సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ఈశాన్యరాష్ట్రాలు, జమ్మూ & కాశ్మీర్‌లకు కోవిడ్ సంబంధిత వైద్య స‌హాయాన్నిఅందిస్తున్నందుకు సైన్యాన్ని ప్ర‌శంసించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 18 MAY 2020 9:05PM by PIB Hyderabad

ఈశాన్య రాష్ట్రాలు,జ‌మ్ము కాశ్మీర్ల‌లో సైన్యం అందిస్తున్న‌ కోవిడ్ వైద్య సంబంధిత సేవ‌ల‌కు ఆర్మ్‌డ్ ఫోర్స్ మెడిక‌ల్ స‌ర్వీసెస్‌( ఎఎఫ్ఎంఎస్‌)ను ఈశాన్య ప్రాంత అభివృద్ధి (స్వ‌తంత్ర ) కేంద్ర మంత్రి, ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం, సిబ్బంది, ప్ర‌జా ఫిర్యాదులు, పెన్ష‌న్‌, అణుశ‌క్తి, అంత‌రిక్ష‌శాఖ‌ల స‌హాయ‌మంత్రి శ్రీ జితేంద్ర సింగ్  ప్ర‌శంసించారు. కోవిడ్ మ‌హ‌మ్మారి వ్యాప్తి తొలి ద‌శ‌లోనే సైన్యం రంగంలోకి దిగి ఈ ప్రాంతాల‌లో తొలిద‌శ స‌న్న‌ద్ధ‌త‌లో వ్యాదినిర్ధార‌ణ ప‌రీక్ష‌లు, చికిత్సా స‌దుపాయాలు క‌ల్పించ‌డంలో సైన్యం  విశేష సేవ‌లు  అందించింద‌ని ఆయ‌న అన్నారు.

ఈశాన్య రాష్ట్రాల‌కు సంబంధించి తీసుకున్న  చ‌ర్య‌లు , తాజా ప‌రిణామాలు, అక్క‌డి ప‌రిస్థితుల గురించి మంత్రి శ్రీ‌జితేంద్ర సింగ్‌కు    , జనరల్ బెనర్జీ   వివరించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో,  తెంగా మిలిటరీ హాస్పిటల్ లో కోవిడ్ పేషెంట్ల‌ కోసం 80 ప్ర‌త్యేక పడకలు, 2 ఐసియు పడకలు ఉన్నాయని, లికబాలిలోని మిలిటరీ హాస్పిటల్‌లో కోవిడ్ పేషెంట్ల  కోసం 82  ప్ర‌త్యేక‌ పడకలు, 2 ఐసియు పడకలు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా, అస్సాంలోని జోర్హాట్ , మేఘాలయలోని షిల్లాంగ్ ల‌లో, సాయుధ దళాల వైద్య సేవలు అందుతున్నాయ‌ని తెలిపారు.  జోర్హాట్‌లో 110,షిల్లాంగ్‌లొ 247 ప్ర‌త్యేక బెడ్‌లు అందుబాటులో ఉంచారు. అలాగే జోర్హాట్‌లో 10 ఐసియు బెడ్లు, షిల్లాంగ్‌లో 4 ఐసియు బెడ్లు ఏర్పాటు చేశారు.
 ఆర్మ్‌డ్  ఫోర్సెస్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ (డిజి ఎఎఫ్ఎంఎస్‌) డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ , లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ అనుప్ బెన‌ర్జీ నుంచి తాజా స‌మాచారం తెలుసుకుంటూ కేంద్ర మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్‌, ఉదంపూర్‌లోని ఆర్మీ కమాండ్ ఆస్ప‌త్రి  సేవ‌ల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు. ఈ ఆస్ప‌త్రి కోవిడ్ కేసుల కోసం ప్ర‌త్యేకంగా 200 బెడ్లు సిద్ధం చేసింది. అలాగే 6 ఐసియు బెడ్లు కోవిడ్ వ్యాధి తీవ్ర‌త క‌లిగిన వారికోసం, సాధార‌ణ పౌరుల కోసం కేటాయించింది. ఈ చ‌ర్య‌ల‌న్నీ ఈ ఆస్ప‌త్రి కోవిడ్ వ్యాప్తి  ప్రారంభ ద‌శ‌లోనే చేప‌ట్టింది.
  అదేవిధంగా, శ్రీనగర్‌లోని ఆర్మీ హాస్పిటల్ 124 కోవిడ్ ప్ర‌త్యేక‌ పడకలను కూడా ఏర్పాటు చేసింది, రాజౌరిలోని ఆర్మీ హాస్పిటల్  కోవిడ్ కేసుల కోసం 82 పడకలను కేంద్ర‌పాలిత ప్రాంత  ప్రభుత్వ ఆరోగ్య అధికారులు ఏర్పాటు చేసిన సౌకర్యాలకు అనుబంధంగా ఏర్పాటు చేసింది. దీనికితోడు, కమాండ్ హాస్పిటల్ ఉధంపూర్ కూడా మొదటి నుండి రోగనిర్ధారణ సౌకర్యాలను అందిస్తోంది.
       కోవిడ్‌ మహమ్మారి ప్రారంభ దశలలో సైన్యం చేప‌ట్టిన‌ చురుకైన చ‌ర్య‌ల‌ను  డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు, ఇది వ్యాధి వ్యాప్తిని తగ్గించడంలో  దోహదపడింద‌న్నారు. సాయుధ దళాల వైద్య సేవలు ఏర్పాటు చేసిన  క్వారంటైన్ క్యాంపులు, ఐసొలేష‌న్ సౌక‌ర్యాల   గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
ప‌రిస్థితుల‌నుబ‌ట్టి, వైద్య ప‌రిక‌రాల స‌ప్ల‌య‌ర్స్‌నుంచి ప‌రిక‌రాల అందుబాటును బ‌ట్టి ముందు ముందు  ఇలాంటి ఆస్ప‌త్రుల సంఖ్య‌ను  మ‌రింత పెంచుతామ‌ని  ఎ.ఎఫ్‌.ఎం.ఎస్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్, కేంద్ర మంత్రికి తెలిపారు. అలాగే భవిష్య‌త్తులో ప‌రిస్థితుల‌ను బ‌ట్టి బెడ్ల సంఖ్య‌ను పెంచుతామ‌న్నారు.

 

*****



(Release ID: 1625031) Visitor Counter : 171