హోం మంత్రిత్వ శాఖ

అతి పెద్ద మహాచక్రవాతం ‘అమ్ఫాన్’ 2020 వ సంవత్సరం మే నెల 20వ తేదీ న తీర ప్రాంతాల ను తాకవచ్చన్న అంచనా మధ్య తత్సంబంధిత సన్నాహక  ప్రతి క్రియల ను సమీక్షించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 18 MAY 2020 7:16PM by PIB Hyderabad

బంగాళాఖాతం లో ఉత్పన్నమైన ‘అమ్ఫాన్’ తుఫాను ఈ రోజు న ఒక  అతి పెద్ద మహాచక్రవాతం గా రూపుదాల్చింది.  ఈ నేపథ్యం లో తల ఎత్తే స్థితిగతుల ను ఎదుర్కోవడం కోసం ఆయా రాష్ట్రాలు మరియు కేంద్ర మంత్రిత్వ శాఖ లు/ఏజెన్సీలు ఏ మేరకు సమాయత్తమైందీ తెలుసుకోవడానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమీక్ష ను నిర్వహించారు.  ఈ సమావేశం లో కేంద్ర దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అమిత్ శాహ్ తో పాటు భారత ప్రభుత్వం లోని ఇతర ఉన్నతాధికారులు, ఇంకా ఐఎమ్ డి, ఎన్ డిఎమ్ ఎ మరియు ఎన్ డిఆర్ఎఫ్ లకు చెందిన  ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

 

18.05.2020 PM NDMA Amphan.JPG

అతి పెద్దదైనటువంటి మహాచక్రవాతం అత్యంత తీవ్రమైన పెను తుఫాను గా మారిపోయి గంట కు 195 కి.మీ. వరకు ఉండే గాలుల వేగాన్ని సంతరించుకొని మే నెల 20వ తేదీ మధ్యాహ్న కాలం లో పశ్చిమ బెంగాల్ లో తీరాన్ని తాకవచ్చని, పర్యవసానం గా ఆ రాష్ట్రం లో కోస్తా జిల్లాల లో భారీ స్థాయి వర్షపాతం నుండి  అత్యంత భారీ స్థాయి వర్షపాతాని కి సైతం ఆస్కారం ఉందని  అంచనా వేస్తున్నట్లు గా భారతదేశ వాతావరణ అధ్యయన విభాగం ( ఐఎమ్ డి ) సమాచారమిచ్చింది.     

పశ్చిమ బెంగాల్ లో తూర్పు మేదినీపుర్, దక్షిణ మరియు ఉత్తర 24 పరగణాలు, హావ్ డా, హుగ్ లీ మరియు కోల్ కాతా జిల్లాల లో మరీ అధిక ప్రభావం పడేందుకు అవకాశం ఉంది.  ఈ తుఫాను ఒడిశా  ఉత్తర ప్రాంతం లోని జగత్ సింహ్ పుర్, కేంద్రపాడా, భద్రక్ ఇంకా బాలాసోర్ లు సహా  కోస్తా తీర జిల్లాలను కూడా ప్రభావితం చేయవచ్చు.

దాదాపు గా 4 -5 మీటర్ల ఎత్తు న అత్యంత ఉగ్ర రూపం తో కూడిన సముద్రపు పోటు తో తుఫాను విరుచుకుపడి అది  తీరాన్ని దాటే వేళ పశ్చిమ బెంగాల్ లో  దక్షిణ మరియు ఉత్తర 24 పరగణాలు జిల్లాల లోతట్టు కోస్తా తీర ప్రాంతాల ను జలమయం  చేసే ప్రమాదం ఉందని, అలాగే తుఫాను కారణం గా పశ్చిమ బెంగాల్ లో తూర్పు మేదినీపుర్ జిల్లా లలో కూడా  3-4 మీటర్ల ఎత్తు కు కెరటాలు రావచ్చని ఐఎమ్ డి హెచ్చరిక చేసింది.  ఈ గాలివాన పశ్చిమ బెంగాల్ లోని తీర ప్రాంత జిల్లాల లో  విస్తృతమైనటువంటి నష్టాన్ని కలుగ చేసే శక్తి ఈ గాలివాన కు ఉంది. 

తుఫాను పయనించే మార్గం లో గల ప్రాంతాల ప్రజల ను పూర్తి గా అక్కడి నుండి సురక్షిత ప్రాంతాల కు తరలించేందుకు వీలు గా అవసరపడిన అన్ని చర్యల ను తీసుకోవలసింది గాను, అలాగే, నిత్యావసర వస్తువుల సరఫరాల ను తగినంత పరిమాణం లో అందుబాటు లో ఉండేలాగాను చూడాలి అని ప్రధాన మంత్రి ఆదేశించారు. 

విద్యుత్తు, టెలికమ్యూనికేశన్స్ వంటి అత్యవసర సేవల కు గనక నష్టాలు వాటిల్లే పక్షం లో వాటి మరమ్మతు కు తగిన సన్నాహక చర్యల కు సిద్ధం గా ఉండాలని   సంబంధిత వర్గాల కు సూచనలు చేయడం జరిగింది; మరి వారి వారి సన్నద్ధత ను సకాలం లో సమీక్షించుకోవడం ద్వారా ఏదైనా అంతరాయం ఏర్పడేటట్లయితే సేవల ను త్వరిత గతి న పునరుద్ధరించేందుకు పూచీ పడాలని కూడాను సలహా ఇవ్వడమైంది.

రక్షణ మరియు సహాయక చర్యల కోసం హెలీకాప్టర్ లను మరియు నౌకల ను  భారతీయ కోస్తా తీర రక్షకదళం, ఇంకా నౌకాదళం రంగం లోకి దించాయి.  ఈ రాష్ట్రాల లోని సైన్యం మరియు వైమానిక దళ విభాగాల ను కూడా అండ గా ఉంచడం జరిగింది.

  పశ్చిమ బెంగాల్ లో మరియు   ఒడిశా లో 25 బృందాల ను ఎన్ డిఆర్ఎఫ్  రంగం లోకి దించింది. అదనం గా 12  బృందాల ను అండను ఇవ్వడం కోసం సిద్ధం గా ఉంచడమైంది.  ఈ  బృందాల కు తోడు గా పడవల ను, చెట్ల ను నరికివేసి మార్గాన్ని సుగమం చేసేందుకు సాయపడే రంపాలను యంత్రాల ను, టెలిదూరసంచార ఉపకరణాలు మొదలైనటువంటి  అవసరమయ్యే సరంజామా ను అందించడమైంది.

ఐఎమ్ డి అన్ని ప్రభావిత రాష్ట్రాల కు తాజా ముందస్తు అంచనాల తాలూకు ప్రకటన లను క్రమ పద్ధతి లో జారీ చేస్తూ వస్తోంది.  దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం రాష్ట్ర ప్రభుత్వం తో ఎప్పటికప్పుడు సమాలోచన లు జరుపుతోంది.

***



(Release ID: 1625042) Visitor Counter : 176