పర్యటక మంత్రిత్వ శాఖ

"దేఖో అప్నా దేశ్‌" సిరీస్‌లో భాగంగా మైసూర్ యొక్క శ‌తాబ్దాల పురాత‌న‌మైన హ‌స్త క‌ళ‌ల‌ను ‘మైసూర్ః క్రాఫ్ట్ కార్వాన్ ఆఫ్ క‌ర్ణాట‌క‌’ అనే వెబ్‌నార్‌లో ప‌రిచ‌యం చేసిన పర్యాటక మంత్రిత్వ శాఖ

Posted On: 15 MAY 2020 1:02PM by PIB Hyderabad

భారతదేశం యొక్క గొప్ప హస్తకళ వారసత్వాన్ని ప్రదర్శించడానికి మరియు సందర్శకులకు మరియు పర్యాటకులకు వాటిని అందుబాటులో తెచ్చేందుకు వీలుగా పర్యాటక మంత్రిత్వ శాఖ
"దేఖో అప్నా దేశ్‌" సిరీస్‌లో భాగంగా ‘మైసూర్ః క్రాఫ్ట్ కార్వాన్ ఆఫ్ క‌ర్ణాట‌క‌’ అనే వెబ్‌నార్‌ను నిర్వ‌హించింది. ఇందులో చన్నాపట్నం బొమ్మ‌లు, రోజ్‌వుడ్ పొదుగుల‌తో కూడిన హ‌స్త క‌ళ‌ల‌ను
ప‌రిచ‌యం చేశారు. మైసూరు నగరం చుట్టూ శతాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న ఆయా హ‌స్త‌
క‌ళ‌ల‌ను ఈ వెబ్‌నార్ ద్వారా ప‌రిచ‌యం చేశారు. ఈ నెల 14న "దేఖో అప్నా దేశ్‌" వెబ్‌నార్ సిరీస్ 19వ సెషన్‌ను నిఫ్ట్ బెంగళూరు డైరెక్టర్ శ్రీమతి సుసాన్ థామస్‌తో పాటు నిఫ్ట్ బెంగళూరు
ఫ్యాక‌ల్టీలు డాక్ట‌ర్ య‌తీంద్ర ల‌క్క‌న్న, శ్రీ‌మ‌తి శిల్పారావులు స‌మ‌ర్పించారు. భారతదేశ మగ్గాలు మరియు హ‌స్త క‌ళ‌ల‌ గొప్పతనాన్ని వివ‌రించి తెలిపారు. పర్యాటక పటంలో దేశీయ హస్తకళలకు చోటు ల‌భించేలా త‌గిన తోడ్పాటు అందించాల్సి ఉంద‌ని అన్నారు. మైసూరు న‌గ‌ర‌ సందర్శకులు
అంత‌గా వెలుగులోకి రాని అంశాల‌ను తెలుసుకొనేందుకు మ‌రియు స‌మీపంలోని చుట్టుప‌క్క‌ల ఉన్న‌ హ‌స్త‌క‌ళాకారుల పట్టణాలు మరియు గ్రామాలను వీక్షించేందుకు వీలుంద‌ని ఈ ప్ర‌జెంటేష‌న్ ద్వారా తెలియ‌జేశారు. ఈ ప్రాంతాల్లోని వారు మైసూరుకు చెందిన‌ వైవిధ్యమైన వివిధ హస్తకళల రూపాలను సంరక్షించేందుకు మరియు పెంపొందించడానికి ఎలా సహాయపడుతున్నారు అనే   విష‌యాన్ని కూడా ఈ వెబ్‌నార్‌లో తెలిపారు. హ‌స్త క‌ళ‌లు భారత దేశ‌పు గొప్ప వారసత్వం మరియు సంస్కృతిలో అంత‌ర్భాగమే కాకుండా అవి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బింధువుగా మారవ‌చ్చని తెలిపారు.

ప్రధానమంత్రి పిలుపు మేరకు  ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ‘ఆత్మనిర్భ‌ర్ భారత్’లో హ‌స్త‌క‌ళ‌ల ప‌ర్య‌ట‌కంను ప్రోత్స‌హించ‌డంతో పాటు ఈ వ్యాప‌కంలో ఉన్న స‌మాజానికి త‌గిన మద్దతును ఇవ్వడం, ఉపాధి కల్పించడం మరియు పర్యావరణ సమస్యలపై రాజీ పడకుండా దేశంలో సామాజిక సమైక్యతను పెంపొందించడం ద్వారా పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభవాలను అందించ‌నున్నారు. భారత సాంప్రదాయ హస్తకళలు దేశంలోని గ్రామాలు మరియు పట్టణాలను ఆర్థికశక్తి కేంద్రంగా మార్చగల స‌త్తాను కలిగి ఉన్నాయ‌ని అన్నారు.
86,456 మంది వీక్షకులు..
"దేఖో అప్నా దేశ్‌" వెబ్‌నార్ సిరీస్ ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీని ప్రారంభించబడింది, ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో 19 సెషన్లను నిర్వహించ‌బ‌డ్డాయి. ఇది దేశవ్యాప్తంగా భారతదేశం అందించే విభిన్న పర్యాటక ఉత్పత్తులు మరియు అనుభవాలను గురించి వెబ్‌నార్ ద్వారా ఔత్సాహికుల‌కు తెలియ ప‌రుస్తున్నారు. ఈ సిరీస్‌ను ఇప్పటి వరకు 86,456 మంది వీక్షకులు తిల‌కించారు.
ఎంఈఐటీవై త‌గిన తోడ్పాటు..
ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) రూపొందించిన జాతీయ ఈ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఈజీడీ) "దేఖో అప్నా దేశ్‌"‌ వెబ్‌నార్ల‌ను నిర్వ‌హించ‌డంలో చాలా కీల‌క భూమిక‌ను పోషిస్తోంది. ఈ వెబ్‌నార్ల నిర్వ‌హ‌ణ నిమిత్తం ఒక నిపుణులైన బృందంతో నేరుగా త‌గిన‌ సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. డిజిటల్ అనుభవ వేదికను ఉపయోగించి వెబ్‌నార్‌ల‌ను పౌరులు వీక్షించేలా చూడ‌టం పాటు భాగ‌స్వామ్య ప‌క్షాల వారితో త‌గువిధంగా క‌మ్యూనికేష‌న్‌ను నిర్వ‌హించేందుకు ఈ బృందం ప‌ర్య‌ట‌క శాఖ‌కు త‌గిన సాంకేతిక తోడ్పాటును అందిస్తూ వ‌స్తోంది.
"దేఖో అప్నా దేశ్‌"కు ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు..
"దేఖో అప్నా దేశ్‌"  వెబ్‌నార్ సిరీస్‌కు ప్రత్యేకబ్రాండ్ గుర్తింపును తీసుకురావాల‌ని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇందుకు గాను "దేఖో అప్నా దేశ్‌" సిరీస్‌కు ప్ర‌త్యేక లోగోను అందుబాటులోకి తేవాల‌ని చూస్తోంది. ఇందుకు గాను దేశ పౌరుల నుండి సృజనాత్మక ఇన్‌పుట్‌
తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా "దేఖో అప్నా దేశ్‌"  వెబ్‌నార్ లోగో డిజైన్ పోటీని నిర్వ‌హించ‌నుంది. ఎంట్రీలు పంప‌డానికి ఈ నెల 16 ఆఖ‌రు తేదీ.
16వ తేదీ త‌దుప‌రి సిరీస్‌..
వెబ్‌నార్ల సెషన్‌లు ఇప్పుడు https://www.youtube.com/channel/ UCbzIbBmMvtv H7d6Zo_ZEHDA/ ఫీచర్‌లో అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.
మే 16వ తేదీ ఉదయం 11.00 గంటలకు షెడ్యూల్ చేయబడిన వెబ్‌నార్ యొక్క తదుపరి ఎపిసోడ్‌ ‘ఉత్తరాఖండ్: సింప్లీ హెవెన్!’ ప్ర‌సారం కానుంది. https://bit.ly/ Uttarakh andDAD అనే లింక్ ద్వారా దీనికి క‌నెక్ట్ కావొచ్చు. 

***



(Release ID: 1624139) Visitor Counter : 272