హోం మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖ సూచన – వలస కార్మికులను వెనక్కు పంపాల్సిన అవసరం లేదు. బస్సులతో పాటు వారి కోసమే ప్రత్యేకంగా నడుపుతోన్న శ్రామిక్ ప్రత్యేక రైళ్ళలో స్వస్థలాలకు చేరవేయండి.
Posted On:
15 MAY 2020 10:41PM by PIB Hyderabad
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.ఏ) అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు 2020 మే 11న ఓ లేఖ రాసింది. ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు బస్సుల ద్వారా మరియు వారి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం నడుపుతోన్న శ్రామిక్ రైల్ళ ద్వారా వేగంగా చేరవేసేందుకు వీలుగా లేఖ రాసింది.
వలస కార్మికులు రోడ్ల మీద మరియు రైల్వే ట్రాక్ ల మీద నడుస్తున్న పరిస్థితి గురించి ఈ లేఖలో ఆందోళన వ్యక్తమైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అటువంటి స్థితిలో ఉన్న వారికి తగిన సూచనలు ఇవ్వాలని, సమీపంలోని ఆశ్రయ కేంద్రాలకు తరలించాలని, అదే విధంగా బస్సులు లేదా ప్రత్యేక శ్రామిక్ రైళ్ళలో వారిని పంపించే వరకూ వారికి స్థానిక ప్రదేశాల్లోనే ఆహారం, నీరు మొదలైనవి అందించాలని సూచించారు.
ఏదేమైనా, వలస కార్మికులు రోడ్లు, రైల్వే ట్రాక్ లు మరియు ట్రక్కుల్లో ప్రయాణించిన సందర్భాలు ఇప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నివేదించబడుతున్నాయి. ఈ దృష్ట్యా, ఈ వలస కార్మికులు వెనక్కు తిరిగి వెళ్ళవలసి అవసరం లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ రోజుకు 100కి పైగా శ్రామిక్ ప్రత్యేక రైళ్ళను నడుపుతోందని, అవసరానికి అనుగుణంగా అదనపు రైళ్ళను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని ఈ కమ్యూనికేషన్ పేర్కొంది. ఈ ఏర్పాట్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు వారిని కాలి నడకన ముందుకు సాగవద్దని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వారికి సలహా ఇవ్వాలి. వారి ప్రయాణానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్ళలోనూ చేరవేయవచ్చు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన అధికారిక లేఖను చూసేందుకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయండి.
(Release ID: 1624396)
Visitor Counter : 314
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada