ఆర్థిక మంత్రిత్వ శాఖ

దేశ అభివృద్ధికి నూత‌న అవ‌ధుల‌ను ఆర్థిక‌మంత్రి శ్రీ నిర్మ‌లా సీతారామ‌న్‌ ప్రకటించారు;

ఎనిమిది రంగాలలో స్ట్ర‌క్చ‌ర‌ల్‌ సంస్కరణలు ఆత్మ నిర్భర భారత్‌కు మార్గం సుగమం చేయ‌నున్నాయి.
ముఖ్యాంశాలు:
--బొగ్గు రంగంలో వాణిజ్య మైనింగ్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.
-- బొగ్గురంగంలో విభిన్న అవ‌కాశాలు
-- బొగ్గురంగంలో స‌ర‌ళీకృత విధానాలు
-- ఖ‌నిజ రంగంలో ప్రైవేటు పెట్టుబ‌డుల పెంపు, విధాన‌ప‌రమైన సంస్క‌ర‌ణ‌లు
-- ర‌క్షణ ఉత్ప‌త్తుల‌లో స్వావ‌లంబ‌న్ పెంపు
-- పౌర విమాన‌యాన రంగంలో స‌మ‌ర్త ఎయిర్ స్పేస్ యాజ‌మాన్యం
--- పిపిపి ద్వారా మ‌రిన్ని ప్ర‌పంచ‌శ్రేణి విమానాశ్ర‌యాలు
--ఎయిర్ క్రాఫ్ట్ మెయింటినెన్స్‌, రిపెయిర్‌, ఓవ‌ర్‌హాల్ (ఎంఆర్ఒ) కు సంబంధించి భార‌త‌దేశం గ్లోబ‌ల్ హ‌బ్ కానుంది.
--విద్యుత్ రంగంలో టారిఫ్ పాల‌సీ సంస్క‌ర‌ణ‌లు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో పంపిణీ ప్రైవేటీక‌ర‌ణ‌
-- సామాజిక రంగంలో పున‌రుద్ధ‌రించిన వ‌య‌బిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ప్రైవేటు పెట్టుబ‌డుల‌కు ఊతం
-- అంత‌రిక్ష కార్య‌క‌లాపాల‌లో ప్రైవేటు రంగం పాల్గొన‌డానికి ప్రోత్సాహం
-- అణు ఇంధ‌న రంగంలో సంస్క‌ర‌ణ‌లు

Posted On: 16 MAY 2020 8:47PM by PIB Hyderabad

 

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  20 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ ప్ర‌త్యేక  ఆర్థిక స‌మ‌గ్ర ప్యాకేజ్ని 2020 మే 12న ప్ర‌క‌టించారు. ఇది భార‌త‌దేశ జిడిపిలో ప‌దిశాతం. ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్బంగా ఆత్మ‌నిర్భ‌ర భార‌త్అభియాన్ లేదా స్వావ‌లంబిత భార‌త్ ఉద్య‌మానికి పిలుపునిచ్చారు. ఆయ‌న ఆత్మ‌నిర్భ‌ర భార‌త్‌కు సంబంధించిన ఐదు స్తంభాల గురించి ప్ర‌స్తావించారు. అవి ఆర్థిక‌, మౌలిక  స‌దుపాయాలు, వ్య‌వ‌స్జ‌త‌, చైత‌న్య‌వంత‌మైన జ‌నాభా, డిమాండ్
 కేంద్ర ఆర్థిక , కార్పొరేట్ వ్యవహారాలశాఖ‌ మంత్రి శ్రీమతి నిర్మ‌లా సీతారామ‌న్‌, ఈరోజు మీడియా ప్ర‌తినిధుల స‌మావేశంలో మాట్లాడుతూ  స్ట్ర‌క్చ‌ర‌ల్ సంస్కరణలు నేటి ప్ర‌క‌ట‌న‌ల్లో కీల‌క‌మైన‌వని అన్నారు. అనేక రంగాలలో  విధాన ప‌ర‌మైన‌ సరళీకరణ అవసరమని ఆమె అన్నారు.  ఏ రంగం ఏమివ్వ‌గ‌ల‌దో ప్ర‌జ‌లు సుల‌భంగా  అర్థం చేసుకోవడానికి,  వాటి కార్యకలాపాల్లో పాల్గొనడానికి,  పారదర్శకతకు  సుల‌భ‌త‌ర విధానాలు అవ‌స‌ర‌మ‌న్నారు. మ‌నం ఒక‌సారి ఈ  రంగాలకు సంబంధించిన అడ్డంకులు తొల‌గించిన  తర్వాత,  ప్ర‌గ‌తిసాధ‌న కోసం ఈ రంగాల‌ను ముందుకు తీసుకుపోగ‌ల‌మ‌ని  ఆర్థిక మంత్రి తెలిపారు.
ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం లోతైన వ్య‌వ‌స్థీకృత‌ సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డంలో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీకి మంచి బ‌ల‌మైన రికార్డు ఉంద‌ని అంటూ ఆర్థిక‌మంత్రి, ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌ను ప్రస్తావించారు. ప్ర‌జ‌ల‌కు నేరుగా న‌గ‌దు బ‌దిలీ చేస్తున్న‌ ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కం ఇందుకు ఉదాహ‌ర‌ణ అని అల‌గే జిఎస్టి సంస్క‌ర‌ణ‌లు ఒక దేశం, ఒక మార్కెట్‌ను తీసుకువ‌చ్చాయ‌ని, ఇన్‌సాల్వెన్సీ, దివాలా కోడ్ (ఐబిసి)  ఇన్‌సాల్వెన్సీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించింద‌ని, సుల‌భ‌త‌ర వాణిజ్యానికి ప‌లు చ‌ర్య‌లు తీసుకున్నార‌ని చెప్పారు.
స‌త్వ‌ర పెట్టుబ‌డుల‌కు విధాన‌ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల తీసుకురావ‌ల‌సిన అవ‌స‌రం గురించి, ఈ దిశ‌గా ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల గురించి ఆర్థిక మంత్రి శ్రీ‌మ‌తి నిర్మ‌లా సీతారామ‌న్ ఈరోజు మీడియా ప్ర‌తినిధుల స‌మావేశంలోవివ‌రించారు..
ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీల ద్వారా ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ లు జ‌రుగుతున్నాయ‌ని , పెట్టుబడి  వ‌చ్చే ప్రాజెక్టులను సిద్ధం చేయడానికి  పెట్టుబడిదారులతో , కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవడానికి ప్రతి మంత్రిత్వ శాఖలో ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్‌ సెల్ ఏర్పాటు చేయడం జ‌రుగుతుంద‌ని ఆమె పేర్కొన్నారు.
  ఆత్మ నిర్భర్ భారత్ దిశ‌గా  పెట్టుబడులను వేగంగా ట్రాక్ చేయడానికి క్రింది విధాన సంస్కరణలను ఆర్థిక మంత్రి ప్రకటించారు:
ఎ. సాధికార‌తా గ్రూప్ కార్య‌ద‌ర్శుల ద్వారా పెట్టుబడి క్లియ‌రెన్సుల ఫాస్ట్ ట్రాకింగ్ ఉంటుంది.
బి. పెట్ట‌బడులు పెట్టే ప్రాజెక్టుల రూప‌క‌ల్ప‌న‌కు ప్ర‌తి మంత్రిత్వ‌శాఖ స్థాయిలో ఇన్వెస్ట‌ర్ల‌ను, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో స‌మ‌న్వ‌యం సాధించ‌డానికి ఒక ప్రాజెక్ట్ డ‌వ‌ల‌ప్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేస్తారు.
సి.  కొత్త పెట్టుబ‌డులకు సంబంధించి పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణీయ‌తలో పొటీప‌డ‌డానికి రాష్ట్రాల‌కు ర్యాంకులు ఇవ్వ‌డం జ‌రుగుతుంది.
డి. సౌర పివి తయారీ ,అడ్వాన్స్‌డ్ సెల్ బ్యాట‌రీ స్టోరేజ్ వంటి రంగాలలో కొత్త ఛాంపియన్ సెక్టార్ల ను  ప్రోత్సాహించేందుకు  ఇన్సెంటివ్  పథకాలు ప్రారంభించబడతాయి;.
సాధారణ మౌలిక సదుపాయాల సౌకర్యాలు , అనుసంధాన‌త‌కు సంబంధించి పారిశ్రామిక క్లస్టర్ అప్‌గ్రేడేషన్ కోసం ఛాలెంజ్ మోడ్ ద్వారా రాష్ట్రాల్లో ఒక పథకం అమలు చేయనున్న‌ట్టు శ్రీమతి నిర్మ‌లా సీతారామన్ ప్రకటించారు. కొత్త పెట్టుబడులను ప్రోత్సహించడానికి ,జిఐఎస్ మ్యాపింగ్‌తో పారిశ్రామిక సమాచార వ్యవస్థ (ఐఐఎస్) పై సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పారిశ్రామిక భూమి , ల్యాండ్ బ్యాంకులు అందుబాటులో ఉంటాయి..
ఐదు లక్షల హెక్టార్లలో 3376 పారిశ్రామిక పార్కులు , ఎస్టేట్లు,సెజ్‌లు ఐఐఎస్‌లో మ్యాప్ చేశారు. అన్ని పారిశ్రామిక పార్కులకు 2020-21 మధ్య ర్యాంకులు ఉంటాయి.
బొగ్గు, ఖనిజాలు, రక్షణ ఉత్పత్తి, పౌర విమానయానం, విద్యుత్ రంగం, సామాజిక మౌలిక సదుపాయాలు, అంతరిక్ష, అణు ఇంధనం వంటి ఎనిమిది రంగాల్లో ఈ క్రింది స్ట్ర‌క్చ‌ర‌ల్  సంస్కరణలను ఆర్థిక మంత్రి ఈ రోజు ప్రకటించారు. వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
ఎ . బొగ్గు రంగం:


1. బొగ్గు రంగంలొ వాణిజ్య మైనింగ్ ను ప్ర‌వేశ‌పెట్ట‌డం
బొగ్గు రంగంలో కింది చ‌ర్య‌ల ద్వారా పోటీ, పారదర్శకత, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది
(ఎ)స్థిర రూపాయి / టన్నుల  లెక్క విధానానికి బదులుగా ఆదాయ భాగస్వామ్య విధానం. ఎవ‌రైనా బొగ్గు బ్లాక్ కోసం బిడ్ వేయ‌వ‌చ్చు. , బహిరంగ మార్కెట్లో అమ్మవచ్చు
బి) ప్రవేశ నిబంధనలు సరళీకృతం చేస్తారు. దాదాపు 50 బ్లాక్‌లు వెంటనే ఇవ్వబడతాయి. ఎటువంటి అర్హత షరతులు ఉండవు, సీలింగ్‌తో అప్‌ఫ్రంట్‌ చెల్లింపు స‌దుపాయం మాత్రమే క‌ల్పిస్తారు.
(సి) అణ్వేష‌ణ పూర్తి చేసిన  బొగ్గు బ్లాకులను మాత్ర‌మే  వేలం వేసే  పూర్వపు నిబంధనలకు బ‌దులుగా,  పాక్షికంగా అణ్వేషించిన‌ బ్లాకుల కోసం ఎక్స్‌ప్లొరేష‌న్‌-కమ్-ప్రొడక్షన్ విధానం ఉంటుంది. ఇది  బొగ్గు బ్లాకుల అన్వేషణలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని అనుమతిస్తుంది.
డి) షెడ్యూల్ కంటే ముందే ఉత్పత్తి జ‌రిగితే,  రెవెన్యూ-వాటాలో రిబేటు ద్వారా ప్రోత్సహిస్తారు


2. బొగ్గు రంగంలో వైవిధ్యం తో కూడిన అవకాశాలు:
 
ఎ) రాబడి వాటాలో రిబేట్ ద్వారా బొగ్గు గ్యాసిఫికేషన్, ద్రవీకరణ ప్రోత్సహించ‌డం జ‌రుగుతుంది. ఇది పర్యావరణ ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది  గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మారడానికి  ఇది భారతదేశానికి సహాయపడుతుంది.
బి) 2023-24 నాటికి 1 బిలియ‌న్ ట‌న్నుల అద‌న‌పు  బొగ్గు ఉత్ప‌త్తి ల‌క్ష్యం నిర్దేశించుకున్న కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్‌) అలాగే ప్రైవేటు బ్లాక్ ల నుంచి బొగ్గు ఉత్ప‌త్తిని త‌ర‌లించ‌డానికి న 50,000 కోట్ల రూపాయ‌ల‌తో అవ‌స‌ర‌మైన మౌలిక‌స‌దుపాయాల అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటారు. ఇందులో బొగ్గును గ‌నుల నుంచి రైల్వై సైడింగ్‌ల‌కు (క‌న్వేయ‌ర్ బెల్ట్) మీదుగా యాంత్రిక త‌ర‌లింపు రంగంలో రూ 18,000 కోట్ల పెట్టుబ‌డి కూడా ఇమిడి ఉంది. ఇది ప‌ర్యావ‌ర‌ణంపై ప‌డే ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డానికి ఉప‌క‌రిస్తుంది.


3. బొగ్గురంగంలో స‌ర‌ళీకృత పాల‌నా విధానం
ఎ. కోల్  బెడ్ మీథేన్ (సిబిఎం) వెలికితీత హక్కులను, కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) బొగ్గు గనుల నుండి వేలం వేస్తుంది
(బి) మైనింగ్ ప్లాన్ సరళీకరణ వంటి సుల‌భ‌త‌ర వ్యాపారానికి సంబంధించిన చ‌ర్య‌లు తీసుకుంటారు.  ఇది వార్షిక ఉత్పత్తిలో  40
శాతం ఆటోమేటిక్‌ పెరుగుదలను అనుమతిస్తుంది.
 సి) సిఐఎల్‌ వినియోగదారులకు వాణిజ్య పరమైన‌ రాయితీల క‌ల్ప‌న‌. (5,000 కోట్ల రూపాయల విలువైన ఉపశమనం).
 నాన్ ప‌వ‌ర్‌ వినియోగదారుల కోసం వేలంలో రిజర్వ్ ధర తగ్గించ‌డం జ‌రిగింది. క్రెడిట్ నిబంధనలు స‌డ‌లించారు. అలాగే లిఫ్టింగ్ స‌మ‌యం పెంచడం జ‌రిగింది.

ఖనిజ రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల పెంపు : 

వృద్ధి, ఉపాధిని పెంచడానికి మరియు ముఖ్యంగా అన్వేషణపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడానికి నిర్మాణాత్మక సంస్కరణలు ఉంటాయి

ఏ.    సీమ్ లెస్ మిశ్రమ అన్వేషణ, గనుల తవ్వకం, ఉత్పత్తి తో కూడిన విధానం పరిచయం.

బి.   బహిరంగ, పారదర్శకమైన వేలం ప్రక్రియ ద్వారా 500 గనుల బ్లాకులు అందుబాటులో ఉంటాయి

సి.    అల్యూమినియం పరిశ్రమ విద్యుత్ వ్యయం తగ్గించడానికి సహాయపడే విధంగా అల్యూమినియం పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచడానికి బాక్సైట్ మరియు బొగ్గు ఖనిజ బ్లాకుల ఉమ్మడి వేలం. 

2.  ఖనిజ రంగంలో విధానపరమైన సంస్కరణలు: 

మైనింగ్ లీజుల బదిలీ మరియు మిగులు ఖనిజాల అమ్మకం, గనుల మధ్య వ్యత్యాసం, మైనింగ్ మరియు ఉత్పత్తిలో మెరుగైన సామర్థ్యానికి దారితీస్తుంది అనే అంశాన్ని తొలగించాలివివిధ ఖనిజాల కోసం ఖనిజ సూచికను అభివృద్ధి చేసే పనిలో గనుల మంత్రిత్వ శాఖ ఉందిమైనింగ్ లీజులు ఇచ్చే సమయంలో చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ యొక్క హేతుబద్ధీకరణ ఉంటుంది.

సి.  రక్షణ రంగం : 

1.  రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబన మెరుగుదల :

(ఏ)   సంవత్సర వారీగా సమయపాలనతో దిగుమతిపై నిషేధం కోసం ఆయుధాల జాబితాను తెలియజేయడం ద్వారా రక్షణ ఉత్పత్తిలో స్వావలంబన కోసం ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారం చేయబడుతుంది, భారీగా రక్షణ దిగుమతి బిల్లును తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. 

(బి)   ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ను కార్పొరేట్ చేయడంద్వారా ఆర్డినెన్స్ సరఫరాల్లో స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనం, సామర్ధ్యం మెరుగవుతాయి. 

2.     రక్షణ ఉత్పత్తిలో విధానపరమైన సంస్కరణలు : 

(ఏ)   రక్షణ తయారీలో ఆటోమేటిక్ రూట్ కింద ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు 49 శాతం నుండి 74 శాతానికి పెరుగుతాయి. 

(బి)   కాంట్రాక్టు మానేజ్మెంట్ కు మద్దతుగా, ప్రాజెక్ట్ మానేజ్మెంట్ యూనిట్ (పి.ఎమ్.యు) ఏర్పాటు చేయడం ద్వారా నిర్ణీత కాల పరిమితితో  రక్షణ సేకరణ ప్రక్రియ ఉంటుందివేగంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయుధాల జనరల్ స్టాఫ్ గుణాత్మక అవసరాలు (జిఎస్‌క్యూఆర్ లు) యొక్క వాస్తవిక సెట్టింగ్ మరియు ట్రయల్ మరియు టెస్టింగ్ విధానాలను సరిదిద్దడం.

డి. పౌర విమానయాన రంగం :

1.  పౌర విమానయానానికి సమర్థవంతమైన ఎయిర్ స్పేస్ నిర్వహణ

భారతీయ ఎయిర్‌స్పేస్ వినియోగంపై పరిమితి సడలించడం ద్వారా పౌర విమానాల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుంది.  దీని వల్ల విమానయాన రంగానికి సంవత్సరానికి సుమారు 1,000 కోట్ల రూపాయల లాభం చేకూరుతుందిఇది గగనతలం యొక్క వాంఛనీయ వినియోగానికి దారితీస్తుంది; ఇంధన వినియోగం, సమయం తగ్గడం మరియు సానుకూల పర్యావరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

2.   పి.పి.పి. ద్వారా మరిన్ని ప్రపంచ స్థాయి విమానాశ్రయాలు : 

ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపిప్రాతిపదికన ఆపరేషన్ మరియు నిర్వహణ కోసం 2 వ రౌండ్ బిడ్డింగ్ కోసం మరో 6 విమానాశ్రయాలను గుర్తించారు.  1 వ మరియు 2 వ రౌండ్లలో 12 విమానాశ్రయాలలో ప్రైవేట్ సంస్థల ద్వారా  సుమారు 13,000 కోట్ల రూపాయల మేర  అదనపు పెట్టుబడుల అంచనా.   మూడవ రౌండ్ వేలంలో మరో ఆరు విమానాశ్రయాలు కూడా ఈ  పరిధిలోకి వస్తాయి. 

3.  విమానాల నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్ ఆయిలింగ్ (ఎమ్.ఆర్.ఓ.) కు భారతదేశం  ఒక  గ్లోబల్ హబ్ గా మారుతుంది.  

ఎమ్.ఆర్.ఓ. పర్యావరణ వ్యవస్థ కోసం పన్ను వ్యవస్థ హేతుబద్ధం చేయబడింది.  వచ్చే మూడేళ్ళలో విమానాల విడిభాగాల మరమ్మత్తు, ఎయిర్ ఫ్రేమ్ నిర్వహణ వ్యయం 800 కోట్ల రూపాయలనుండి 2,000 కోట్ల రూపాయలకు పెరుగుతుంది.  వచ్చే ఏడాది , ప్రపంచంలోని ప్రముఖ ఇంజిన్ తయారీదారులు తమ ఇంజన్ మరమ్మతు సదుపాయాలను భారతదేశం నెలకొల్పే అవకాశం ఉందిరక్షణ రంగం మరియు పౌర ఎమ్.ఆర్.ఓ.ల కలయిక ఆర్థిక వ్యవస్థలను సృష్టించడానికి సహాయపడుతుంది.  దీనివల్ల విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. 

ఈ.  విద్యుత్ రంగం : 

3.    టారిఫ్ విధానంలో సంస్కరణ : 

టారిఫ్ విధానంలో ఈ కింది సంస్కరణలు విడుదల కానున్నాయి. 

(i )   సినియోగదారుల హక్కులు : 

ఏ.  డిస్కోమ్ అసమర్ధతలు వినియోగదారులకు భారం కాకూడదు. 

బి.  డిస్కామ్‌లకు సేవా ప్రమాణాలు మరియు అనుబంధ జరిమానాలు

సి.   డిస్కోమ్ లు తగినంత విద్యుత్తును నిర్ధారించాలి; లోడ్ షెడ్డింగ్ అయితే జరిమానా. 

(ii)   పరిశ్రమకు ప్రోత్సాహం : 

ఏ.   క్రాస్ సబ్సిడీలలో క్రమంగా పెరుగుదల.  

బి.  అందరు పాల్గొనేందుకు వీలుగా సమయ పరిమితి మంజూరు 

సి.   విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా ప్రోజెక్టులకు సమర్థులైన డెవలపర్ల ఎంపిక 

(iii)  రంగం యొక్క స్థిరత్వం 
 ఏ.   నియంత్రణ లేని ఆస్తులు 
బి.   జెన్కోలకు సకాలంలో చెల్లింపులు 
 సి.   సబ్సిడీ కోసం డి.బి.టి. ; స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు 

4.    కేంద్రపాలితప్రాంతాల్లో పంపిణీ ప్రయివేటీకరణ : 

కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ శాఖలు / సేవలు ప్రయివేటీకరించబడతాయి.  దీనివల్ల వినియోగదారులకు ఉత్తమ సేవలు అందుతాయి. పంపిణీ లో నిర్వహణ, ఆర్ధిక సమర్ధత మెరుగౌతుందిఇది దేశవ్యాప్తంగా ఇతర యుటిలిటీల ద్వారా అనుసరణ కోసం ఒక నమూనాను అందిస్తుంది.

ఎఫ్.   సామాజిక మౌలికసదుపాయాలు :  పునరుద్ధరించిన సాధ్యత గ్యాప్ ఫండింగ్ పథకం ద్వారా ప్రయివేటు రంగం పెట్టుబడులను పెంపొందించడం - 8,100 కోట్ల రూపాయలు. 

కేంద్రం, రాష్ట్రం/చట్టబద్ధమైన సంస్థలు వి.జి.ఎఫ్. గా కల్పించిన ఒక్కొక్క ప్రాజెక్ట్ మొత్తం వ్యయంలో 30% వరకు వేబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) పరిమాణాన్ని ప్రభుత్వం పెంచుతుంది. మిగిలిన రంగాలకు భారత ప్రభుత్వం మరియు రాష్ట్రాలు / చట్టబద్దమైన సంస్థలు కల్పించిన ప్రస్తుత వి.జి.ఎఫ్. మద్దతు ఒక్కొక్క ప్రాజెక్టుకు 20 శాతం యధావిధిగా కొనసాగుతుంది. దీనికోసం మొత్తం 8,100 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రాజెక్టులను కేంద్ర మంత్రిత్వశాఖలు / రాష్ట్ర ప్రభుత్వాలు / చట్టబద్దమైన సంస్థలు ప్రతిపాదిస్తాయి. 

జి.  అంతరిక్ష రంగం : అంతరిక్ష కార్యకలాపాలలో ప్రయివేటు భాగస్వామ్యానికి ప్రోత్సాహం: 

ఉపగ్రహాలు, ప్రయోగాలు, అంతరిక్ష ఆధారిత సేవలలో ప్రైవేటు కంపెనీలకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందుబాటులో ఉంచుతారు. ఊహించదగిన విధానం, వాతావరణ నియంత్రణ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు. తమ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రైవేటు రంగానికి ఇస్రో సౌకర్యాలు, ఇతర సంబంధిత ఆస్తులను వినియోగించుకోడానికి అనుమతిస్తారు.  గ్రహాన్వేషణ, బాహ్య అంతరిక్ష ప్రయాణం మొదలైన భవిష్యత్ ప్రాజెక్టులలో  ప్రైవేటు రంగానికి అవకాశం కల్పిస్తారు. ఉదార భౌగోళిక ప్రాదేశిక డేటా విధానానికి అవసరమైన రిమోట్ సెన్సింగ్ డాటాను సాంకేతిక సంస్థలకు అందుబాటులో ఉంచుతారు.  

హెచ్.   అణుశక్తికి సంబంధించిన సంస్కరణలు : 

వైద్య ఐసోటోపుల ఉత్పత్తి కోసం పిపిపి మోడ్‌లో పరిశోధన రియాక్టర్ క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులకు సరసమైన చికిత్స ద్వారా మానవత్వం యొక్క సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయాలి.  ఆహార సంరక్షణ కోసం రేడియేషన్ టెక్నాలజీని ఉపయోగించడానికి పిపిపి మోడ్‌లోని సౌకర్యాలు - వ్యవసాయ సంస్కరణలను అభినందించడానికి మరియు రైతులకు సహాయం చేయడానికి కూడా ఏర్పాటు చేయబడతాయి.  భారతదేశం యొక్క బలమైన ప్రారంభ పర్యావరణ వ్యవస్థ అణు రంగానికి అనుసంధానించబడుతుంది.  దీని కోసం, పరిశోధనా సౌకర్యాలు మరియు టెక్-వ్యవస్థాపకుల మధ్య సినర్జీని పెంపొందించడానికి టెక్నాలజీ డెవలప్మెంట్-కమ్-ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయబడతాయి.

****


(Release ID: 1624579) Visitor Counter : 509