నౌకారవాణా మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వ్యతిరేక పోరాటంలో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేందుకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రకటించిన చర్యలను స్వాగతించిన శ్రీ మన్సుఖ్ మాండవీయ

Posted On: 15 MAY 2020 7:14PM by PIB Hyderabad

గౌరవ ప్రధానమంత్రి చేసిన ప్రకటనను అనుసరించి ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించిన చర్యలను షిప్పింగ్, రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయమంత్రి (ఇంఛార్జ్) శ్రీ మన్సుఖ్ మాండవియా స్వాగతించారు. శ్రీ నరేంద్రమోడీ ఆదివారం 20 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక, సమగ్ర ప్యాకేజీని ప్రకటించారు. ఆయన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లేదా స్వీయ రిలయంట్ ఇండియా ఉద్యమానికి స్పష్టమైన పిలుపునిచ్చారు. ఆత్మ నిర్భర్ భారత్ యొక్క ఐదు స్తంభాలు- ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, జన బలం మరియు డిమాండ్ గురించి ఆయన వివరించారు.

కోవిడ్ -19 మహమ్మారిపై ధైర్యంగా పోరాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థను, పౌరుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడంలో ఆర్థిక మంత్రి ఇప్పటి వరకూ మూడు దశల్లో ప్రకటించిన వివరాలు ఉన్నత శిఖరాలను అందిస్తాయని శ్రీ మాండవీయ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి మొదటి దశలో తిరిగి పారిశ్రామిక కార్యకలాపాలను ప్రారంభించే చర్యలను ప్రకటించారని, అదే విధంగా ఉద్యోగులు మరియు యజమానులు, వ్యాపారాలు  ముఖ్యంగా మైక్రో, స్మార్ మరియు మీడియం ఎంటర్ ప్రైజెస్, ఉత్పత్తికి తిరిగి రావడానికి మరియు కార్మికులను తిరిగి లాభదాయకమైన ఉపాధి దిశగా తీసుకువెళ్ళడానికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలిపారు. నాన్ బ్యాంకిగ్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎన్.బి.ఎఫ్.సి), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్.ఎఫ్.సి), మైక్రో ఫైనాన్స్ సెక్టార్ మరియు పవర్ కు వ్యాపారానికి పన్ను ఉపశమనం, ప్రభుత్వ సేకరణలో కాంట్రాక్టర్లకు కాంట్రాక్టు కట్టుబాట్ల నుంచి ఉపశమనం మరియు రియల్ ఎస్టేట్ రంగానికి సమ్మతి మరియు వ్యాపారాలకు సహాయపడడానికి, ఆర్థిక కార్యకలాపాలకు మద్ధతు ఇవ్వడానికి ఇది మద్దతు ఇస్తుందని తెలిపారు.

రెండో భాగంలో వలస కార్మికులు, వీధి వ్యాపారులు, వలస పట్టణ పేదలు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి ప్రజలు, చిన్నకారు రైతులు మరియు గృహ నిర్మాణాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చగలవని శ్రీ మాండవియ అన్నారు. మోడీ ప్రభుత్వ పేదలకు అనుకూల విధానాలను నమ్ముతోందని, పేదలకు సహాయం చేయడానికి మద్దతు ఇవ్వడానికి తగిన జాగ్రత్తలు తీసుకుందని ఆయన తెలిపారు. 

శ్రీ మాండవీయ మాట్లాడుతూ, దేశంలోని శ్రమించే అన్నదాతలు, రైతులు మరియు పొలాల్లో పనిచేసే వారి ప్రయోజనాలను మూడో వంతు చూసుకున్నారు. వ్యవసాయం, మత్స్య, పశుసంవర్థక, తేనెటీగల పెంపకం, ఔషధ మొక్కలు, సరఫరా గొలుసు మొదలైనవి కేంద్రీకృతమై ఉన్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ ఎరుగని ఈ సంక్షోభం విషయంలో సకాలంలో దృష్టి సారించి, తగిన విధంగా స్పందించినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ మాండవీయ, ప్రధానమంత్రి శ్రీ మోడీ, దేశ జి.డి.పి.లో 10 శాతం మొత్తం మేర ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అమలు తర్వాత దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

 

***



(Release ID: 1624211) Visitor Counter : 228