సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, 8 ఈశాన్య రాష్ట్రాలకు ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్ల నుండి కోవిడ్ పై ప్రతిస్పందన తెలుసుకున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 15 MAY 2020 7:38PM by PIB Hyderabad

కోవిడ్ కి సంబంధించి తాజా స్థితిగతులను, ప్రతిస్పందనను తెలుసుకోడానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం రెసిడెంట్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ సుమారు గంట పాటు నిర్వహించారు.

దీనిలో పాల్గొన్న రెసిడెంట్ కమిషనర్లలో అరుణాచల్ ప్రదేశ్ నుండి జితేంద్రనారైన్, అస్సాం నుండి కెసి సమారియా, మణిపూర్ నుండి పికె సింగ్, మిజోరం నుండి అజయ్ చౌదరి, నాగాలాండ్ నుండి జ్యోతికాలాష్, సిక్కిం నుండి అశ్వని కుమార్ చంద్ త్రిపుర నుండి చైతన్య మూర్తి, జమ్ము కశ్మీర్ నుండి నీరజ్ కుమార్ పాల్గొన్నారు. 

దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తమ స్వస్థలాలకు వెళ్లే వారికి చేసిన ఏర్పాట్ల గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. వీరికోసం శ్రామిక్ రైళ్లు కొనసాగిస్తామని చెప్పారు. దీని కోసం నోడల్ అధికారులుగా రెసిడెంట్ కమిషనర్లు నిర్వహిస్తున్న పాత్రను కేంద్ర మంత్రి ప్రశంసించారు. 

 

దీనికి సంబంధించి తమ కార్యాలయం అన్ని రాష్ట్రాలతోను ఎప్పటికప్పుడు సంప్రదిస్తోందని, రెసిడెంట్ కమిషనర్లు కూడా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలని కేంద్ర మంత్రి పిలుపు నిచ్చారు. ఈశాన్య రాష్ట్రాలు నిర్వహణ చర్యలు మిగిలిన రాష్ట్రాల కన్నా ప్రభావవంతంగా చేపట్టాయని, ఆ తర్వాత జమ్ము కశ్మీర్, లడాఖ్ కూడా అనేక రాష్ట్రాల కన్నా మెరుగ్గా కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు చేపడుతున్నామని కేంద్ర మంత్రి ప్రశంసించారు. 

నిత్యావసర వస్తువులు కానీ, వైద్య వస్తువులు కానీ రాష్ట్రంలో కొరత లేదని, ఆయా రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లు వివరించారు. వలస కార్మికుల రద్దీ తగ్గించడానికి తీసుకున్న క్రమబద్దీకరణ చర్యల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని కమిషనర్లు వివరించారు. 

ప్రధానమంత్రి ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ విషయంలో కూడా క్షేత్ర స్థాయిలో సకారాత్మకమైన ప్రతిస్పందన కనిపించిందని రెసిడెంట్ కమిషనర్లు తెలిపారు. 

                             <><><><><>



(Release ID: 1624249) Visitor Counter : 168