఏ, ఎన్ డిఆర్ ఎఫ్ విభాగాలకు చెందిన సీనియ‌ర్ అధికారులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. దీనిపై రేపు కూడా ఎన్ సి ఎంసీ సమావేశం జ‌ర‌గ‌నున్న‌ది. 

 

***



(Release ID: 1625056) Visitor Counter : 130