రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

చెల్లని లేదా ప‌ని చేయ‌‌ని ఫ్యాస్ట్‌ట్యాగ్ క‌లిగి ఉన్న‌ వాహనాల వారి నుంచి రెండు రెట్ల‌ టోల్ ఫీజు వసూలు

Posted On: 17 MAY 2020 2:08PM by PIB Hyderabad

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నెల 15న, జీఎస్ఆర్ 298 -ఈ అను‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జాతీయ రవాణా రుసుము (రేట్లు మరియు సేకరణల నిర్ధారణ) నిబంధనలు, 2008 లో సవరణకు గాను తాజా నోటిఫికేష‌న్ జారీ చేయ‌బ‌డింది. దీని ప్ర‌కారం
ఫాస్ట్ ట్యాగ్ లేకుండా టోల్ ఫీజు ప్లాజాల యొక్క “ఫాస్ట్ ట్యాగ్ లేన్” లోకి ప్రవేశించే వాహ‌నాల‌ వారి నుంచి ఆ వర్గం వాహనాలకు నిర్దేశించిన రుసుముకు రెండు రెట్ల‌ సమానమైన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ సవరణకు ముందు వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ లేకుండానే ప్రత్యేకమైన ఫాస్ట్‌టాగ్ లేన్‌లోకి ప్రవేశిస్తే ఆ వాహనందారు వినియోగదారు ఫీజు ప్లాజాలో దాదాపు రెండుమార్లు టోల్‌ పీజును చెల్లించాల్సి ఉండేది.


(Release ID: 1624673)