రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రూ.400 కోట్ల రక్షణ పరీక్ష మౌలిక సదుపాయాల పథకాన్ని ఆమోదించిన రక్షణ‌ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్

Posted On: 15 MAY 2020 6:30PM by PIB Hyderabad

దేశీయ‌ రక్షణ ఏరోస్పేస్ తయారీకి ప్రోత్సాహాన్నిచ్చేందుకు రక్షణ‌ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఈ రంగానికి అత్యాధునిక పరీక్ష‌, మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం 400 కోట్ల రూపాయల వ్యయంతో రక్షణ పరీక్ష మౌలిక సదుపాయాల పథకాన్ని (డీటీఐఎస్) ప్రారంభించడానికి ఆమోదం తెలిపారు. ఈ పథకం ఐదేళ్ల కాలానికి నడుస్తుంది. ప్రైవేట్ పరిశ్రమల భాగస్వామ్యంతో ఆరు నుండి ఎనిమిది కొత్త పరీక్షా సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఇది వీలు క‌ల్పించ‌నుంది.
ఇది స్వదేశీ రక్షణ ఉత్పత్తిని సులభతరం చేయ‌డంతో పాటు సైనిక పరికరాల దిగుమతులను తగ్గించి ఈ రంగంలోని దేశ‌ స్వావలంబనకు సహాయపడుతుంది. ఈ పథకం కింద ఉన్న ప్రాజెక్టులకు 75 శాతం వరకు సొమ్మును ప్రభుత్వ నిధుల ‘గ్రాంట్-ఇన్-ఎయిడ్’ రూపంలో అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యయంలో మిగిలిన 25 శాతం మొత్తాన్ని స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) భరించాల్సి ఉంటుంది. భారత ప్రైవేటు సంస్థలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అందించ‌నున్నాయి. ఈ పథకం కింద ఉన్న ఎస్‌పీవీలు కంపెనీల చట్టం, 2013 కింద నమోదు చేయబడతాయి. వినియోగదారు ఛార్జీలను వసూలు చేయడం ద్వారా ఈ పథకం కింద అన్ని ఆస్తులను స్వీయ-స్థిరమైన విధానంలో నిర్వ‌హించ‌బ‌డుతాయి. పరీక్షించిన పరికరాలు / వ్యవస్థలు తగిన అక్రెడిటేషన్ విధానం ప్రకారం ధ్రువీకరించబడతాయి. రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లలో (డీఐసీ) మెజారిటీ పరీక్షా సదుపాయాలు వస్తాయని భావిస్తున్నప్పటికీ, ఈ పథకం డీఐసీలలో మాత్రమే టెస్ట్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి పరిమితం కాద‌ని స‌ర్కారు నుంచి స్ప‌ష్ట‌మైన సంకేతాలు అందుతున్నాయి. డీటీఐఎస్ మార్గదర్శకాలు ఎంఓడీ/ డీడీపీ మరియు
డీజీక్యూఏ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయబడ్డాయి. దీనిని https://ddpmod.gov.in/sites/ default/files/pdfupload/DTIS%20Guidelines.pdf అనే వెబ్‌లింక్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు.



(Release ID: 1624234) Visitor Counter : 282