రైల్వే మంత్రిత్వ శాఖ
దేశంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన 14 లక్షల మందిని మే 15 అర్థరాత్రి నాటికి రైల్వే శాఖ వారి స్వస్థలాలకు చేర్చింది.అంటే 15 రోజుల వ్యవధిలో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 1074 శ్రామిక్ ప్రత్యేక రైళ్ళను
గత మూడు రోజులలో రోజుకు 2 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. రాగల రోజులలో రోజుకు 3 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చనున్నారు.
మిషన్ బ్యాక్ హోమ్ (తిరిగి ఇంటికి) కార్యక్రమం జోరుగా సాగుతోంది
ప్రయాణికులకు ఉచిత భోజనం, మంచినీరు అందిస్తున్నారు.
ప్రయాణీకులను పంపే రాష్ట్రం , వాటిని స్వీకరిస్తున్న రాష్ట్రం రెండూ సమ్మతి ఇచ్చిన తరువాత మాత్రమే రైళ్లను నడుపుతున్న రైల్వేశాఖ
Posted On:
16 MAY 2020 2:39PM by PIB Hyderabad
ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయిన ఇతర వ్యక్తుల ను స్వస్థలాలకు చేర్చడానికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, భారతీయ రైల్వే “శ్రామిక్ స్పెషల్” రైళ్లను నడపాలని నిర్ణయించింది.
2020 మే 15 వ తేదీ అర్థరాత్రి నాటికి మొత్తం 1074 శ్రామిక్ స్పెషల్ రైళ్లను దేశంలోని వివిధ రాష్ట్రాలనుంచి నడిపారు. 14 లక్షల మందికిపైగా వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వారిని గత 15 రోజులలో వారి వారి స్వరాష్ట్రాలకు చేర్చారు.
గత 3 రోజులుగా రోజుకు రెండు లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. రాగల రోజులలో దీనిని రోజుకు మూడు లక్షల ప్రయాణికులకు పెంచనున్నారు.
ఈ 1074 శ్రామిక్ ప్రత్యేక రైళ్ళు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా,మహరాష్ట్ర, పంజాబ్,రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ,కర్ణాటక, కేరళ, గోవా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేవ్, బీహార్‌లనుంచి బయలుదేరాయి.
ఈ శ్రామిక్ ప్రత్యేక రైళ్ళు ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛతీస్‌ఘడ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ , కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ప్రయాణికులను చేరవేసి గమ్యస్థానాలకు చేరాయి.
ఈ ప్రత్యేక శ్రామిక్ రైళ్లలోవెళ్ళే ప్రయాణికులకు రైలు ఎక్కడానికి ముందే పరీక్షలు నిర్వహించి, ప్రయాణానికి అనుమతించడంతోపాటు, ప్రయాణంలో వారికి ఉచిత భోజనం,మంచినీరు అందించడం జరుగుతోంది.
(Release ID: 1624487)
Visitor Counter : 222
Read this release in:
Punjabi
,
Hindi
,
Urdu
,
Tamil
,
Gujarati
,
Bengali
,
Assamese
,
English
,
Marathi
,
Odia
,
Kannada
,
Malayalam